2019లో వాట్సప్‌లో కొత్తగా వచ్చే ఫీచర్లు ఇవేనా?

గతేడాది వాట్సప్ రిలీజ్ చేసిన స్టిక్కర్ ఫీచర్ యూజర్లు అందరినీ ఆకట్టుకుంది. కాకపోతే స్టిక్కర్ సెర్చ్ ఆప్షన్ లేదు. ఈ ఆప్షన్ ఎమొజీ, గిఫ్ ఫైల్స్‌కు ఉంది. స్టిక్కర్స్‌కి కూడా సెర్చ్ ఆప్షన్ ఇస్తే ఆ లోటు కూడా తీరినట్టే.

news18-telugu
Updated: January 5, 2019, 7:33 AM IST
2019లో వాట్సప్‌లో కొత్తగా వచ్చే ఫీచర్లు ఇవేనా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాట్సప్... ఎవరు ఔనన్నా, కాదన్నా స్మార్ట్‌ఫోన్ యూజర్లలో ఫుల్ క్రేజ్ ఉన్న మెసేజింగ్ సర్వీస్. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది యాక్టీవ్ యూజర్స్ ఉంటారని అంచనా. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది వాట్సప్. గతేడాది యూజర్లకు సరికొత్త ఫీచర్లతో సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ ఏడాది కూడా మరిన్ని ఫీచర్లు రాబోతున్నాయి. 2019లో వాట్సప్‌లో కొత్తగా వచ్చే ఫీచర్లు ఇవే అంటూ వాట్సప్ యూజర్లలో తెగ ప్రచారం జరుగుతోంది. అవేంటో తెలుసుకోండి.

డార్క్ మోడ్

త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లల్లో వాట్సప్ డార్క్ మోడ్ ఫీచర్ రాబోతోంది. ఇప్పటికే ట్విట్టర్, యూట్యూబ్ లాంటి అనేక యాప్స్‌లో డార్క్ మోడ్ ఫీచర్ ఉంది. ఇన్నాళ్లూ వాట్సప్‌లో ఆ లోటు ఉండేది. అయితే కొన్ని నెలలుగా డార్క్‌ మోడ్‌పై ప్రయోగాలు చేస్తోంది వాట్సప్. ఇంకొన్ని రోజుల్లోనే యూజర్లకు డార్క్ మోడ్ ఆప్షన్ అందించనుంది. డార్క్‌మోడ్‌తో చీకట్లో కళ్లను కాపాడుకోవడం మాత్రమే కాదు... బ్యాటరీ కూడా ఆదా చేసుకోవచ్చు.

మీడియా ప్రివ్యూ
నోటిఫికేషన్ షేడ్‌లోనే మీడియా ప్రివ్యూ ఫీచర్‌ వస్తుందని మరో అంచనా. ప్రస్తుతం టెక్ట్స్ మెసేజ్‌ని మాత్రమే నోటిఫికేషన్ షేడ్‌లో చూడొచ్చు. మీడియా ప్రివ్యూ ఫీచర్ వచ్చిందంటే ఫోటో, వీడియో, గిఫ్ ఫైల్స్‌ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా చూడొచ్చు.

స్టిక్కర్ సెర్చ్
గతేడాది వాట్సప్ రిలీజ్ చేసిన స్టిక్కర్ ఫీచర్ యూజర్లు అందరినీ ఆకట్టుకుంది. కాకపోతే స్టిక్కర్ సెర్చ్ ఆప్షన్ లేదు. ఈ ఆప్షన్ ఎమొజీ, గిఫ్ ఫైల్స్‌కు ఉంది. స్టిక్కర్స్‌కి కూడా సెర్చ్ ఆప్షన్ ఇస్తే ఆ లోటు కూడా తీరినట్టే.కాన్‌సెక్యుటీవ్ వాయిస్ మెసేజ్
అంటే వరుసగా వాయిస్ మెసేజ్‌లు వినే ఆప్షన్. రెండు కన్నా ఎక్కువ వాయిస్ మెసేజ్‌లు వరుసగా ఉంటే మొదటి ఆడియోను ప్లే చేస్తే చాలు మిగతావి ఆటోమెటిక్‌గా ప్లే అవుతాయి. ప్రస్తుతం మాత్రం ఒక్కో ఆడియో ఫైల్‌ను మ్యాన్యువల్‌గా ప్లే చేయాల్సి వస్తుంది.

ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్
ఈ రోజుల్లో ప్రైవసీ అందరికీ ముఖ్యమైపోయింది. అందుకే మీ వాట్సప్‌లో ఎక్స్‌ట్రా లేయర్ ప్రొటెక్షన్ అందుబాటులోకి రానుంది. ఫింగర్‌ప్రింట్ ఆథరైజేషన్ ఉంటేనే వాట్సప్ యాప్ ఓపెన్ అవుతుంది. సో... మీ యాప్ భద్రమే.

ఇవి కూడా చదవండి:

వాట్సప్‌లో స్టేటస్ వాడుతున్నవారికి బ్యాడ్ న్యూస్

స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని తగ్గించుకోవడానికి 5 టిప్స్

షాక్... మీరు యాప్ వాడకున్నా ట్రాక్ చేస్తున్న ఫేస్‌బుక్

సిమ్ కార్డుతో మీ అకౌంట్ ఖాళీ... జాగ్రత్తలు తెలుసుకోండి
Published by: Santhosh Kumar S
First published: January 5, 2019, 7:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading