• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • FACT CHECK IS WHATSAPP ASKING MONEY TO CONTINUE USE THE APP WHAT IS THE TRUTH SS

WhatsApp: వాట్సప్ వాడాలంటే డబ్బులు కట్టాలా... ఇందులో నిజమెంత?

WhatsApp: వాట్సప్ వాడాలంటే డబ్బులు కట్టాలా... ఇందులో నిజమెంత?

WhatsApp: వాట్సప్ వాడాలంటే డబ్బులు కట్టాలా... ఇందులో నిజమెంత? (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Fact Check | వాట్సప్ వాడటానికి డబ్బులు కట్టాలని, 10 మందికి ఫార్వర్డ్ చేస్తే వాట్సప్ లోగో కలర్ మారుతుందని, మీ వాట్సప్ అకౌంట్ బ్లాక్ అవుతుందని, మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే మీకు టాక్ టైమ్ లభిస్తుందని రకరకాల మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతుండటం కొత్తేమీ కాదు.

  • Share this:
    "ప్రతీ రోజూ రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాట్సప్ పనిచేయదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీ వాట్సప్‌లోని నెంబర్లందరికీ ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ మీరు 48 గంటల్లో మెసేజ్ ఫార్వర్డ్ చేయకపోతే మీ అకౌంట్ ఇన్‌వ్యాలిడ్‌గా గుర్తించి డిలిట్ చేస్తారు. ఒకవేళ మీ వాట్సప్ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ చేయాలంటే నెలకు రూ.499 చెల్లించాలి. వాట్సప్ త్వరలో మీ నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. మీరు ఉచితంగా వాట్సప్ వాడాలంటే కనీసం 50 మందితో ఛాట్ చేస్తుండాలి. మీరు ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేయండి. మీ వాట్సప్ లోగో కలర్ మారుతుంది" ఈ మెసేజ్ నమ్మేశారా? నమ్మితే అడ్డంగా బుక్కైనట్టే. సరిగ్గా ఇదే మెసేజ్ కొంతకాలంగా వాట్సప్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మెసేజ్ పచ్చి అబద్ధం. ఇందులో నిజం లేదు. కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే. ఇది నమ్మేసి మెసేజెస్ ఫార్వర్డ్ చేయకండి. ఇదొక్కటే కాదు... "వాట్సప్‌ను రిలయెన్స్ అధినేత ముకేష్ అంబానీకి అమ్మేశారు. ఇకపై వాట్సప్‌ను ముకేష్ అంబానీ నడిపిస్తారు. ఈ మెసేజ్‌ను 10 మందికి పంపిస్తే వాట్సప్ లోగో మారుతుంది" అని వాట్సప్ డైరెక్టర్ వరుణ్ పుల్యానీ పేరుతో మరో మెసేజ్ వైరల్‌గా మారింది. ఇది కూడా ఫేక్ న్యూసే.

    ఇలా వాట్సప్ వాడటానికి డబ్బులు కట్టాలని, 10 మందికి ఫార్వర్డ్ చేస్తే వాట్సప్ లోగో కలర్ మారుతుందని, మీ వాట్సప్ అకౌంట్ బ్లాక్ అవుతుందని, మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే మీకు టాక్ టైమ్ లభిస్తుందని రకరకాల మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతుండటం కొత్తేమీ కాదు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు వాడుకొని మరీ మెసేజెస్ పంపుతున్నారు. అయితే వీటిని యూజర్లు గుడ్డిగా నమ్మేసి ఫార్వర్డ్ చేస్తున్నారు. దీని వల్ల వాట్సప్ యూజర్లలో గందరగోళం నెలకొంటోంది. నిజంగానే వాట్సప్ ఉపయోగించాలంటే డబ్బులు చెల్లించాలేమో అని ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇలాంటి మెసేజెస్ ఏవైనా వస్తే వాటిని పట్టించుకోకపోవడమే మంచిది. నిజంగానే వాట్సప్‌లో ఏవైనా మార్పులు ఉంటే కంపెనీనే అధికారికంగా తెలుపుతుంది. అంతే తప్ప ఇలాంటి ఫార్వర్డ్ మెసేజ్‌ల ద్వారా సమాచారం రాదు.

    Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    Redmi K20 Pro: గుడ్ న్యూస్... జూలై 17న రెడ్‌మీ కే 20 ప్రో, రెడ్‌మీ కే 20 రిలీజ్

    Smartphone: మీ ఫోన్ పేలిపోవద్దంటే ఈ 10 జాగ్రత్తలు తప్పనిసరి

    Vivo Z1 Pro: ట్రిపుల్ కెమెరాతో వివో జెడ్1 ప్రో... ధర రూ.14,990
    Published by:Santhosh Kumar S
    First published: