FAU-G: ఇది ఇండియన్ PUBG, టీజర్ అదిరిపోయింది, భారత వీరులు గుర్తొస్తారు

ఫేమస్ మొబైల్ గేమ్ యాప్ PUBG బ్యాన్ తర్వాత ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా వస్తున్న FAU-G అనే గేమింగ్ యాప్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది.

news18-telugu
Updated: October 25, 2020, 8:35 PM IST
FAU-G: ఇది ఇండియన్ PUBG, టీజర్ అదిరిపోయింది, భారత వీరులు గుర్తొస్తారు
FAUG Game
  • Share this:
ఫేమస్ మొబైల్ గేమ్ యాప్ PUBG బ్యాన్ తర్వాత ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా వస్తున్న FAU-G అనే గేమింగ్ యాప్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. భారతీయ సైనిక బలగాల వీర్యపరాక్రమాలను తెలియజేసే ఈ మొబైల్ యాప్ త్వరలో మార్కెట్లోకి రానుంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. FAU-G ఫస్ట్ లుక్ కూడా సినిమా రేంజ్‌లో టీజర్ రిలీజ్ చేశారు. టీజర్‌ వీడియోను తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘ఈరోజు మనం చెడుపై మంచి గెలుపుున సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భయంలేని, ఐక్యతా గార్డులు FAU-G గురించి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకు మించి మంచి రోజు ఏముంటుంది. దసరా పర్వదినం రోజు FAU-G టీజర్‌ను ప్రజెంట్ చేస్తున్నాం.’ అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. FAU-G లో ఎఫ్ అంటే ఫియర్ లెస్, యు అంటే యునైటెడ్, జి అంటే గార్డ్స్. భారత్‌లో PUBGని బ్యాన్ చేసిన తర్వాత భారత కంపెనీ ఈ FAU-Gని తయారు చేస్తున్నట్టు ప్రకటించారు.



ఒక నిమిషం పాటు ఉన్న ఈ టీజర్‌లో గాల్వన్ వ్యాలీకి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. భారత్, చైనీస్ బలగాల మధ్య జరిగిన ఘర్షణ, ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందనే అంశాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. భారత ఆర్మీ ధైర్యసాహసాలను ప్రతిబింబించేలా ఆ టీజర్ ఉంది.

FAU-G త్వరలో మార్కెట్లోకి రానుంది. మొదట అక్టోబర్ చివరి నాటికి మార్కెట్లోకి తీసుకురావాలని భావించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు మరికొన్ని వారాల్లో FAU-G అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నవంబర్‌లో రావొచ్చని భావిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్‌ను గమనిస్తే PUBG MObileకి సమానమైన థ్రిల్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిలో కూడా వివిధ లెవల్స్ ఉంటాయి. ఇది కూడా షూటర్ గేమ్. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

‘ఆత్మనిర్భర్‌ భారత్‌' ఉద్యమంలో భాగంగా 'ఫౌజీ'‌ను తీసుకొస్తున్నాం. కేవలం వినోదమే కాదు.. మన సైనికుల త్యాగాలను తెలియజేయబోతున్నాం. ఈ గేమ్‌ ద్వారా సమకూరే ఆదాయంలో 20 శాతం 'భారత్‌కా వీర్‌ ట్రస్ట్‌'కు అందజేయనున్నామని గతంలో అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఈ గేమ్​ను బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్‌ గేమ్స్‌ రూపొందించింది. అక్షయ్‌ దీనికి మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. ఫౌజ్ అంటే హిందీలో సైన్యం అని అర్థం.

ఇటీవల చైనాకు చెందిన పబ్​జీ సహా 118 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో పబ్​జీ ప్లేయర్లు నిరాశ చెందారు. ఈ క్రమంలో అక్షయ్‌ 'ఫౌజీ' పేరుతో కొత్త గేమ్‌ను ముందుకు తెచ్చాడు. అక్షయ్‌ పోస్టు చేసిన వెంటనే పలువురు సంతోషం వ్యక్తంచేశారు. గేమ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పోస్ట్‌ చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 25, 2020, 8:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading