PUBGకి ధీటుగా FAU-G గేమ్.. ప్రస్తుతం ఆ మూడు భారతీయ భాషల్లో అందుబాటులోకి..

FAU-G పోస్టర్

PUBGకి ధీటుగా FAU-G గేమ్ లాంచ్ అయింది. Fearless and United Guardsకు షార్ట్ ఫార్మ్ గా ఫౌజీ గేమ్ కు పేరుపెట్టారు. అయితే ఇందులో ఇంకా చాలా వర్షన్స్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
PUBGకి ధీటుగా FAU-G గేమ్ లాంచ్ అయింది. Fearless and United Guardsకు షార్ట్ ఫార్మ్ గా ఫౌజీ గేమ్ కు పేరుపెట్టారు. అయితే ఇందులో ఇంకా చాలా వర్షన్స్ రిలీజ్ కావాల్సి ఉంది. కేవలం ఫస్ట్ ఎపిసోడ్ ను మాత్రమే ప్రస్తుతానికి లాంచ్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఫౌజీ గేమ్ ను అక్షయ్ కుమార్ లాంచ్ చేశారు. పబ్జీని గతేడాది మన ప్రభుత్వం నిషేధించటంతో భారత వర్షన్ ఫౌజీ FAU-G గేమ్ రూపొందిస్తున్నట్టు ఫౌజీ బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రకటించారు. "ఫియర్లెస్, యునైటెడ్ గార్డ్స్, గేమ్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది..మీ మిషన్ ఈరోజు ప్రారంభించండి" అన్న అక్షయ్ ట్వీట్.. వైరల్ అయింది. ఇది గతేడాది ఇండో-చైనా మధ్య గాల్వన్ వ్యాలీలో జరిగిన యుద్ధంలా ఈ మొత్తం ఆట ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉంది. ప్లేస్టోర్ లో దీన్ని మీరు డౌన్ లోడ్ చేసుకుని ఆడచ్చు. మిగిలిన భారతీయ భాషల్లో అతిత్వరలో ఫౌజీ గేమ్ అందుబాటులోకి రానుంది. పబ్ జీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన గేమ్ గా ఇది మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

ఇండియన్ పబ్ జీ..
మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ కోసం ఎదురుచూస్తున్నవారంతా బెంగళూరుకు చెందిన ఎన్ కోర్ గేమ్స్ nCore Games రూపొందించిన ఫౌజీని ఎంజాయ్ చేయవచ్చు. "ఇండియన్ పబ్ జీ"గా ఇప్పటికే పాపులర్ అయిన ఫౌజీ ఆండ్రాయిడ్ Android యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీనికి ప్రీ రిజిస్ట్రేషన్ కింద నవంబరు 2020లోనే మంచి స్పందన వచ్చింది. అయితే ఐఫోన్ యూజర్లకు ఈ గేమ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. బహుశా ఇందుకు ఏడాది సమయం పట్టచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఎన్ కోర్ గేమ్స్ మాత్రం దీనిపై ఎందుకో స్పందించటం లేదు.

గన్నులు ఉండవు..
రియల్ లైఫ్ సిరీస్ ప్రేరణతో రూపొందిన తొలి ఇండియన్ మొబైల్ గేమ్ గా ఫౌజీ నిలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పనిచేసే ఈ గేమ్ అతి త్వరలో పబ్ లానే మల్టీ ప్లేయర్ సపోర్ట్ పొందనుంది. పబ్ జీతో పోలిస్తే ఇందులో గన్నులు లేకపోగా చేతులే ఆయుధాలుగా ఉపయోగించాలి. మరోవైపు కొన్ని స్టేజీలు దాటాకనే మీకు కత్తులు లభిస్తాయి. ఎనర్జీ డ్రింక్స్ లేకుండా కేవలం భోగి మంటల వద్ద కూర్చుంటే సరిపోయేలా ఎనర్జీని పెంచుకునేలా ఇండియన్ టచ్ ఇచ్చారు. ప్రస్తుతం మిడ్ రేంజ్, హై ఎండ్ మొబైల్ ఫోన్లలో మాత్రమే సపోర్ట్ చేసే గేమ్ వర్షన్ లాంచ్ కాగా.. భవిష్యత్తులో డిమాండ్ ను బట్టి ఫౌజీ లైట్ వర్షన్ ను కూడా అందుబాటులోకి తేనున్నట్టు కంపెనీ వివరిస్తోంది.

ఇక ఈ మొబైల్ గేమ్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో 20 శాతం అమరులైన సైనికుల కుటుంబాలకు ఇవ్వనున్నట్టు ఇప్పటికే గేమ్ తయారీదారులు వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ కు ప్రతిరూపంగా అక్షయ్ కుమార్ ఈ గేమ్ ను అభివర్ణించారు. గేమ్ లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే కనీసం 20కోట్ల మంది మొబైల్ యూజర్లు దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటారని సంస్థ అంచనా వేస్తోంది.
Published by:Nikhil Kumar S
First published: