Home /News /technology /

FINALLY APPLE RELEASES WITH FACE MASK IPHONE BUT TWITTERATI ASKS WHATS THE POINT NOW DETAILS HERE GH VB

iPhone New Feature: మాస్క్ వేసుకున్నా ఐఫోన్‌ స్క్రీన్​ అన్​లాక్ అయ్యే ఫీచర్​.. ఇప్పుడు ఎందుకు అంటున్న నెటిజన్లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యాపిల్ సంస్థ ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్​ను తీసుకువచ్చింది. ఫేస్​మాస్క్ వేసుకున్నా ఫేస్ఐడీ ద్వారా స్క్రీన్​ అన్​లాక్ అయ్యే నయా ఫీచర్​ను ఐఫోన్లలో పరిచయం చేసింది.

మొబైల్స్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేయడంలో యాపిల్ (Apple) ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా యాపిల్ సంస్థ ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్​ను తీసుకువచ్చింది. ఫేస్​మాస్క్ వేసుకున్నా ఫేస్ఐడీ ద్వారా స్క్రీన్​ అన్​లాక్ అయ్యే నయా ఫీచర్​ను ఐఫోన్లలో పరిచయం చేసింది. ఐఫోన్ ఫేస్ అన్‌లాక్ విత్ మాస్క్ (iPhone Face Unlock With Mask) అనే ఈ ఫీచర్​ను లేటెస్ట్ ఐఓఎస్ 15.4 అప్డేట్ ద్వారా రోల్ అవుట్ చేసింది. ఈ ఫీచర్ సాయంతో ఐఫోన్ యూజర్లు ఇప్పుడు తమ ఫేస్ మాస్క్‌లు తొలగించకుండానే తమ ఐఫోన్‌లను ఫేస్ అన్‌లాక్ చేయవచ్చు. ఈ ఫీచర్​ రాకముందు యూజర్లు ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి పాస్‌వర్డ్ ను ఎంటర్ చేయాల్సి వచ్చేది. లేదా ఫేస్ మాస్క్‌ను తీసేసి ఫేస్ అన్‌లాక్ చేయాల్సి వచ్చేది.

అయితే ఈ ఫీచర్ iPhone 12, దాని అబౌవ్ వెర్షన్లలో మాత్రమే పని చేస్తుంది. దీనర్థం iPhone X, iPhone XR, iPhone 11 సిరీస్ వంటి ఫేస్ ఐడీని సపోర్ట్ చేసే పాత ఐఫోన్లు కూడా ఈ ఫీచర్‌ని పొందడం లేదు. అయితే ఈ చిన్న అప్‌డేట్ కోసం ఓల్డ్ ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేయాలన్నట్లు కోరుతున్న యాపిల్ సంస్థపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఐఫోన్ యూజర్లు. అలాగే కరోనా విజృంభించి రెండేళ్లకు పైగా సమయం గడిచిపోయిందని.. ఇంత ఆలస్యంగానా ఈ ఫీచర్​ను తీసుకురావడం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Zomato-Blinkit Deal: జొమాటోలో క్విక్ డెలివరీ యాప్ బ్లింకిట్​ విలీనం.. డీల్ వాల్యూ ఎంతంటే..?


ఈ అప్డేట్ కంటే ముందే ఫేస్ ఐడీ ఫీచర్ ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్‌లను ఫేస్ మాస్క్‌తో అన్‌లాక్ చేయడానికి ఐఫోన్ యూజర్లను యాపిల్ అనుమతించింది. అయితే దీనికి యాపిల్ వాచ్ అవసరమవుతుంది. ఇప్పుడు, సరికొత్త ఫీచర్ తో ఐఫోన్ 12, ఆపై ఐఫోన్ వెర్షన్లు ఎలాంటి ఎక్స్ట్రా డివైజ్ అవసరం లేకుండా ఈజీగా ఫేస్ అన్‌లాక్ చేయవచ్చు.

ఇప్పుడే ఎందుకు?
కరోనా తగ్గుముఖం పడుతుండటంతో మాస్క్ ధరించాలనే ఆంక్షలు అన్ని దేశాలు ఎత్తివేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ అప్‌డేట్‌ను విడుదల చేయడం వల్ల ఎవరికి ఏం లాభం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. యాపిల్ ఐఓఎస్ 15.4 అప్‌డేట్ అర్హులైన ఐఫోన్ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికీ తమ ఐఫోన్ ని అప్‌డేట్ చేయని వారు, ఐఓఎస్ 15.4 అప్‌డేట్ కోసం సెట్టింగ్స్> జనరల్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కి వెళ్లాలి. తరువాత ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను ఫాలో అవ్వాలి. మాస్క్‌తో తమ ముఖాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి సెట్టింగ్స్> ఫేస్ ఐడీ & పాస్‌కోడ్‌లోకి వెళ్లాలి. ఆపై ఫేస్ ఐడీ సెటప్ పేజీకి వెళ్లాలి.

మాస్క్‌తో ఐఫోన్‌ను అన్‌లాక్ చేసే ఫీచర్ సెటప్ చేయండిలా

స్టెప్ 1: ఫేస్ ఐడీ, పాస్‌కోడ్ సెటప్‌ని యాక్సెస్ చేయడానికి మీ పాస్‌కోడ్‌ని ఎంటర్ చేయండి.

స్టెప్ 2: "ఫేస్ ఐడీ విత్ ఏ మాస్క్” అనే కొత్త ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: “యూజ్ ఫేస్ ఐడీ విత్ ఏ మాస్క్‌” పై నొక్కండి

స్టెప్ 4: తర్వాత “గెట్ స్టార్టడ్ ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 5: మీ ఫేస్ ను వివిధ డైరెక్షన్ల నుంచి ఫేస్ మాస్క్ ధరించకుండా స్కాన్ చేయండి.

స్టెప్ 6: స్కానింగ్ పూర్తయ్యాక “డన్” పై క్లిక్ చేయండి.
Published by:Veera Babu
First published:

Tags: Iphone, Mask, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు