Home /News /technology /

FASTAG HOW TO BUY FASTAG FOR THE CAR AND HOW TO RECHARGE IT HERE ARE ALL YOUR ANSWERS SK GH

FASTag: ఫాస్టాగ్‌పై ఏమైనా సందేహాలు ఉన్నాయా? అన్నింటికీ ఇక్కడ సమాధానం..


(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

FASTag: మీరు కూడా ఇంకా ఫాస్టాగ్ లేకపోతే వెంటనే కొనుగోలు చేయండి. ఫాస్టాగ్ కొనుగోలు, రీచార్జిపై సందేహాలు ఏమైనా ఉంటే.. అన్నింటికీ ఇక్కడ సమాధానం దొరుకుతుంది. ఓ లుక్కేయండి.

FASTag: 2021 జనవరి 1 నుంచి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ (FASTag) తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇంకా ఫాస్టాగ్ తీసుకోని వారు చాలా మంది ఉండటంతో వారికి మరోసారి అవకాశం కల్పిస్తూ 2021 ఫిబ్రవరి 15 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. ఫిబ్రవరి 15 నుంచి 100 శాతం క్యాష్‌లెస్ టోల్ ఫీజు కలెక్షన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత.. జాతీయ రహదారిపై టోల్ ప్లాజా(toll plaza) దాటాలంటే వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. లేకపోతే సాధారణ ఛార్జీల కంటే రెట్టింపు ఛార్జీలు చెల్లించక తప్పుదు. మీరు కూడా ఇంకా ఫాస్టాగ్ లేకపోతే వెంటనే కొనుగోలు చేయండి. ఫాస్టాగ్ కొనుగోలు, రీచార్జిపై సందేహాలు ఏమైనా ఉంటే.. అన్నింటికీ ఇక్కడ సమాధానం దొరుకుతుంది. ఓ లుక్కేయండి.

ఫాస్టాగ్‌ను ఎలా కొనుగోలు చేయాలి?

ఫోర్ వీలర్ వాహనం కోసం ఫాస్టాగ్ కొనుగోలు చేయడం చాలా సులభతరం. దీన్ని భారతదేశం అంతటా అన్ని టోల్ ప్లాజాల వద్ద కొనుగోలు చేయవచ్చు. దీనికి గాను మొదట మీ కెవైసి(KYC) ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మీ గుర్తింపు కార్డుతో పాటు వాహన రిజిస్ట్రేషన్ పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. కేవలం టోల్ ప్లాజాల వద్దే కాకుండా అమెజాన్.ఇన్‌ లేదా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్(HDFC Bank), ఐసిఐసిఐ బ్యాంక్(ICICI Bank), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ బ్యాంక్(Kotak Bank), యాక్సిస్ బ్యాంక్(Axis Bank), పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వంటి బ్యాంకుల ద్వారా కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆయా బ్యాంకుల అధికారిక వెబ్సైట్స్, యాప్స్ ద్వారా ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయవచ్చు.

ఫాస్టాగ్‌ కొనుగోలుకు ఎంత ఖర్చవుతుంది?

ఫాస్టాగ్ ఛార్జీలు ముఖ్యంగా రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. మొదట, మీ వాహనం తరగతి అనగా, మీ వాహనం కారు, జీప్ లేదా వ్యాన్, లేదా బస్సు లేదా ట్రక్, లైట్ కమర్షియల్ వెహికిల్, కన్స్ట్రక్షన్ మెషిన్స్ వంటి వాటిలో దేనికి సంబంధించినది అనేది ఫాస్టాగ్ ఛార్జ్ నిర్ణయించడంలో కీలక అంశం. ఇక రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే ఫాస్టాట్ జారీచేసే బ్యాంకు. ఫాస్టాగ్ ఛార్జీలు బ్యాంకు ఫీజులు, భద్రతా డిపాజిట్లపై కూడా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, మీరు పేటీఎం(Paytm) ద్వారా రూ.500లకు ఒక ఫాస్టాగ్ కొనుగోలు చేస్తే.. ఇందులో సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.250, మినిమం బ్యాలెన్స్ కింద రూ. 150లను జమ చేసుకుంటుంది. ఇక, మీరు ఐసిఐసిఐ బ్యాంక్ నుండి కొనుగోలు చేస్తే, మీరు ట్యాగ్ రుసుము 99.12తో పాటు రూ .200 సెక్యూరిటీ డిపాజిట్, రూ .200 మినిమం బ్యాలెన్స్‌ను జమ చేయాల్సి ఉంటుంది. అయితే, ఆయా బ్యాంకులు ఫాస్టాగ్‌ల జారీలో ఆఫర్లను, క్యాష్‌బ్యాక్‌లను కూడా అందజేస్తున్నాయి.

ఫాస్టాగ్‌ను ఎలా రీచార్జ్ చేయాలి?

ఫాస్టాగ్‌ రీఛార్జ్ చేసుకోవడం చాలా సులభం. దీనికి మొత్తం రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఫాస్టాగ్‌ జారీచేసిన బ్యాంక్‌కు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా యుపిఐ చెల్లింపుల ద్వారా రీఛార్జ్ చేయవచ్చు. లేదంటే Paytm, PhonePe, అమెజాన్ పే(Amazon Pay), గూగుల్ పే(Google Pay) యాప్ల ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆయా బ్యాంకులు జారీ చేసిన పాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవడానికి ముందుగా చెల్లింపుల ఆప్షన్ను ఎంపిక చేసుకొని, దానిలోని ఫాస్టాగ్‌ రీఛార్జ్ ఆప్షన్ ద్వారా మీ చెల్లింపును పూర్తి చేయవచ్చు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: FASTag, Road Safety

తదుపరి వార్తలు