యాపిల్ వాచ్ ప్రాణాలు ఎలా కాపాడిందో తెలుసా?

కిందపడ్డ వ్యక్తి 60 సెకన్లలో పైకి లేవకపోతే యాపిల్ వాచ్ నేరుగా ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు సమాచారం ఇస్తుంది. అంతేకాదు... ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కు కూడా లొకేషన్‌ని మెసేజ్ చేస్తుంది. ఫాల్ డిటెక్షన్ ఫీచర్ యాపిల్ వాచ్ 4 అన్ని మోడల్స్‌లో ఉంటుంది. ఈ ఫీచర్ మ్యాన్యువల్‌గా యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అతను తన వాచ్‌లో ఈ ఫీచర్ యాక్టివేట్ చేశాడు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. 65 ఏళ్లు పైబడ్డ వారందరికీ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ డిఫాల్ట్‌గా సెట్ చేసి ఉంటుంది.

news18-telugu
Updated: October 31, 2018, 5:32 PM IST
యాపిల్ వాచ్ ప్రాణాలు ఎలా కాపాడిందో తెలుసా?
(image: News18.com)
  • Share this:
యాపిల్ స్మార్ట్‌వాచ్ 34 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కాపాడింది. ఓ వాచ్ మనిషి ప్రాణాలు ఎలా కాపాడగలదు అని మీరు అనుకుంటున్నారా? ఇది స్వీడన్‌లో జరిగిన ఘటన. స్వీడన్‌‌కు చెందిన ఓ వ్యక్తి కిచెన్‌లో వంట చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తీవ్రమైన వెన్నునొప్పితో పడిపోయాడు. కదలడం కూడా సాధ్యం కాలేదు. అతని చేతికి యాపిల్ స్మార్ట్‌వాచ్ 4 ఉంది. అందులో ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఉంది. ఆ ఫీచరే అతడిని కాపాడింది.

అసలేంటి ఈ ఫాల్ డిటెక్షన్ ఫీచర్?

యాపిల్ స్మార్ట్‌వాచ్ 4లో ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఉంటుంది. ఈ వాచ్ ధరించినవాళ్లు కిందపడిపోతే కుటుంబ సభ్యుల్ని అప్రమత్తం చేస్తుంది ఫాల్ డిటెక్షన్ ఫీచర్. ఆ ఫీచరే స్వీడన్‌కు చెందిన వ్యక్తికి ఎంతో ఉపయోగపడింది. అతను కిచెన్‌లో కిందపడగానే... సమీపంలో ఉండే తన అత్తకు అలర్ట్ మెసేజ్ వెళ్లింది. ఆమె వెంటనే అక్కడికి చేరుకొని అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. కిందపడ్డ వ్యక్తి 60 సెకన్లలో పైకి లేవకపోతే యాపిల్ వాచ్ నేరుగా ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు సమాచారం ఇస్తుంది. అంతేకాదు... ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కు కూడా లొకేషన్‌ని మెసేజ్ చేస్తుంది. ఫాల్ డిటెక్షన్ ఫీచర్ యాపిల్ వాచ్ 4 అన్ని మోడల్స్‌లో ఉంటుంది. ఈ ఫీచర్ మ్యాన్యువల్‌గా యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అతను తన వాచ్‌లో ఈ ఫీచర్ యాక్టివేట్ చేశాడు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. 65 ఏళ్లు పైబడ్డ వారందరికీ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ డిఫాల్ట్‌గా సెట్ చేసి ఉంటుంది.

ఈసీజీ ఫీచర్
యాపిల్ వాచ్‌లో ఈసీజీ ఫీచర్ కూడా ఉంది. ఆర్టిలర్ ఫిబ్రిలేషన్‌ని గుర్తిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్ తన స్మార్ట్‌వాచ్‌లో ఇలాంటి కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. గుండెకు సంబంధించిన వ్యాధుల్ని గుర్తించడంలో ఇలాంటి ఫీచర్లు ఉపయోగపడటమే కాదు... ప్రాణాలు కూడా కాపాడుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

రూ.16 వేల ఫోన్ రూ.999 చెల్లించి సొంతం చేసుకోండి!అక్టోబర్ 2018 న్యూస్ 18 క్రియేటీవ్ ఇన్ఫోగ్రాఫిక్స్

గ్రాండ్‌గా లాంఛైన వన్‌ప్లస్ 6టీ: విశేషాలు ఇవే…

Photos: వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?
First published: October 31, 2018, 5:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading