FIND UPI SOLUTION FOR FEATURE PHONES AND WIN RS 35 LAKH PRIZE MONEY FROM BILL GATES FOUNDATION SS
Prize Money: ఈ సమస్యకు పరిష్కారం చెబితే రూ.35 లక్షలు మీవే...
(ప్రతీకాత్మక చిత్రం)
భారతదేశంలో 2016 లో నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు, లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఇక యూపీఐ పేమెంట్స్ రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే భారతదేశంలో సగం మంది యూపీఐ పేమెంట్స్ వాడలేకపోతున్నారు.
మీకు రూ.35 లక్షలు కావాలా? అయితే ఓ కాంటెస్ట్‌లో పాల్గొనాలి. అందులో గెలిస్తే మీరు రూ.35 లక్షలు గెలుచుకోవచ్చు. బిల్ గేట్స్ ఫౌండేషన్ అందిస్తున్న అద్భుతమైన అవకాశం ఇది. భారతదేశంలో యూపీఐ పేమెంట్స్‌ని మేనేజ్ చేసే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, CII.CO కలిసి ఓ ప్రాజెక్ట్‌ను చేపట్టాయి. భారతదేశంలోని ఔత్సాహికులకు ఓ కాంపిటీషన్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్-UPI పేమెంట్స్ మొత్తం స్మార్ట్ఫోన్లలోనే జరుగుతున్నాయి. యూపీఐ ద్వారా ఎవరు ఎలాంటి పేమెంట్స్ చేయాలన్నా స్మార్ట్‌ఫోన్ కావాల్సిందే. అయితే ఫీచర్ ఫోన్లల్లో యూపీఐ సదుపాయం లేదు. ఫీచర్ స్మార్ట్‌ఫోన్లల్లో కూడా యూపీఐ పేమెంట్స్ జరిపేలా సాఫ్ట్వేర్ రూపొందించడమే ఈ కాంపిటీషన్ లక్ష్యం. ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చు.
భారతదేశంలో 2016 లో నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు, లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఇక యూపీఐ పేమెంట్స్ రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే భారతదేశంలో సగం మంది యూపీఐ పేమెంట్స్ వాడలేకపోతున్నారు. ఇందుకు కారణం ఫీచర్ ఫోన్స్ వాడుతుండటమే. ఫీచర్ ఫోన్లల్లో యూపీఐ సదుపాయం వాడుకునే అవకాశం లేదు. ఆ లోటు పూడ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చేతులు కలిపాయి. ఫీచర్ ఫోన్లల్లో కూడా యూపీఐ యాప్ వాడుకునేలా సాఫ్ట్వేర్ రూపొందించేవారికి 50,000 డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. అంటే సుమారు రూ.35.85 లక్షలు. ఇది మొదటి బహుమతి మాత్రమే. రెండో బహుమతి 30,000 డాలర్లు (రూ.21.5 లక్షలు), మూడో బహుమతి 20,000 డాలర్లు (రూ.14.34 లక్షలు). కాంపిటీషన్ 2020 జనవరి 12న ముగుస్తుంది. 2020 మార్చి 14న విజేతలను ప్రకటిస్తారు.
Redmi K20 Pro: తక్కువ ధర, అదిరిపోయిన ఫీచర్స్... రెడ్మీ కే20, రెడ్మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.