Fire-Boltt Agni: అతి తక్కువ ధరలో మార్కెట్లోకి విడుదలైన స్మార్ట్‌ వాచ్‌.. పూర్తి వివరాలు ఇలా..

స్మార్ట్ వాచ్

ఫైర్ బోల్ట్ సంస్థ నుంచి ‘ఫైర్‌ బోల్ట్‌ అగ్ని’ అనే స్మార్ట్‌ వాచ్‌ మార్కెట్‌లోకి వచ్చింది. ఇందులో మెన్‌స్ట్రువల్‌ రిమైండర్స్ ఆప్షన్‌ ప్రముఖంగా ఇస్తున్నారు. మరి ఈ స్మార్ట్‌ వాచ్‌ ఇతర ఫీచర్లేంటి, ధర ఎంత అనే విషయాలు తెలుసుకుందాం.

  • Share this:
కరోనా వచ్చాక ఎస్‌పీవో2 చెకింగ్‌ ఇప్పుడు అవసరమైన అంశంగా మారింది. అలాగే హార్ట్‌ బీట్‌ రేట్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయడమూ ముఖ్యం. ఈ క్రమంలో ఇలాంటి ఎన్నో ఫీచర్లున్న స్మార్ట్ వాచ్‌ల వినియోగం పెరిగింది. అందులోనూ ఎస్‌పీవో2 ఫీచర్‌ ఉన్నవాటికి ఆదరణ పెరగుతోంది. దీంతో చాలా సంస్థలు అలాంటి వాచ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అలా ఫైర్ బోల్ట్ సంస్థ నుంచి ‘ఫైర్‌ బోల్ట్‌ అగ్ని’ అనే స్మార్ట్‌ వాచ్‌ మార్కెట్‌లోకి వచ్చింది. ఇందులో మెన్‌స్ట్రువల్‌ రిమైండర్స్ ఆప్షన్‌ ప్రముఖంగా ఇస్తున్నారు. మరి ఈ స్మార్ట్‌ వాచ్‌ ఇతర ఫీచర్లేంటి, ధర ఎంత అనే విషయాలు తెలుసుకుందాం. ఫైర్‌ బోల్ట్‌ అగ్ని స్మార్ట్ వాచ్‌ 80 గ్రాముల బరువు ఉంటుంది. 1.4 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌ ఇస్తున్నారు. 2.5డి కర్వడ్‌ గ్లాస్‌ ఉంటుంది. దీని బ్రైట్‌ నెస్‌ 400 నిట్స్‌గా ఉంటుంది. ఐవోఎస్‌ 9 ఆ పైన, ఆండ్రాయిడ్‌ 4.4 ఆ పైన వెర్షన్లకు ఈ వాచ్‌ పని చేస్తుంది. స్టాండ్ బై మోడ్‌లో వాచ్‌ బ్యాటరీ 30 రోజుల బ్యాకప్‌ ఇస్తుంది. రెండుగంటలు ఛార్జింగ్‌ పెడితే.. బ్యాటరీ ఫుల్‌ అవుతుంది.

స్లీప్‌ట్రాకర్‌, కరిగిన కెలోరీలు, నడిచిన దూరం, స్లీప్‌ మోనిటరింగ్‌, రిమోట్‌ మ్యూజిక్‌ కంట్రోల్‌, సెడెంట్రీ రిమైండర్స్‌ లాంటి పీచర్లు ఉన్నాయి. ఇందులో 200+ క్లౌడ్‌ బేస్డ్‌ వాచ్‌ ఫేసెస్‌ ఉన్నాయి. దీంతోపాటు మహిళకు ఉపయోగపడేలా రుతుక్రమం గురించి తెలిపేలా రిమైండర్స్‌ ఆప్షన్‌ ఇస్తున్నారు. పీరియడ్స్‌ ట్రాకింగ్‌, ఒవెల్యూషన్‌, పెరిటైల్‌ డేస్‌ లాంటి వివరాలు కూడా ఉంటాయి. వాచ్‌తో మెటల్‌తో రూపొందిన ఈ వాచ్‌ చతురస్రాకార ఆకారంలో ఉంటుంది. ఇందులో 24X7 హార్ట్‌ రేట్‌ మానిటరింగ్‌ ఆప్షన్‌ ఉంటుంది. స్లీప్‌ ప్యాట్రన్‌ కూడా ఇది ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తూ ఉంటుంది. ఈ వాచ్‌లో ఐపీఎక్స్‌ 7 వాటర్‌ రెసిస్టెన్స్‌ ఉంటుంది. దీంతో నడక, ఫుట్‌బాల్‌, సైక్లింగ్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్, స్కిప్పింగ్‌ లాంటి స్పోర్ట్స్‌ మోడ్స్‌ కూడా ఉన్నాయి.

ఒకసారి ఫుల్‌ ఛార్జి పెడితే ఎనిమిది రోజుల వరకు ఈ వాచ్‌ బ్యాటరీ బ్యాకప్‌ వస్తుంది. ఫైర్‌ బోల్ట్‌ అగ్ని స్మార్ట్‌ వాచ్‌ ధర ₹2,999. బ్లాక్‌, పింక్‌ స్ట్రాప్స్‌తో ఈ వాచ్‌ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్స్‌లో ఈ వాచ్‌ అందుబాటులో ఉంది. దీంతోపాటు రిలయన్స్‌ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. ఈ వాచ్‌కు ఒక సంవత్సరం వారెంటీ ఇస్తున్నారు. ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.
Published by:Veera Babu
First published: