హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

FACT CHECK: ఇకపై కేంద్ర ప్రభుత్వం మీ వాట్సాప్ కాల్స్ రికార్డు చేస్తుంది...

FACT CHECK: ఇకపై కేంద్ర ప్రభుత్వం మీ వాట్సాప్ కాల్స్ రికార్డు చేస్తుంది...

ధిక్కార స్వరం వినిపిస్తున్న వాట్సాప్​పై మోదీ సర్కార్​ బ్యాన్ విధించనుందన్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పాటు కేంద్రం యూజర్ల అన్ని వాట్సాప్​ కాల్స్​ను​ రికార్డ్​ చేస్తుందని, అంతేకాక, యూజర్ల సంభాషణలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందన్న న్యూస్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇంకా చదవండి ...

  కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన కొత్త ఐటీ రూల్స్​కు సంబంధించి వాట్సాప్​, భారత ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తోంది. సామాజిక మాధ్యమాలను నియంత్రించడానికి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ​ వాట్సాప్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసింది. నూతన ఐటీ రూల్స్​ ద్వారా వాట్సాప్​లో పంపే సందేశాలు, దాని ద్వారా ఇతరులతో జరిపే సంభాషణలు బయటివారికి తెలిసే అవకాశం ఉందని, తద్వారా తమ యూజర్ల​ ప్రైవసీ దెబ్బతింటుందని వాట్సాప్​ వాదిస్తోంది. అటు కేంద్రం మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించింది. కొత్త ఐటీ రూల్స్​తో యూజర్​ డేటాకు ఎలాంటి ప్రమాదం ఉండదని.. దురుద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసిన యూజర్ల డేటా అడిగితే ఇవ్వాల్సిందేనని పేర్కొంది. అయితే, ఇలా చేస్తే తమ యూజర్ల​ డేటాకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, కొత్త ఐటీ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేస్తోంది.

  ఏదేమైనా ఇప్పుడు భారత ప్రభుత్వం, వాట్సాప్​ రెండింటి మధ్య పెద్ద యుద్దమే జరుగుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో దిక్కార స్వరం వినిపిస్తున్న వాట్సాప్​పై మోదీ సర్కార్​ బ్యాన్ విధించనుందన్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పాటు కేంద్రం యూజర్ల అన్ని వాట్సాప్​ కాల్స్​ను​ రికార్డ్​ చేస్తుందని, అంతేకాక, యూజర్ల సంభాషణలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందన్న న్యూస్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్​ అవుతున్న మెసేజ్​ను పరిశీలిస్తే.. "కేంద్ర ఐటీ శాఖ మీ సందేశాలను పరిశీలిస్తుంది. వాట్సాప్​లో మీరు అవతలి వ్యక్తికి​ చేసిన మెసేజ్​కు మూడు టిక్కులు గనక వస్తే మీ మెసేజ్​ను మంత్రిత్వ శాఖ గమనిస్తున్నట్లు అర్ధం చేసుకోండి. రెండు బ్లూ టిక్స్​, ఒక రెడ్​ టిక్​ వస్తే ప్రభుత్వం మీ వివరాలను తనిఖీ చేస్తున్నట్లు అర్థం. చివరగా మూడు రెడ్​ టిక్స్​ వస్తే ప్రభుత్వం మీపై చర్యలు ప్రారంభించిందని, మిమ్మల్ని ఎప్పుడైనా అరెస్ట్​ చేయవచ్చని అర్థం” అని మెసేజ్​లో రాశారు.

  పీఐబీ ఫ్యాక్ట్​చెక్​ వివరణ..

  ఇక, రాజకీయాలు, ప్రస్తుత పరిస్ఠితులకు సంబంధించి ప్రభుత్వానికి, ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా ఎలాంటి చెడు పోస్ట్​ లేదా వీడియోలు పంపవద్దని ఈ వైరల్​ మెసేజ్​లో ఉంది. అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ లేదా మతపరమైన సమస్యలపై మెసేజ్​ చేయడం నేరం. ఇలా చేసిన వారిని ఎలాంటి వారెంట్​ లేకుండానే అరెస్ట్​ చేయవచ్చని మెసేజ్​లో పేర్కొన్నారు. కాగా, వైరల్​ అవుతున్న ఈ న్యూస్​పై పీఐబీ ఫ్యాక్ట్​చెక్​ స్పష్టతనిచ్చింది. ‘‘ఈ వార్తలు పూర్తిగా అబద్దం. ప్రభుత్వం యూజర్ల డేటాపై నిఘా ఉంటుందని ఎక్కడా చెప్పలేదు. అయితే, ఇతరులకు సందేశాలు పంపే క్రమంలో యూజర్లు జాగ్రత్త వహించాలి. ఆ వార్త నిజమా? కాదా? చెక్​ చేసుకొని షేర్​ చేయాల్సిందిగా కోరుతున్నాం” అని ట్వీట్​ చేసింది.

  First published:

  Tags: Fact Check, Whatsapp

  ఉత్తమ కథలు