హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Apple Store Sale: యాపిల్‌ స్టోర్‌ స్పెషల్ ఫెస్టివ్‌ సీజన్‌ సేల్‌ ప్రారంభం.. ఆఫర్స్‌పై ఓ లుక్కేయండి..

Apple Store Sale: యాపిల్‌ స్టోర్‌ స్పెషల్ ఫెస్టివ్‌ సీజన్‌ సేల్‌ ప్రారంభం.. ఆఫర్స్‌పై ఓ లుక్కేయండి..

iPhone 14

iPhone 14

Apple Store: యాపిల్ ఇండియా యాపిల్‌ స్టోర్‌లో స్పెషల్ ఫెస్టివ్‌ సేల్‌ స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా కస్టమర్లకు బెస్ట్ డీల్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియాలో ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌, అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా సేల్‌ మొదలయ్యాయి. ఫెస్టివల్‌ సీజన్‌ ముందు ప్రారంభమైన ఈ సేల్స్‌లో దాదాపు అన్ని రకాల వస్తువులపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఐఫోన్‌ 14 (iPhone 14) సిరీస్ లాంచ్‌ కావడంతో ఐఫోన్‌ 12(iPhone 12), ఐఫోన్‌ 13(iPhone 13) వంటి మోడల్స్‌ తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఈ క్రమంలో యాపిల్ ఇండియా కూడా యాపిల్‌ స్టోర్‌లో స్పెషల్ ఫెస్టివ్‌ సేల్‌ స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా కస్టమర్లకు బెస్ట్ డీల్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది.

యాపిల్‌ స్టోర్‌(Apple Store)లో ఈ లిమిటెడ్‌ పీరియడ్‌ ఆఫర్‌(Limited Period Offer) సెప్టెంబర్ 26 నుంచి అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి యాపిల్‌ ఇండియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సిద్ధంగా ఉండండి, మా లిమిటెడ్‌ పీరియడ్ ఆఫర్‌ 2022 సెప్టెంబర్‌ 26 నుంచి ప్రారంభమవుతుంది. తేదీని గుర్తు పెట్టుకోండి.’ అని ప్రకటనలో పేర్కొంది.

* యాపిల్‌ స్టోర్‌ అందిస్తున్న ఆఫర్లు ఇవే

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లేదా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్‌లపై ఇండియా యాపిల్‌ స్టోర్‌ స్పెషల్ డిస్కౌంట్లు అందిస్తోంది. అన్ని ప్రొడక్టులపై రూ.41,900 కంటే ఎక్కువ మొత్తానికి చేసే కొనుగోలుపై రూ.7,000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉంది. అదే విధంగా యాపిల్‌ హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేసే ప్రొడక్టులపై 7 శాతం(రూ.7,000 వరకు) ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది. వినియోగదారులు తక్కువ EMIతో ప్రొడక్టులను కొనుగోలు చేయవచ్చు. మూడు లేదా ఆరు నెలలకు నో కాస్ట్ EMI ఆప్షన్‌ ఉంది, దీంతో వడ్డీని ఆదా చేసుకోవచ్చు. కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేస్తుంటే.. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌ను ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కోసం ఎక్స్ఛేంజ్‌ చేయవచ్చని ఇండియా యాపిల్‌ స్టోర్ పేర్కొంది.

Train Tickets: దసరా ట్రైన్‌లో టికెట్ కన్ఫామ్ అయిందా? వాట్సప్‌లో చెక్ చేయండిలా

OnePlus Smart TV: 50 అంగుళాల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ... కేవలం రూ.25,000 లోపే

* స్పెషల్ టీచింగ్‌ సెషన్లు

సంస్థ 'టుడే ఎట్ యాపిల్' పేరుతో స్పెషల్ టీచింగ్‌ సెషన్‌లను కూడా అందిస్తోంది. ఫోటో, వీడియో, మ్యూజిక్, కోడింగ్, ఆర్ట్, డిజైన్ వంటి అంశాలతో ఈ సెషన్‌లను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది. 'క్రియేటివ్ ప్రోస్' నేతృత్వంలో సెషన్‌లు జరుగుతాయి. ప్రపంచ స్థాయి కళాకారులు, ఫోటోగ్రాఫర్లు, మ్యూజిషియన్స్.. బేసిక్స్ నుంచి ప్రొఫెషనల్ లెవల్ ప్రోగ్రామ్‌ల వరకు పాఠాలను నేర్పుతారు. కెనడాలో జన్మించిన కళాకారిణి, ఆర్కిటెక్ట్ కీరత్ కౌర్, అక్టోబర్ 5న ఇండియా యాపిల్ స్టోర్ ఆన్‌లైన్‌ సెషన్ నిర్వహించనున్నారు. వినియోగదారులు యాపిల్ ఆన్‌లైన్‌ స్టోర్ ద్వారా ఉచితంగా ఐపాడ్‌, ఎయిర్‌పాడ్స్‌, ఎయిర్‌ట్యాగ్‌, యాపిల్‌ పెన్సిల్ (సెకండ్‌ జనరేషన్‌)ను పర్సనలైజ్‌ చేసుకోవచ్చు.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Apple store

ఉత్తమ కథలు