హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

LG W30 Pro: మరో కొత్త ఫోన్ వచ్చేసింది... ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో ధర రూ.12,490

LG W30 Pro: మరో కొత్త ఫోన్ వచ్చేసింది... ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో ధర రూ.12,490

LG W30 Pro: మరో కొత్త ఫోన్ వచ్చేసింది... ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో ధర రూ.12,490
(image: LG India)

LG W30 Pro: మరో కొత్త ఫోన్ వచ్చేసింది... ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో ధర రూ.12,490 (image: LG India)

LG W30 Pro | మొత్తానికి ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో సేల్‌ అమెజాన్‌లో ప్రారంభమైంది. ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో అమెజాన్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా లభిస్తుంది. ధర రూ.12,490.

  ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పట్టు కోసం ఎల్‌జీ ఇండియా తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్‌ని దృష్టిలో పెట్టుకొని కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఎల్‌జీ డబ్ల్యూ సిరీస్‌లో ఎల్‌జీ డబ్ల్యూ10, ఎల్‌జీ డబ్ల్యూ30, ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో మోడల్స్‌ని పరిచయం చేసింది. వీటిలో ఎల్‌జీ డబ్ల్యూ10, ఎల్‌జీ డబ్ల్యూ30 అమ్మకాలు అప్పుడే మొదలయ్యాయి. కానీ... అదే సిరీస్‌లో రిలీజైన ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో సేల్ మాత్రం మొదలుకాలేదు. ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో సేల్‌పై జూన్ నుంచి సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తానికి ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో సేల్‌ అమెజాన్‌లో ప్రారంభమైంది. ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో అమెజాన్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా లభిస్తుంది. ధర రూ.12,490. మిడ్ రేంజ్ బడ్జెట్ సెగ్మెంట్‌లో షావోమీ, రియల్‌మీ, సాంసంగ్, మోటోరోలా లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది ఈ ఫోన్.

  ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.3 అంగుళాల హెచ్‌డీ+

  ర్యామ్: 4జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ

  ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 632

  రియర్ కెమెరా: 13+5+8 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 4050 ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై

  కలర్స్: మిడ్‌నైట్ బ్లూ, మిడ్‌నైట్ పర్పుల్

  ధర: రూ.12,490

  LG W30 Pro: ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో సేల్ ప్రారంభం... ఫోన్ ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  Post Box App: మీ ఫోన్‌కు మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయా? ఈ ఒక్క యాప్‌తో చెక్ పెట్టొచ్చు

  WhatsApp: మీ వాట్సప్‌ని అద్భుతంగా మార్చే 5 ఫీచర్లు ఇవే

  November Holidays: బ్యాంకు పనులు ఉన్నాయా? నవంబర్‌లో సెలవుల వివరాలివే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android, LG, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు