Apple Watch | మీరు కొత్త స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే మీకోసం అదిరే స్మార్ట్ వాచ్ (Smart Watch) ఒకటి మార్కెట్‌లోకి వచ్చింది. దేశీ కంపెనీ ఫైర్ బోల్డ్ తాజాగా గ్లాడియేటర్ పేరుతో కొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకువచ్చింది. ఇది యాపిల్ (Apple) వాచ్ అల్ట్రా మాదిరి ఉంటుంది. ఈ యాపిల్ వాచ్ రేటు ఏకంగా రూ. 89,990. అయితే మీ ఫైర్ బోల్డ్ గ్లాడియేటర్ స్మార్ట్ వాచ్ రేటు మాత్రం తక్కువగానే ఉంది. బడ్జెట్ ధరలో దీన్ని కొనుగోలు చేయొచ్చు.
ఫైర్ బోల్ట్ గ్లాడియేటర్ స్మార్ట్ వాచ్‌లో 1.96 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. 123 స్పోర్ట్స్ మోడ్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో హార్ట్ రేటు మానిటర్ కూడా ఉంటుంది. బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ సెన్సార్ కూడా ఉంది. అలాగే ఈ కొత్త స్మార్ట్ వాచ్‌లో ఐపీ 67 రేటింగ్ ఉంది. కంపెనీ ఈ వాచ్‌కు వాటర్, డస్ట్, క్రాక్ రెసిస్టెన్స్ ఉందని పేర్కొంటోంది. ఈ ఫైర్ బోల్డ్ గ్లాడియేటర్ స్మార్ట్ వాచ్ రేటు రూ. 2,499గా ఉంది. అమెజాన్‌లో మీరు ఈ స్మార్ట్ వాచ్‌ను కొనొచ్చు. డిసెంబర్ 30 నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతాయి.
కొత్తగా స్కూటర్ కొనే వారికి బంపరాఫర్.. రూ.18,000 డిస్కౌంట్, జీరో డౌన్‌పేమెంట్ ఫెసిలిటీ!
అల్ట్రా న్యారో ఫ్రేమ్ డిజైన్‌తో ఈ స్మార్ట్ వాచ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. స్పీకర్లు, మైక్రో ఫోన్స్ ఉంటాయి. అలాగే యూజర్లు నేరుగా ఈ స్మార్ట్ వాచ్ నుంచే కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఐదు జీపీఎస్ అసిస్టెడ్ మోడ్స్ ఉన్నాయి. జీపీఎస్ రన్నింగ్, జీపీఎస్ వాకింగ్, జీపీఎస్ సైక్లింగ్, జీపీఎస్ ఫుట్, జీపీఎస్ ట్రైల్ వంటివి ఇవని చెప్పుకోవచ్చు.
ఈ క్రెడిట్ కార్డులు వాడే వారికి గుడ్ న్యూస్!
ఇంకా ఈ స్మార్ట్ వాచ్‌లో స్లీప్ మానిటరింగ్, ఎస్‌పీఓ2 మానిటరింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ లైఫ్ 7 రోజులు ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. ఇక స్టాండ్ బై 20 రోజులు ఉంటుందని తెలియజేస్తోంది. ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఇంకా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉపయోగిస్తే 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ పేర్కొంటోంది. పది నిమిషాలు చార్జింగ్ పెడితే రోజంతా బ్యాటరీ వస్తుందని తెలియజేస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్ వాచ్ నాలుగు రంగుల్లో లభ్యం అవుతోంది. బ్లాక్, బ్లూ, గోల్డ్, బ్లాక్ అండ్ గోల్డ్ రంగుల్లో ఇది లభిస్తోంది. ఇంకా ఇందులో క్యాలిక్యులేటర్, వెదర్, అలారం యాప్స్ ప్రిఇన్‌స్టాల్ చేసి ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apple, Smart watch, Smartwatch, Watch