బ్యాంక్ యాప్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

ఫేక్ బ్యాంక్ యాప్స్ ఇప్పటికే వేలాది మంది డేటా కొట్టేసినట్టు తెలుస్తోంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండియన్ ఓవర్‌సీస్, బీఓబీ, యెస్ బ్యాంక్, సిటీ బ్యాంక్‌కు సంబంధించిన ఫేక్ యాప్స్‌తో సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్టు ఐటీ సెక్యూరిటీ సంస్ధ సోఫోస్ ల్యాబ్స్ సంచలన విషయాలు బయటపెట్టింది.

news18-telugu
Updated: October 24, 2018, 3:03 PM IST
బ్యాంక్ యాప్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీ ఫోన్‌లో ఏదైనా బ్యాంక్ యాప్ ఉందా? అది ఒరిజనలేనా? ప్లేస్టోర్, యాప్‌స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నదేనా? లేక 'ఏపీకే' ఫైల్ ఇన్‌స్టాల్ చేశారా? అసలు మీ బ్యాంకు రిలీజ్ చేసిన యాపే మీరు వాడుతున్నారా? లేక సేమ్ టు సేమ్ అలాగే సైబర్ నేరగాళ్లు తయారు చేసిన ఫేక్ యాప్ వాడుతున్నారా? ఎందుకంటే... ఇప్పుడు ఫేక్ బ్యాంక్ యాప్స్ కలకలం రేపుతున్నాయి. ఫేక్ బ్యాంక్ యాప్స్ ఇప్పటికే వేలాది మంది డేటా కొట్టేసినట్టు తెలుస్తోంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండియన్ ఓవర్‌సీస్, బీఓబీ, యెస్ బ్యాంక్, సిటీ బ్యాంక్‌కు సంబంధించిన ఫేక్ యాప్స్‌తో సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్టు ఐటీ సెక్యూరిటీ సంస్ధ సోఫోస్ ల్యాబ్స్ సంచలన విషయాలు బయటపెట్టింది.

ఇవన్నీ చిన్నాచితకా బ్యాంకులేమీ కావు. ఇండియాలో అన్నీ ప్రధానమైన బ్యాంకులే. వీటి పేరుతోనే నకిలీ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్నాయి. బ్యాంక్ లోగోలతోనే కనిపిస్తాయి. అందులో ఒరిజినల్ ఏదో, నకిలీది ఏదో గుర్తించడం యూజర్లకు కష్టం. ఆ యాప్స్‌లో ఉండే మాల్‌వేర్ కస్టమర్ల డేటాను తస్కరిస్తుంది. అయితే అవి నకిలీ యాప్స్ అన్న విషయాన్ని గుర్తించకుండా ఇన్‌స్టాల్ చేసుకున్న వేలాది మంది కస్టమర్ల బ్యాంకు వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిందని సోఫోస్ ల్యాబ్స్ చెబుతోంది.


ఇదే విషయమై వివరణ కోరేందుకు సదరు బ్యాంకుల్ని సోఫోస్ ల్యాబ్స్ ప్రతినిధులు సంప్రదిస్తే... అలాంటి ఫేక్ యాప్స్ గురించి తమకు సమాచారం లేదన్న సమాధానం వచ్చింది. అయితే ఇంకొన్ని బ్యాంకులు విచారణ మొదలుపెట్టాయి. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్-ఇండియాకు కూడా సమాచారం ఇచ్చాయి. ఇలాంటి ఫేక్ యాప్స్‌తో తమ బ్యాంకుకు ఎలాంటి సమస్యలు రాలేదని సిటీ బ్యాంక్ ప్రతినిధి సమాధానం ఇచ్చారు. అంతే కాదు... సోఫోస్ ల్యాబ్స్ చెప్పిన జాబితాలో సిటీ బ్యాంక్ పేరు తొలగించాలని లిఖితపూర్వకంగా కోరారు. ఇక యెస్ బ్యాంక్ ఈ విషయం గురించి సైబర్ ఫ్రాడ్ డిపార్ట్‌మెంట్‌ను అప్రమత్తం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించాల్సి ఉంది.

బ్యాంకుల ఒరిజినల్ యాప్స్‌ని పోలేలా ఉండే నకిలీ యాప్స్ చాలా ప్రమాదకరం. అందులోని మాల్‌వేర్ యూజర్ల అకౌంట్స్ నుంచి డేటాను కొట్టేస్తుంది. ఇప్పటికే ఫేక్ యాప్స్‌లోని మాల్‌వేర్ భారతదేశంలోని బ్యాంక్ కస్టమర్ల అకౌంట్ డేటా, క్రెడిట్ కార్డు నెంబర్లను కొట్టేసింది. అందుకే యూజర్లు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దాని ద్వారా మాల్‌వేర్ ప్రొటెక్షన్, ఇంటర్నెట్ సెక్యూరిటీ లభిస్తుంది. అంతేకాదు... ఇలాంటి ఫేక్ యాప్స్ డేటాను కొట్టేయకుండా అడ్డుకుంటుంది.
పంకజ్ కోహ్లి, థ్రెట్ రీసెర్చర్, సోఫోస్ ల్యాబ్స్


కస్టమర్లను బుట్టలో వేసుకునేందుకే ఇలా బ్యాంకుల పేర్లతో ఫేక్ యాప్స్ తయారు చేస్తుంటారు సైబర్ నేరగాళ్లు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఇలాంటి ఫేక్ యాప్స్ వేలల్లో ఉంటాయి. అందుకే ఏదైనా బ్యాంక్ యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందు జాగ్రత్త.
ఇవి కూడా చదవండి:

గూగుల్‌లో మీ డేటాను ఎలా డిలిట్ చేయాలో తెలుసా?

వాట్సప్ డేటా బ్యాకప్: నవంబర్ 12 డెడ్‌లైన్!

'మాస్క్‌డ్ ఆధార్' గురించి మీకు తెలుసా?

క్రెడిట్ లిమిట్ అంటే ఏంటీ? ఆర్థిక క్రమశిక్షణలో ఎంత ముఖ్యం?

పేటీఎంలో మీ డబ్బు ఎంత సేఫ్?
First published: October 24, 2018, 12:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading