Home /News /technology /

FIND HIDDEN SPY CAMERAS WITH THESE HELPFUL TIPS IN HOMESTAY UMG GH

Spy Cameras: హోటల్ రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని అనుమానమా..? ఇదిగో ఇలా పట్టేసుకోవచ్చు.. ఈ ఈజీ టిప్స్‌తో సేఫ్ అవ్వండి..!

స్పై కెమెరాని గుర్తించడం ఇలా..

స్పై కెమెరాని గుర్తించడం ఇలా..

మీరు ఉంటున్న గదుల్లో, బెడ్‌రూమ్‌ లేదా బాత్‌రూమ్‌ వంటి ప్రైవేట్ ప్లేస్‌లలో సీక్రెట్ కెమెరాలను అమర్చినట్లు అనుమానం వస్తే.. వాటిని గుర్తించేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

మనం వివిధ సందర్భాల్లో కొత్త ప్రాంతాల్లో కొన్నిరోజులు ఉండాల్సి రావచ్చు. ఆఫీస్ అవసరాల కోసం లేదా విహార యాత్రలకు వెళ్లినప్పుడు కచ్చితంగా కొత్త ప్రాంతాల్లో ఉండాల్సిందే. అలాంటప్పుడు హోటల్ రూమ్స్, లాడ్జ్‌లు, హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్స్.. ఇలా వివిధ హోమ్‌స్టేలు మనకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. అయితే అలాంటి హోమ్‌స్టేలు, హోటళ్లలో సీక్రెట్ కెమెరాలను గుర్తించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ స్పై, హిడెన్ కెమెరాలు ఇప్పుడు మనం గుర్తించలేనంత చిన్నవిగా, ఎక్కడైనా అమర్చేలా వస్తున్నాయి. మీరు ఉంటున్న గదుల్లో, బెడ్‌రూమ్‌ లేదా బాత్‌రూమ్‌ వంటి ప్రైవేట్ ప్లేస్‌లలో సీక్రెట్ కెమెరాలను అమర్చినట్లు అనుమానం వస్తే.. వాటిని గుర్తించేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

1. ఫిజికల్ సెర్చింగ్
కొత్త ప్రాంతాల్లో ఏదైనా గదిలో ఉండాల్సి వస్తే.. అక్కడ సీక్రెట్ కెమెరాలు ఏవైనా ఉన్నాయేమో చెక్ చేయండి. గదిలోని అన్ని మూలలు, సెల్ఫ్స్‌లో వెతకండి. అన్ని ప్రాంతాలను సున్నితంగా పరిశీలించండి. బాత్‌రూమ్‌లు, బెడ్‌రూమ్‌లు వంటి ప్రాంతాల్లో కెమెరాలు ఎక్కడైనా అమర్చే అవకాశం ఉంది. అందుకే వాటిలో మరింత జాగ్రత్తగా వెతకండి. రూమ్‌లో ల్యాంప్స్ లేదా మరేదైనా గాడ్జెట్ ఉండాల్సిన స్థలంలో కనిపించకపోతే, దాన్ని చెక్ చేయండి. స్మోక్ డిటెక్టర్లు, థర్మోస్టాట్‌లు, ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌లు, టిష్యూ బాక్స్‌లు, వాల్ సాకెట్లు, డెస్క్ ప్లాంట్లు, వాల్ డెకర్‌లను.. ఇలా దేన్నీ వదలకుండా చెక్ చేయండి.

ఇదీ చదవండి: 300 ఏళ్ల తర్వాత దొరికిన అతిపెద్ద పింక్ డైమండ్.. దీని విలువ తెలిస్తే మతిపోతుంది.. ఎక్కడ దొరికిందంటే !


2. మొబైల్ ఫోన్లతో..
ఇప్పుడు సీక్రెట్ కెమెరాలను మొబైల్ ఫోన్‌తో గుర్తించవచ్చు. ఎలాగంటే.. ముందు రూమ్‌లో అన్ని లైట్లను ఆఫ్ చేసి, మీ ఫోన్‌లో ఫ్లాష్‌లైట్‌ ఆన్ చేయండి. సాధారణంగా కెమెరా లెన్స్‌లు అతి చిన్నవిగా ఉన్నా కూడా అవి లైట్‌ను రిఫ్లెక్ట్ చేస్తాయి. ఏదైనా స్పై కెమెరా ఎక్కడైనా ఉంటే, అక్కడి నుంచి మీ ఫోన్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకో మార్గంలో కూడా స్పై కెమెరాలను గుర్తించవచ్చు. మీ ఫోన్ కెమెరాను ఆన్ చేసి, రూమ్‌లోని లైట్లు అన్నీ ఆపేయండి. స్మార్ట్‌ఫోన్ కెమెరాలు ఇన్‌ఫ్రారెడ్ (IR) లైట్‌ను గుర్తించగలవు. మీ ఫోన్ ఏదైనా ఇన్‌ఫ్రారెడ్ లైట్‌ను గుర్తిస్తే.. అక్కడ చెక్ చేసి కెమెరా ఉందేమో డిటెక్ట్ చేయండి.

3. కెమెరాను గుర్తించే ఇన్‌స్ట్రుమెంట్స్
ఇప్పుడు ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్న స్పై కెమెరా డిటెక్టర్‌లు.. హిడెన్ కెమెరాలకు కనెక్ట్ అయ్యే రేడియో ఫ్రీక్వెన్సీలను స్కాన్ చేయగలవు. కానీ కెమెరా డేటాను ప్రసారం చేస్తున్నప్పుడు మాత్రమే డిటెక్టర్ పని చేస్తుంది. ఇప్పుడు చాలా కెమెరాలు డేటాను స్టోర్ చేసే SD కార్డ్‌లతో వస్తున్నాయి. ఇలాంటి వాటిని డిటెక్టర్లతో గుర్తించవచ్చు.



4. అనుమానాస్పద వస్తువులను టవల్‌తో కప్పండి
గదిలో ఏదైనా డివైజ్ లేదా వస్తువు అనుమానాస్పదంగా కనిపిస్తే, దాన్ని అన్‌ప్లగ్ చేసి, టవల్‌తో కప్పండి. లేదా దాన్ని అక్కడినుంచి తీసివేసి డ్రాయర్ లేదా అల్మారాలో దాచండి. ఒకవేళ అందులో ఏదైనా డివైజ్ ఉన్నట్లు గుర్తిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.
Published by:Mahesh
First published:

Tags: Bed rooms, Cctv, Hotels, Mobile

తదుపరి వార్తలు