కేరళలో ఓనం (ONAM) సందడి మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 8న ఈ పండుగ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మలయాళీలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే ఈ ప్రధాన పండుగ సందర్భంగా అనేక కంపెనీలు దేశ వ్యాప్తంగా స్పెషల్ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఈ జాబితాలో చేరింది స్మార్ట్ బ్రాండ్ వివో(Vivo). ఈ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ ఓనం సందర్భంగా స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్లను అనౌన్స్ చేసింది. ఏకంగా FIFA వరల్డ్ కప్ (World Cup) మ్యాచ్ టికెట్లు గెలుచుకునే ఆఫర్లను ఈ కంపెనీ అందిస్తోంది. టోర్నీ అధికారిక స్పాన్సర్‌గా ఉన్న వివో, గురువారం ఈ ఆఫర్లను ప్రకటించింది. ఆ వివరాలు చూద్దాం.
తాజా ఆఫర్లతో తమ బ్రాండ్ ప్రొడక్ట్స్‌పై గ్యారెంటీడ్ బెనిఫిట్స్ అందిస్తున్నామని చెప్పారు. వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ హెడ్ యోగేంద్ర శ్రీరాముల. ఓనం సందర్భంగా అనేక ఆఫర్లు, సులభమైన ఫైనాన్స్ ఆప్షన్లతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చని తెలిపారు. ఇప్పుడు వివో కస్టమర్లు FIFA వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్లను గెలుచుకునే అవకాశం కూడా ఉంది.
కంపెనీ నుంచి వచ్చిన X80 సిరీస్, V25 ప్రో వంటి తాజా డివైజ్‌లను కొనుగోలు చేసేవారికి ఈ ఆఫర్ లభిస్తుంది. దీంతోపాటు రూ. 4,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఉంటుంది. అలాగే వివో స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లపై ఆరు నెలల వరకు అదనపు వారంటీని కూడా పొందవచ్చు.
* ఆఫర్ల వివరాలు..
కంపెనీ ప్రకటించిన ఓనం ఆఫర్లు 2022 ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 18 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ సమయంలో వినియోగదారులు వివిధ స్మార్ట్ ప్రొడక్ట్స్‌పై బెస్ట్ ఆఫర్లు, ఫైనాన్స్ స్కీమ్స్ పొందవచ్చు. వివో X80 సిరీస్, V25 ప్రో, V23e, Y21G, Y35 మోడళ్లపై ఆరు నెలల అదనపు వారంటీ సొంతం చేసుకోవచ్చు. లక్కీ కస్టమర్లు ఫిఫా వరల్డ్ కప్ టికెట్లు కూడా పొందవచ్చు. వివో X80 సిరీస్, V23, V25 Pro, Y75, ఇతర డివైజ్‌లపై కస్టమర్లు రూ. 4,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వివో తమ కస్టమర్లకు జీరో డౌన్ పేమెంట్‌తో నో కాస్ట్ EMI ఆఫర్‌ను ప్రకటించింది. ఇందుకు ప్రధాన బ్యాంకులు, ఫైనాన్స్ పార్ట్‌నర్స్‌తో ఒప్పందం చేసుకుంది.
ఇది కూడా చదవండి : సెప్టెంబర్‌లో ఐఫోన్ 14తో పాటు అదిరిపోయే మరెన్నో ఫోన్లు లాంచ్.. ఓ లుక్కేయండి..
* భారత్‌లో తయారైన ఫోన్లు
కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా విజన్‌ను వివో ఫాలో అవుతోంది. ఇందులో భాగంగా తాజా డివైజ్‌లను కంపెనీ గ్రేటర్ నోయిడాలోని కంపెనీ యూనిట్లో తయారు చేస్తోంది. ఈ యూనిట్లో దాదాపు 10,000 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం వివో ఇండియాలో అమ్ముతున్న అన్ని డివైజ్‌లను భారత్‌లోనే తయారు చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.