FIRE BOLTT ALMIGHTY PRICE IN INDIA RS 4999 FEATURES SPECIFICATIONS GH VB
Smart Watch: ఇలాంటి Smart Watch మీరెప్పుడు చూసి ఉండరు.. 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ తో.. అదిరిపోయే ఫీచర్లు..
ప్రతీకాత్మక చిత్రం
Smart Wathch: ప్రముఖ సంస్థ స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ప్రీమియం స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది. గూగుల్, సిరి వాయిస్ అసిస్టెంట్లకు మద్దతిస్తుంది. అంతే కాకుండా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి.
కరోనా తర్వాత ఆడియో ఉత్పత్తులు, స్మార్ట్‌వాచ్‌లకు భారీ డిమాండ్ పెరిగింది. ఎప్పటికప్పుడు హార్ట్ రేటు మానిటరింగ్ చేసుకునే అవకాశం ఉండటంతో స్మార్ట్‌వాచ్‌ల సేల్స్ బాగా పెరిగాయి. దీంతో ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ స్మార్ట్ బ్రాండ్లు వరుసగా స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ఫైర్-బోల్ట్ సంస్థ ఆల్మైటీ (Fire-Boltt Almighty) స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ప్రీమియం స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది.
గూగుల్, సిరి వాయిస్ అసిస్టెంట్లకు మద్దతిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను ధరించడం ద్వారా బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవల్ (SpO2), హార్ట్ రేటు, బ్లడ్ ప్రెజర్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. ఇది వాటర్, స్వెట్ రెసిస్టన్స్‌కు కూడా మద్దతిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 10 -రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది.
ఫైర్-బోల్ట్ ఆల్మైటీ ధర, లభ్యత..
కొత్త ఫైర్-బోల్ట్ ఆల్మైటీ స్మార్ట్‌వాచ్ రూ. 4,999 ధర వద్ద లభిస్తుంది. ఇది త్వరలోనే ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి రానుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫామ్‌పై ‘కమింగ్ సూన్’ అంటూ టీజ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని రూ. 4,999 ధర వద్ద లిస్ట్ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ మొత్తం 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఫైర్ బోల్డ్ ఆల్మైటీ స్మార్ట్‌వాచ్ బ్లాక్, బ్లూ, బ్రౌన్, బ్లాక్/బ్రౌన్, మ్యాట్ బ్లాక్, ఆరెంజ్ అనే ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
smartwatch
ఫైర్-బోల్ట్ ఆల్మైటీ స్పెసిఫికేషన్లు..
ఫైర్బోల్డ్ ఆల్మైటీ1.4- అంగుళాల AMOLED టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. IP67 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టన్స్ను అందించింది. ఫైర్బోల్డ్ ఆల్మైటీ స్మార్ట్‌వాచ్ యూఎస్పీ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, ఇన్‌బిల్ట్ స్పీకర్, మైక్రోఫోన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ మొత్తం 11 స్పోర్ట్స్ మోడ్లకు మద్దతిస్తుంది. వాకింగ్, సైక్లింగ్ మోడల్‌కు కూడా ఇది మద్దతిస్తుంది. కొత్త ఫైర్-బోల్ట్ ఆల్మైటీ SpO2 సెన్సార్లతో వస్తుంది.
దీని ద్వారా 24 -గంటల డైనమిక్ హార్ట్ రేట్ ట్రాకింగ్ చేయవచ్చు. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. అధునాతన స్లీప్ ట్రాకింగ్, ఇంటిగ్రేటెడ్ బ్రీత్ మోడ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ వంటివి ఉన్నాయి. ఇక, బ్యాటరీ విషయానికొస్తే, ఇది ఒక ఛార్జ్‌పై 10-రోజుల రన్ టైమ్‌ను అందిస్తుంది. ఇది స్మార్ట్ నోటిఫికేషన్లు, మ్యూజిక్ ప్లేబ్యాక్, కెమెరా కంట్రోలింగ్‌ను కూడా అందిస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.