ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్(Smartphone) ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఏ పని చేయాలన్నా ఫోన్ సాయం ఉండాల్సిందే. అందులోనూ చాలా అవసరాల కోసం గూగుల్ (Google Assist)పై ఆధారపడుతున్నాం. కేవలం బ్రౌజింగ్‌కు మాత్రమే కాకుండా ఈమెయిల్స్ పంపడానికి, ఫొటోలు స్టోర్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్, నేవిగేషన్, వీడియోల వీక్షణకు, డబ్బు పంపేందుకు ఇలా ఎన్నో అవసరాలకు గూగుల్ సేవలను(Google services) వినియోగిస్తున్నాం. యాప్స్, సర్వీసెస్ రూపంలో వీటిని ఉపయోగిస్తున్నాం. ఎంత బాగా పనిచేస్తున్నప్పటికీ ఈ సేవల్లో అప్పడప్పుడు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇలాంటప్పుడు సాధారణంగా ఫోన్ రీస్టార్ట్ చేసి లేదా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో సమస్యలు తీవ్రంగా ఉండవచ్చు. అలాంటి సమయాల్లో గూగుల్ కస్టమర్ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గూగుల్ కస్టమర్‌ను ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియకపోతే, మీ సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి గూగుల్ సపోర్ట్ ఎలా పొందాలో చూద్దాం.
స్టెప్ 1 : ముందుగా మీరు ఈ క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి. అందులో 'support.google.com' యూఆర్ఎల్ను ఎంటర్ చేయాలి.
స్టెప్ 2: అనంతరం ఈ పేజీలో మీకు అన్ని గూగుల్ యాప్స్, సేవలు కనిపిస్తాయి. మీకు కావాల్సిన యాప్ లేదా సర్వీస్‌పై క్లిక్ చేసి కస్టమర్ సపోర్ట్‌కు కాంటాక్ చేయాలి. అక్కడ కిందకు ఫేస్ చేసి ఉన్న బాణం గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా ఆప్షన్ల లిస్ట్ కనిపిస్తుంది.
స్టెప్ 3: మీరు ఏదైనా యాప్ లేదా సేవలపై క్లిక్ చేసిన తర్వాత, వివిధ ప్రశ్నలు ఉండే కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. మీ ప్రాబ్లమ్‌కు సంబంధించిన ప్రశ్న కోసం వెతికి, ఆన్సర్ పొందవచ్చు. అయితే అందులో ఉన్న ప్రశ్నలు మీ సమస్యను కవర్ చేయకపోతే కిందకు స్క్రోల్ చేసిన తర్వాత ‘Need more help’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. అనంతరం Contact us అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
స్టెప్ 4: ఇప్పుడు మీ సమస్యకు సంబంధించిన కొన్ని వివరాలను గూగుల్ మిమ్మల్ని అడగవచ్చు. అప్పుడు మీకు కావాల్సిన సపోర్ట్ గురించి పేర్కొనాలి. మీ ప్రశ్నను కింద ఉండే బాక్స్‌లో రాసి Next అనే ఆప్షన్‌పై నొక్కాలి.
స్టెప్ 5: ముందుగానే సెట్ చేసిన ప్రశ్నల నుంచి మీ సమస్యకు తగిన ఉత్తమమైన దాన్ని ఎంచుకోండి.
స్టెప్ 6: ఇప్పుడు మీ ప్రశ్నను గూగుల్‌కు పంపడానికి ఈమెయిల్ లేదా చాట్ బటన్‌పై క్లిక్ చేయండి.
యూజర్లకు చాట్ చేసే ఆప్షన్ వారమంతా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.