హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Fire Boltt Cobra: అడ్వెంచర్ లవర్స్‌ కోసం సూపర్ వాచ్.. యాపిల్ వాచ్ కి ధీటుగా ‘ఫైర్‌బోల్ట్ కోబ్రా’..

Fire Boltt Cobra: అడ్వెంచర్ లవర్స్‌ కోసం సూపర్ వాచ్.. యాపిల్ వాచ్ కి ధీటుగా ‘ఫైర్‌బోల్ట్ కోబ్రా’..

Fire Boltt Cobra: అడ్వెంచర్ లవర్స్‌ కోసం సూపర్ వాచ్..  యాపిల్ వాచ్ కి ధీటుగా ‘ఫైర్‌బోల్ట్ కోబ్రా’..

Fire Boltt Cobra: అడ్వెంచర్ లవర్స్‌ కోసం సూపర్ వాచ్.. యాపిల్ వాచ్ కి ధీటుగా ‘ఫైర్‌బోల్ట్ కోబ్రా’..

Fire Boltt Cobra: దేశీయ వేరబుల్స్‌ అండ్ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ ఫైర్ బోల్ట్ సరికొత్త వాచ్‌ను పరిచయం చేసింది. కోబ్రా పేరుతో మొట్టమొదటి స్ట్రాంగెస్ట్ స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

అడ్వెంచర్స్‌ బాగా ఇష్టపడే వారికి మామూలు స్మార్ట్‌వాచ్‌లు (Smartwatches) అసలు సూట్ కావు. వారికి చాలా బలమైన, ఎలాంటి పరిస్థితులలోనైనా తట్టుకోగల రగ్గడ్ స్మార్ట్ వాచ్‌లు కావలసి ఉంటుంది. అయితే ఇలాంటి స్ట్రాంగెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు బడ్జెట్ ధరల్లో అందుబాటులో లేక ఇండియన్ యూజర్లు బాగా నిరాశ పడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారందరికీ దేశీయ వేరబుల్స్‌ అండ్ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ ఫైర్ బోల్ట్ (Fire Boltt) గుడ్‌న్యూస్ చెప్పింది. కోబ్రా (Cobra) పేరుతో మొట్టమొదటి స్ట్రాంగెస్ట్ స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్‌ను అడ్వెంచర్స్‌ చేసేవారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ధర కేవలం రూ.3,499 మాత్రమే. ఇది ఫ్లిప్‌కార్ట్, ఫైర్ బోల్ట్‌.కామ్ వెబ్‌సైట్లలో జనవరి 31 నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

కోబ్రా స్మార్ట్‌వాచ్ 1.78-అంగుళాల ఆల్వేస్-ఆన్ AMOLED డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, వివిధ స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. ఈ డివైజ్ డస్ట్, నీళ్ల వంటి సవాళ్లతో కూడిన పర్యావరణ పరిస్థితులలో అనేక క్లిష్టమైన పరీక్షలను పాస్ అయ్యింది. దీన్ని నీళ్లలో తడపడంతో పాటు బాగా ప్రెషర్ చేసి కూడా టెస్ట్ చేశారు.

ఆ టఫ్‌నెస్ టెస్టులలోనూ కోబ్రా వాచ్ పాస్ అయ్యింది. ఈ వాచ్ సాలిడ్ గ్రీన్, సాలిడ్ బ్లాక్, Camouflage గ్రీన్, Camouflage బ్లాక్ సహా నాలుగు కలర్ ఆప్షన్స్‌లో రిలీజ్ అయింది. కోబ్రా అనేది కంపెనీ ఔట్‌డోర్ సిరీస్ నుంచి వచ్చిందని ఫైర్ బోల్ట్ సహ-వ్యవస్థాపకులు ఆయుషి కిషోర్, అర్నవ్ కిషోర్ పేర్కొన్నారు.

* కోబ్రా స్మార్ట్‌వాచ్ ఫీచర్స్

కోబ్రా స్మార్ట్‌వాచ్ 123 స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. అంతేకాకుండా, ఇది యూజర్ల వర్కౌట్ సెషన్‌లకు సంబంధించి స్మాల్ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేసే ఇంటలిజెంట్ స్పోర్ట్స్ అల్గారిథమ్‌ను ఆఫర్ చేస్తుంది. 500 నిట్స్ బ్రైట్‌నెస్, 60Hz రిఫ్రెష్ రేట్, 368×448 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్ దీని ప్రత్యేకతలు. యూజర్లు మల్టిపుల్ వాచ్ ఫేస్‌లు, లేఅవుట్ కష్టమైజేషన్లను కూడా ట్రై చేయవచ్చు. 24×7 డైనమిక్ హార్ట్ రేటు మానిటరింగ్, SpO2 మానిటరింగ్, ఫిమేల్ హెల్త్ కేర్, స్లీప్ మానిటరింగ్ వంటి ఉపయోగకర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి : ఫేస్‌బుక్ వల్ల ఫోన్ బ్యాటరీ ఫసక్.. సంచలనం రేపుతున్న మాజీ ఉద్యోగి ఆరోపణలు!

కోబ్రా సింగిల్ ఛార్జ్‌పై 15 రోజుల పాటు పనిచేస్తుంది. బ్యాటరీ-సేవర్ మోడ్ ఆన్‌లో ఉంటే.. 30 రోజుల వరకు నిరంతరాయంగా ఉపయోగించవచ్చు. ఇది ఔట్‌డోర్ యాక్టివిటీలకు కూడా అనుకూలమైన డివైజ్‌ అని ఫైర్ బోల్ట్ పేర్కొంది. ఫైర్-బోల్ట్ కోబ్రా హై-క్వాలిటీ బ్లూటూత్ కాలింగ్ కోసం ఇన్-బిల్ట్ స్పీకర్, మైక్‌తో కూడా వస్తుంది. అదనపు ఫీచర్లలో రిమోట్ కెమెరా కంట్రోల్స్, మ్యూజిక్ కంట్రోల్స్, ఇన్-బిల్ట్ గేమ్‌లు, AI వాయిస్ అసిస్టెంట్, పీరియాడికల్ హెల్త్ రిమైండర్లు, వెదర్ అలర్ట్స్‌, అలారం క్లాక్ , టైమర్, ఫ్లాష్‌లైట్, స్టాప్‌వాచ్ వంటివి కూడా ఉన్నాయి.

First published:

Tags: Apple, Smartwatch, Tech news

ఉత్తమ కథలు