ఐడీ అవసరం లేదు... ఫేషియల్ రికగ్నిషన్‌తో ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ

మీరు టెర్మినల్ గేట్‌కు వెళ్లగానే ఫేస్ రిగక్నిషన్ టెక్నాలజీ మిమ్మల్ని గుర్తించి వివరాలను స్క్రీన్‌పైన డిస్‌ప్లే చేస్తుంది. గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ సిబ్బంది ఆ సమాచారాన్ని పరిశీలిస్తారు.

news18-telugu
Updated: January 14, 2019, 7:07 PM IST
ఐడీ అవసరం లేదు... ఫేషియల్ రికగ్నిషన్‌తో ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ
ఐడీ అవసరం లేదు... ఫేషియల్ రికగ్నిషన్‌తో ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ
news18-telugu
Updated: January 14, 2019, 7:07 PM IST
ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లాలంటే బుక్ చేసుకున్న టికెట్ల ప్రింట్ అవుట్లతో పాటు ఐడీ కార్డులు తప్పనిసరి. ఇకపై శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇవేమీ అవసరంలేదు. జస్ట్ మీ మొహం చూపిస్తే చాలు. లోపలికి పంపించేస్తారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ మహత్యం ఇది. మొదటి దశలో భాగంగా ఎయిర్‌పోర్టులోని ఉద్యోగులతో ట్రయల్ నిర్వహించారు. రెండో దశ ఈ నెలాఖరులో మొదలుకానుంది. తరచూ ప్రయాణించేవారికి ఈ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ ట్రయల్ కూడా విజయవంతమైతే మార్చి నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులందరికీ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అమలవుతుంది.

ఇది కూడా చదవండి: AADHAR NEWS: ఆధార్ కార్డు పోయిందా? ఇలా రీప్రింట్ చేసుకోవచ్చు

3 దశల్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ

మొదటి దశ: ఎయిర్‌పోర్టులో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల మొహాలను ఈ కెమెరాల ద్వారా రికార్డ్ చేస్తారు.


రెండో దశ: ప్రయాణికులకు సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉంటుంది. ప్రతీ ప్రయాణికుల మొహాలకు పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఫోటో ఐడెంటిటీ అటాచ్ చేస్తారు. ప్రయాణికుల ఫేషియల్ మ్యాపింగ్ చేసి సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌లో సేవ్ చేస్తారు.
మూడో దశ: ప్రయాణికుల ఐడీ ప్రూఫ్, ఫేషియల్ మ్యాపింగ్ వివరాలు ఇ-బోర్డింగ్ గేట్ దగ్గర స్టోర్ చేస్తారు. ఎయిర్‌లైన్స్ డేటా సెంటర్‌లో కూడా ఇవే వివరాలుంటాయి. ప్యాసింజర్లు టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు డేటా సిస్టమ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అథారిటీస్‌ను అలర్ట్ చేస్తుంది.

ఇది కూడా చదవండి: TRAI Good News: నెలకు రూ.153 చెల్లిస్తే 100 ఫ్రీ లేదా పే ఛానెళ్లు

ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
మీరు హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేయగానే ఆ వివరాలు డేటా సెంటర్ నుంచి సంబంధిత అధికారులకు వెళ్తాయి. మీరు టెర్మినల్ గేట్‌కు వెళ్లగానే ఫేస్ రిగక్నిషన్ టెక్నాలజీ మిమ్మల్ని గుర్తించి వివరాలను స్క్రీన్‌పైన డిస్‌ప్లే చేస్తుంది. గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ సిబ్బంది ఆ సమాచారాన్ని పరిశీలిస్తారు. చెక్ ఇన్ కౌంటర్, సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర కూడా ఇలాగే తనిఖీలుంటాయి. ఆన్‌లైన్ బోర్డింగ్ పాస్ మీ మొబైల్ ఫోన్‌కు వస్తుంది.

ఇవి కూడా చదవండి:

REDMI 6 PRO: రూ.11,499 విలువైన ఫోన్ రూ.1,058 ధరకే... ఎలా కొనాలో తెలుసుకోండి

SBI CARD: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు నుంచి డేటా కొట్టేస్తారు జాగ్రత్త

Instagram Record: గుడ్డుకు రెండున్నర కోట్ల లైకులు... ఏముంది అందులో?

Makara SANKRANTI 2019: పిడకలు, గొబ్బెమ్మలు కావాలా? ఆన్‌లైన్‌లో కొనుక్కోండి
First published: January 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...