Home /News /technology /

FINANCE COMPANY CASHE OFFERS CREDIT LINE INSTANT PERSONAL LOAN IN JUST 30 SECONDS BY USER TYPING HI ON WHATSAPP CHAT BOX KNOW HOW SS

Loan in 30 seconds: వాట్సప్‌లో Hi అని టైప్ చేస్తే 30 సెకండ్లలో లోన్

Loan in 30 seconds: వాట్సప్‌లో Hi అని టైప్ చేస్తే 30 సెకండ్లలో లోన్
(ప్రతీకాత్మక చిత్రం)

Loan in 30 seconds: వాట్సప్‌లో Hi అని టైప్ చేస్తే 30 సెకండ్లలో లోన్ (ప్రతీకాత్మక చిత్రం)

Cashe Loan on Whatsapp | ఫైనాన్స్ కంపెనీ అయిన క్యాష్‌ఈ వాట్సప్ ద్వారా కేవలం 30 సెకండ్లలో పర్సనల్ లోన్ (Personal Loan) ఇస్తోంది. యూజర్లు వాట్సప్‌లో Hi అని టైప్ చేస్తే చాలు, ఇన్‌స్టంట్‌గా లోన్ మంజూరు చేస్తోంది.

పర్సనల్ లోన్... ఏ అవసరం వెంటనే గుర్తొచ్చే లోన్ ప్రొడక్ట్ ఇది. బ్యాంకులు కూడా పర్సనల్ లోన్ (Bank Loan) ఇచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాయి. పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు (Personal Loan Interest Rates) ఎక్కువగా ఉంటాయి కాబట్టి రుణాలు ఇచ్చేందుకు పోటీ పడుతుంటాయి. గతంలో పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. లోన్ కోసం బ్యాంకుకు వెళ్లడం, అప్లికేషన్ సబ్మిట్ చేయడం, బ్యాంకు సిబ్బంది అప్లికేషన్ పరిశీలించడం, ఆ తర్వాత ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేయడం, అన్నీ సరిగ్గా ఉన్నాయంటే వారం రోజుల తర్వాత అకౌంట్‌లో డబ్బులు వేయడం... ఈ మొత్తం ప్రాసెస్‌కు రెండువారాల సమయం పట్టేది. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత నిమిషాల్లో లోన్లు ఇచ్చేస్తున్నాయి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలు.

కొద్ది రోజుల క్రితం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ వాట్సప్‌లో అప్లై చేస్తే చాలు రెండు నిమిషాల్లో హోమ్ లోన్ మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు మరో ఫైనాన్స్ కంపెనీ క్యాష్‌ఈ (CASHe) కేవలం 30 సెకండ్లలో లోన్స్ ఇస్తామని చెబుతోంది. ఇందుకోసం వాట్సప్ యూజర్లు చేయాల్సింది Hi అని టైప్ చేసి పంపడమే. వాట్సప్ బిజినెస్ యూజర్ల కోసం క్యాష్‌ఈ ఈ ఆఫర్ ఇస్తోంది. వాట్సప్ బిజినెస్ అకౌంట్ ఉన్నవారు వాట్సప్‌లో Hi అని టైప్ చేస్తే 30 సెకండ్లలో లోన్ మంజూరవుతుంది. డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. ఎలాంటి అప్లికేషన్ ఫామ్స్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆఫర్ పొందడానికి మొబైల్ యాప్స్ కూడా డౌన్‌లోడ్ చేయాల్సిన పనిలేదు.

Credit Card: క్రెడిట్ కార్డ్ ఇలా అస్సలు వాడకూడదు? ఈ లెక్కలు తెలుసుకోండి


క్యాష్‌ఈ ద్వారా లోన్ తీసుకోవాలనుకుంటే ముందుగా వాట్సప్ బిజినెస్ అకౌంట్ ఉన్నవారు తమ స్మార్ట్‌ఫోన్‌లో 8097553191 నెంబర్ సేవ్ చేసుకోవాలి. వాట్సప్ ఛాట్ బాక్స్ ఓపెన్ చేసి ఈ నెంబర్‌కు Hi అని టైప్ చేసి పంపాలి. యూజర్లకు క్షణాల్లో ప్రీ-అప్రూవ్డ్ లోన్ మంజూరవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కస్టమర్ల ప్రొఫైల్ విశ్లేషించి కేవలం 30 సెకండ్లలో లోన్ మంజూరు చేస్తుంది క్యాష్‌ఈ సంస్థ. ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉండదు.

Bank Loan: వడ్డీ పెంచిన బ్యాంకులు... అయినా తక్కువ వడ్డీకే రుణాలు పొందండి ఇలా

వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిగిపోతుంది. ఆ తర్వాత మీకు క్రెడిట్ లైన్ ద్వారా ఎంత రుణం లభిస్తుందో వివరాలు తెలుస్తాయి. ఆ తర్వాత మీరు లోన్ మొత్తం, టెన్యూర్ ఎంచుకోవాలి. ఈఎంఐ ఎంత చెల్లించాలో, వడ్డీ ఎంతో కూడా తెలుస్తుంది. క్యాష్‌ఈ క్రెడిట్ లైన్ లోన్ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వేతనాలు పొందుతున్న ఉద్యోగులు మాత్రమే ఈ సదుపాయం ఉపయోగించుకునే అవకాశం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank loan, Personal Finance, Personal Loan, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు