Covid-19 Vaccination: కరోనా వ్యాక్సిన్ దొరకడం లేదా? అయితే, ఒక్క క్లిక్ తో మీ దగ్గరలో ఎక్కడ లభ్యత ఉందో తెలుసుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వ్యాక్సినేషన్ కోసం స్లాట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారా? అయితే, పేటీఎం(PAYTM) యాప్ ద్వారా మీ సమీపంలో స్లాట్ల ఖాళీల వివరాలను సింపుల్ గా తెలుసుకోవచ్చు.

  • Share this:
    దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. మొదటి వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ విధ్వంసం సృష్టిస్తోంది. యువత కూడా ఈ వైరస్ బారిన పడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దేశ వ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్న వైరస్ విజృంభణ మాత్రం ఆగడం లేదు. అయితే ఈ కరోనా వ్యాప్తికి బ్రేక్ లు వేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. గతంలో వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఇన్ఫెక్షన్ రేటు చాలా తక్కువ నమోదు కావడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. దీంతో ప్రభుత్వాలు కూడా వ్యాక్సినేషన్ పై దృష్టి సారించాయి. మన దేశంలో 18 ఏళ్లకు పై బడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ కావాల్సిన వారు ఆరోగ్య సేతు లేదా కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మొదటి డోస్ వేయించుకున్న 45 ఏళ్లకు పైబడిన వారు కూడా స్లాట్ తప్పనిసరిగా బుక్ చేసుకోవాలని సర్కార్ స్పష్టం చేసింది.

    అయితే.. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత తవ్రంగా ఉండడంతో స్లాట్ లు దొరకడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం కీలక ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మనం కోవిడ్-19 వ్యాక్సిన్ స్లాట్స్ గురించి ట్రాక్ చేయవచ్చు. ఎక్కడ వ్యాక్సిన్ స్లాట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. మనకు దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ లభించే సెంటర్లను సైతం తెలుసుకోవచ్చు. ఒక వేళ ప్రస్తుతం స్లాట్లు లేకపోతే స్లాట్లు అందుబాటులోకి వచ్చిన సమయంలో నోటిఫికేషన్లను కూడా పొందే అవకాశాన్ని పేటీఎం అందిస్తోంది.

    పేటీఎంలో వ్యాక్సిన్ స్లాట్ వివరాలు ఎలా తెలుసుకోవాలంటే..
    1. ముందుగా మనం పేటీఎం యాప్ ను ఓపెన్ చేయాలి.
    2.అనంతరం స్క్రోల్ డౌన్ చేయాలి. అక్కడ మనకు ‘Vaccine Finder’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
    3.అనంతరం Search by PIN Code, Search by District ఆప్షన్లు కనిపిస్తాయి.
    4.పిన్ కోడ్ ఆధారంగా స్లాట్ల వివరాలను సెర్చ్ చేయాలనుకుంటే Search by PIN Code ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    5.అనంతరం పిన్ కోడ్ ను నమోదు చేయాలి. కింద Age Group విభాగంలో 18-44, 45+ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ వయస్సు ఆధారంగా ఈ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.

    6.అనంతరం Check Availability ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    7.అక్కడ స్లాట్ల వివరాలు కనిపిస్తాయి. స్లాట్లు ఖాళీగా లేక పోతే Notify me when slots are availble ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో స్లాట్లు అందుబాటులోకి వచ్చిన సమయంలో మనకు పేటీఎం నోటిఫికేషన్ పంపిస్తుంది.
    8. ‘Search by District’ ఆప్షన్ ను ఎంచుకుంటే ముందుగా స్టేట్, తర్వాత జిల్లాను ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగత ప్రక్రియ అంతా సేమ్ ఉంటుంది.

    CoWin ప్లాట్ ఫామ్ నుంచే తాము ఈ డేటాను పొందుతున్నట్లు పేటీఎం తెలిపింది. అయితే మనం వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ను కేవలం ఆరోగ్య సేతు, కోవిన్ వెబ్ సైట్ ద్వారానే చేసుకోవచ్చు. పేటీఎం నుంచి మనం వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం లేదు.
    Published by:Nikhil Kumar S
    First published: