హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Fire Bolt Celsius: 120+ స్పోర్ట్స్ మోడ్స్‌తో ఫైర్‌ బోల్ట్ సెల్సియస్ స్మార్ట్‌వాచ్‌.. ఫీచర్స్‌, ప్రైస్‌ వివరాలు ఇవే..

Fire Bolt Celsius: 120+ స్పోర్ట్స్ మోడ్స్‌తో ఫైర్‌ బోల్ట్ సెల్సియస్ స్మార్ట్‌వాచ్‌.. ఫీచర్స్‌, ప్రైస్‌ వివరాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫిట్నెస్‌ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉపయోగపడేలా 120+ స్పోర్ట్స్ మోడ్స్‌తో ఫైర్ బోల్ట్ సెల్సియస్ స్మార్ట్‌వాచ్‌ ఇండియాలో లాంచ్ అయింది. ఈ లేటెస్ట్ వాచ్‌ వివరాలు ఇలా..

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ఈ రోజుల్లో ఎక్కువ మందికి, ముఖ్యంగా యువతకు ఆరోగ్యంపై శ్రద్ధ కనిపిస్తోంది. రోజులో కొంత సమయాన్ని వ్యాయామం చేయడానికి కేటాయిస్తున్నారు. టెక్నాలజీ సాయంతో ఎప్పటికప్పుడు తమ శరీరాన్ని పర్యవేక్షించుకుంటూ, దానికి తగిన విధంగా వ్యాయామాలు చేస్తూ ఆహార నియమాలు పాటిస్తున్నారు. ప్రతిరోజు శరీరంలో జరుగుతున్న మార్పులను టెక్నాలజీ(Technology) సాయంతో ట్రాక్‌(Track) చేయవచ్చు. స్మార్ట్ వాచీలు, పల్స్ ఇండికేటర్లు, బాడీ మానిటరింగ్ ట్రాకింగ్ వంటి ప్రొడక్టులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఫిట్నెస్‌ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉపయోగపడేలా 120+ స్పోర్ట్స్ మోడ్స్‌తో(Sports Modes) ఫైర్ బోల్ట్ సెల్సియస్ స్మార్ట్‌వాచ్‌ ఇండియాలో(Smartwatch India) లాంచ్ అయింది. ఈ లేటెస్ట్ వాచ్‌ వివరాలు ఇలా..

ఫైర్ బోల్ట్ సెల్సియస్(Fire Bolt Celsius)

120+ స్పోర్ట్స్ మోడ్స్‌తో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌వాచ్‌ ఫిట్నెస్‌పై దృష్టి సారించే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇది ఎప్పటికప్పుడు బాడీ హార్ట్‌రేట్‌ని, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, స్లీప్ సైకిల్‌ ట్రాక్‌ చేస్తుంటుంది. శరీరంలో వచ్చే మార్పులపై వినియోగదారులను తరచూ అలెర్ట్‌ చేస్తుంటుంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ.. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో సాయం చేస్తుంది.

 కస్టమర్‌లను ఆకట్టుకొనేలా ప్రొడక్టులు

ఫైర్ బోల్ట్ కంపెనీ కో ఫౌండర్స్ ఆయుషి, అర్ణవ్ కిషోర్ ఈ స్మార్ట్‌వాచ్‌ గురించి మాట్లాడుతూ.. తమ కస్టమర్లకు మెరుగైన ఫీచర్‌లతో ప్రొడక్టులు అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఈ సెల్సియస్ స్మార్ట్‌వాచ్‌ మోడల్‌తో అతిపెద్ద HD డిస్‌ప్లేతో పాటు బాడీ టెంపరేచర్ మానిటరింగ్ ఫీచర్‌ని అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా తర్వాత ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, అటువంటి వారికి ఈ వాచ్ బెస్ట్‌ ఆప్షన్‌ అని తెలిపారు. కస్టమర్ యాక్టివ్‌ లైఫ్‌ను ప్రోత్సహిస్తూ.. శరీర అవయవాల పనితీరును నిరంతరం ట్రాక్‌ చేస్తూ, ఎప్పటికప్పుడు వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని ఈ స్మార్ట్‌వాచ్‌ అందిస్తుందని పేర్కొన్నారు.

Nursing Jobs: నర్సింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.1.50 లక్షల వేతనంతో ఉద్యోగాలు ..

ఫైర్ బోల్ట్ సెల్సియస్ ఫీచర్స్

సెల్సియస్ స్పోర్ట్స్ వాచ్‌లో 1.91 అంగుళాల అతిపెద్ద HD డిస్‌ప్లే ఉంటుంది. 240×296 పిక్సెల్స్ రెసొల్యూషన్‌తో కాంతివంతమైన, ఆకర్షణీయమైన అవుట్‌పుట్‌ అందిస్తుంది. ఇన్‌బిల్ట్‌ థర్మల్ సెన్సార్ ద్వారా ఎప్పటికప్పుడు శరీర ఉష్ణోగ్రతను ట్రాక్ చేస్తూ డేటాను అందిస్తూ ఉంటుంది. బ్లాక్, పింక్, సిల్వర్, గోల్డ్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ రూ.1799లకు ఫ్లిప్‌కార్ట్‌లో, ఫైర్‌బోల్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తుంది. 9.2mm మందంతో మెటాలిక్ బాడీతో రూపొందిన ఈ వాచ్‌ లైట్ వెయిట్, స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. వాచ్‌ని స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇన్‌కమింగ్‌ కాల్స్‌, మెసేజ్‌ల నోటిఫికేషన్లు పంపుతుంది. IP67 రేటింగ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. స్టైల్‌, ఈవెంట్‌కి తగిన విధంగా వాచ్ ఫేసెస్ మార్చుకునే అవకాశం ఉంది.

First published:

Tags: 5G Smartphone, Bolt, Smart watch

ఉత్తమ కథలు