అర్ధరాత్రి నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దివాళీ సేల్!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 24న మొదలై అక్టోబర్ 28న ముగుస్తుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా 'ఫెస్టీవ్ ధమాకా డేస్' పేరుతో అక్టోబర్ 24 నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు సేల్ నిర్వహించనుంది. దసరా సీజన్‌లో నిర్వహించిన ఫెస్టివల్ సేల్స్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రూ.15,000 వేల కోట్ల బిజినెస్ చేశాయని అంచనా. మరి ఈ దివాళీ సేల్స్‌లో ఎన్నివేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నాయో ఈ ఇ-కామర్స్ దిగ్గజాలు.

news18-telugu
Updated: October 23, 2018, 7:42 PM IST
అర్ధరాత్రి నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దివాళీ సేల్!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివల్ సేల్!
  • Share this:
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దసరా సేల్ సందర్భంగా ఆర్డర్ చేసిన వస్తువులు ఇంకా డెలివరీ కానేలేదు... అప్పుడే మళ్లీ దివాళీ సేల్స్ ప్రకటించాయి ఆ ఇ-కామర్స్ సంస్థలు. ఈ రెండుమాత్రమే కాదు... మిగతా ఇ-కామర్స్ సైట్లూ ఫెస్టివల్ సేల్‌కు రెడీ అయిపోయాయి. మరి ఈసారి ఎలాంటి ఆఫర్లు ఉండబోతున్నాయో తెలుసుకోండి.

అమెజాన్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 10 నుంచి 15 వరకు జరిగింది. దసరా సీజన్‌లో వేలకోట్ల బిజినెస్ చేసిన అమెజాన్... ఇప్పుడు దీపావళి సీజన్‌ను టార్గెట్ చేసింది. మళ్లీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. అక్టోబర్ 24న మొదలయ్యే సేల్ అక్టోబర్ 28న ముగుస్తుంది. ఈ ఐదురోజుల సేల్‌లో భారీ ఆఫర్లను ప్రకటించింది అమెజాన్. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, నిత్యావసర వస్తువులు, పుస్తకాలు, మొబైల్‌ఫోన్స్‌పై ఆకట్టుకునే ఆఫర్స్‌తో మళ్లీ యూజర్లకు గాలమేస్తోంది. ఈ సేల్‌లో అమెజాన్‌లో ఎక్స్‌క్లూజీవ్ లాంఛెస్ కూడా ఉండబోతున్నాయి. షావోమీ రెడ్‌మీ 6ఏ ఫ్లాష్ సేల్ ప్రతీ రోజూ ఉంటుంది.

ఐసీఐసీఐ, సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్‌తో పాటు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. అమెజాన్ పే యూజర్లు రూ.5,000 కన్నా ఎక్కువ టాప్-అప్ చేస్తే రూ.250 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎప్పట్లాగానే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, ఇకో స్మార్ట్ స్పీకర్లు డిస్కౌంట్‌లో లభిస్తాయి. అలెక్సా ఉన్న డివైజ్‌లు కూడా 70 శాతం వరకు డిస్కౌంట్‌పై లభించనున్నాయి. కిండిల్ సబ్‌స్క్రిప్షన్ కూడా తగ్గింపు ధరతో లభించనుంది. అసలు ధర రూ.2,388 కాగా... ఆఫర్ ధర రూ.1,499 మాత్రమే.

ఫ్లిప్‌కార్ట్
మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా దివాళీ సేల్‌కు రెడీ అయిపోయింది. అక్టోబర్ 10 నుంచి 14 వరకు 'బిగ్ బిలియన్ డేస్ సేల్ 2018' నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్... ఇప్పుడు 'ఫెస్టీవ్ ధమాకా డేస్' పేరుతో అక్టోబర్ 24 నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు సేల్ నిర్వహించనుంది. ఏసుస్ ఇటీవల లాంఛ్ చేసిన జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1, జెన్‌ఫోన్ లైట్ ఎల్‌1 ఈ సేల్‌లోనే అందుబాటులోకి రానున్నాయి. యాక్సిస్ బ్యాంక్ కార్డులు, డెబిట్ కార్డుపై ఈఎంఐ, నో కార్ట్ ఈఎంఐ, ఫోన్‌పేపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లున్నాయి. ఏఏ ప్రొడక్ట్స్‌పై ఎంతెంత డిస్కౌంట్లు ఇస్తామనేది ఫ్లిప్‌కార్ట్ ఇంకా ప్రకటించలేదు.

మరోవైపు స్నాప్‌డీల్ కూడా 'మెగా దివాళీ సేల్' నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ అక్టోబర్ 21 వరకు కొనసాగనుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్స్, డిజిటల్ వ్యాలెట్స్, కూపన్ కోడ్స్ ద్వారా 25 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుండటం విశేషం.

దసరా సీజన్‌లో నిర్వహించిన ఫెస్టివల్ సేల్స్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రూ.15,000 వేల కోట్ల బిజినెస్ చేశాయని అంచనా. మరి ఈ దివాళీ సేల్స్‌లో ఎన్నివేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నాయో ఈ ఇ-కామర్స్ దిగ్గజాలు.

ఇవి కూడా చదవండి:

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

నో-కాస్ట్ ఈఎంఐలో అసలు మతలబేంటీ?

అప్పు కావాలా? అమెజాన్ ఇస్తుంది!

అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు శుభవార్త!

బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌తో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‍‌‌షిప్!

సబ్‌స్క్రిప్షన్ ఫీజ్ లేకుండా 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్'

గూగుల్‌లోనే ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, స్నాప్‌డీల్ 'షాపింగ్ ట్యాబ్స్'
Published by: Santhosh Kumar S
First published: October 23, 2018, 7:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading