హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

FireBoltt Smartwatch: మీలో ఫైర్‌ని చూపించే సూపర్ స్మార్ట్‌వాచ్.. ఇండియాలో లాంచ్.. ధర, ఫీచర్లు ఇవిగో..!

FireBoltt Smartwatch: మీలో ఫైర్‌ని చూపించే సూపర్ స్మార్ట్‌వాచ్.. ఇండియాలో లాంచ్.. ధర, ఫీచర్లు ఇవిగో..!

ఫైర్ బోల్ట్

ఫైర్ బోల్ట్

ఫైర్-బోల్ట్ (Fire-Boltt) కంపెనీ నుంచి తాజాగా మరో కొత్త స్మార్ట్‌వాచ్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ ఇండియన్ స్మార్ట్‌వాచ్ తయారీ సంస్థ ఫైర్-బోల్ట్ రేజ్‌ (Fire-Boltt Rage) పేరుతో కొత్త బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది.

ఇంకా చదవండి ...

కరోనా తర్వాత మన దేశంలో స్మార్ట్‌వాచ్‌ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఈ వేరబుల్ ప్రొడక్ట్స్‌ను టాప్ బ్రాండ్లు హెల్త్ మానిటరింగ్ ఫీచర్లతో రూపొందిస్తున్నాయి. పెద్ద కంపెనీలతో పాటు లోకల్ బ్రాండ్లు కూడా ఈ విభాగంలో మార్కెట్ షేర్ సాధించాయి. ఈ లిస్ట్‌లో ఫైర్-బోల్ట్ (Fire-Boltt) కంపెనీ ఒకటి. ఈ బ్రాండ్ నుంచి తాజాగా మరో కొత్త స్మార్ట్‌వాచ్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ ఇండియన్ స్మార్ట్‌వాచ్ తయారీ సంస్థ ఫైర్-బోల్ట్ రేజ్‌ (Fire-Boltt Rage) పేరుతో కొత్త బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఇది స్క్వేర్ షేప్ డయల్‌తో వస్తుంది. దీని ధర రూ.3,000 కంటే తక్కువ ప్రైజ్ రేంజ్‌లో ఉంది. ఇది అమెజాన్, ఫైర్-బోల్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఫైర్‌బోల్ట్ రేజ్ స్మార్ట్‌వాచ్ 60 స్పోర్ట్స్ మోడ్స్, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, 100 కస్టమ్ ఫేసెస్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఫైర్-బోల్ట్ రేజ్ బ్యాటరీ లైఫ్ ఏడు రోజుల వరకు ఉంటుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. దీని ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.

* ఫైర్-బోల్ట్ రేజ్ ధర

ఇండియాలో Fire-Boltt Rage స్మార్ట్‌వాచ్ ధర రూ. 2,499. ప్రస్తుతం దీన్ని అమెజాన్, ఫైర్-బోల్ట్ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఫైర్‌బోల్ట్ రేజ్ స్మార్ట్‌వాచ్.. బ్లాక్, గ్రే, రోజ్ గోల్డ్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇది ఆఫ్‌లైన్ రిలైల్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చే విషయంపై స్పష్టత లేదు.


* ఫైర్-బోల్ట్ రేజ్ ఫీచర్లు

ఫైర్-బోల్ట్ రేజ్ స్మార్ట్‌వాచ్ 240x 240 పిక్సెల్స్ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేసే 1.28-అంగుళాల సర్క్యులర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 100 కంటే ఎక్కువ వాచ్ ఫేసెస్‌కు సపోర్ట్ చేస్తుంది. నావిగేషన్, మెను ఆప్షన్స్‌ను యాక్సెస్ చేయడానికి సైడ్-మౌంటెడ్ బటన్‌ను ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్, iOSలో అందుబాటులో ఉన్న బోల్ట్ ప్లే యాప్ (Boltt Play app) ద్వారా యూజర్లు తమకు ఇష్టమైన క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేస్‌ని ఎంచుకోవచ్చు. SpO2 సెన్సార్, స్లీప్ ట్రాకింగ్ ఫీచర్‌ మానిటర్ కోసం ఇందులో HRS3600 చిప్‌ను పొందుపరిచారు. ఈ డివైజ్ 60 స్పోర్ట్స్ మోడ్స్, స్టెప్ కౌంటింగ్, క్యాలరీ బర్న్ ఫీచర్లతో వస్తుంది. దీంట్లోని 200mAh బ్యాటరీ ఒక్క ఛార్జ్‌తో 7 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. ఫైర్-బోల్ట్ రేజ్ IPX68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ప్రొడక్ట్ బ్లూటూత్ 5.1 సపోర్ట్‌తో వస్తుంది.

* మరో ప్రొడక్ట్ కూడా..

ఫైర్-బోల్ట్ మరో ప్రొడక్ట్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. Fire-Boltt Ring 3 పేరుతో కొత్త స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ త్వరలో లాంచ్ చేయనుంది. 1.8-అంగుళాల డిస్‌ప్లే, 118 స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్, SpO2 సెన్సార్, బ్లూటూత్ కాలింగ్ ఫంక్షన్, ఇన్-బిల్ట్ గేమ్స్, IP67 రేటింగ్, వాయిస్ అసిస్టెంట్‌ వంటి ఫీచర్లతో ఈ డివైజ్‌ రానుంది.

First published:

Tags: Digital, New feature, Smart watch, Tech news

ఉత్తమ కథలు