FACIAL RECOGNITION SYSTEM INTRODUCING INDIAN RAILWAYS IN STATIONS EVK
Indian Railways: రైల్వే స్టేషన్లలో ఫేసియల్ రికగ్నెషన్ సిస్టమ్.. ఇండియన్ రైల్వేస్ నిర్ణయం
(ప్రతీకాత్మక చిత్రం)
ఇండియన్ రైల్వేస్(Indian Railways) సాంకేతికంగా మరో ముందడుగు వేసింది. ఎన్నో ఏళ్లుగా కొత్త తరహా సాంకేతికతను అందిస్తూ సేవలందిస్తున్న రైల్వేస్ ఈ సారి ఫేసియల్ రికగ్నెషన్ సిస్టమ్ (Facial Recognition System) రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రైల్వే స్టేషన్లలో 500 ఫేసియల్ రికగ్నెషన్ కెమెరాలను(Camera) అమర్చారు.
ఇండియన్ రైల్వేస్(Indian Railways) సాంకేతికంగా మరో ముందడుగు వేసింది. ఎన్నో ఏళ్లుగా కొత్త తరహా సాంకేతికతను అందిస్తూ సేవలందిస్తున్న రైల్వేస్ ఈ సారి ఫేసియల్ రికగ్నెషన్ సిస్టమ్ (Facial Recognition System) రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయనుంది. రోజు స్టేషన్‌కు లక్షల మంది వస్తూ పోతుంటారు. ఒక్కరోజు రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికుల సంఖ్య ఎంత అని చెప్పాలంటే ఎవరూ చెప్పలేరు. రైల్వే స్టేషన్లలో ఎంత మంది ఉన్నారు.. అనేది కనుక్కోవడం కోసం ఫేసియల్ రికగ్నెషన్ సిస్టమ్‌ను రైల్వేస్ ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రముఖమైన 30 రైల్వే స్టేషన్లో ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ముంబై, సికింద్రాబాద్, అలహాబాద్ ఇలా ప్రముఖ ఎన్నో రైల్వే స్టేషన్లో(Railway Station) లెక్కపెట్టలేనంత మంది జనం వస్తుంటారు. ఒక్క ముంబైలోని లోకల్ రైల్లో రోజుకి 70 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం సాగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇలా స్టేషన్లో ఎంత మంది వచ్చారో తెలుసుకొనేందుకు పలు రైల్వే స్టేషన్లలో 500 ఫేసియల్ రికగ్నెషన్ కెమెరాలను(Camera) అమర్చారు. ఈ కెమెరాలను రష్యాకు (Russia) చెందిన స్టార్టప్ కంపెనీ ఎన్టెక్ల్యాబ్స్ తయారు చేసింది. ప్రయాణికుల సంఖ్యను తెలపడం.. యాభై మంది ప్రయాణికులను ఒకే ఫ్రేమ్‌లో ఈ కెమెరా ఉంచుతుంది.
మాస్క్ వేసుకొని ఉన్నా కూడా వాళ్ల ఫేస్‌ను రికగ్నైజ్ చేస్తుంది. అలాగే.. ప్రయాణికుల గుంపులో క్రిమినల్స్ ఉంటే.. వాళ్లను పట్టుకోవడంలో ఈ కెమెరాలు సహాయం చేస్తాయి. ఎవరైనా తప్పిపోయినా కూడా ఈ కెమెరాల ద్వారా వాళ్లను ట్రాక్(Track) చేయొచ్చు. త్వరలోనే దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఇండియన్ రైల్వేస్ సన్నాహాలు చేస్తోంది.
కొందరు మాత్రం ఈ సాంకేతికత ప్రజల ప్రైవసీ(Privacy), స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని అంటున్నారు. కానీ పోలీసులు కూడా నేరస్థులను పట్టుకునేందుకు ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రయాణికుల భద్రతకు ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.