వాట్సప్-ఫేస్బుక్ కలసిపోవడం నిజమేనన్న మార్క్ జుకర్‌బర్గ్
Facebook-WhatsApp Integration | వాట్సప్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ కలిసిపోతాయని, ఇవన్నీ ఒకే యాప్‌లోకి వచ్చేస్తాయని రెండుమూడు రోజులుగా వార్తలొస్తున్నాయి. దీంతో నిజానిజాలేంటో తెలియక నెటిజన్లు అయోమయంలో ఉన్నారు.
news18-telugu
Updated: January 31, 2019, 4:10 PM IST
news18-telugu
Updated: January 31, 2019, 4:10 PM IST
వాట్సప్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ కలిసిపోతాయన్న వార్తలు రెండుమూడు రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది నిజమా కాదా అన్న అనుమానాలు, సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఇది నిజమేనంటూ ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా ప్రకటించేశారు. వాట్సప్-ఫేస్బుక్ కలిసిపోవడం నిజమే కానీ, ఇది లాంగ్-టర్మ్ ప్రాజెక్ట్ అని జుకర్‌బర్గ్ వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఇది సాధ్యం కాదని, 2020 తర్వాతే ఇది జరగొచ్చని చెప్పారు.
ఈ ప్రణాళికలు తుది దశకు చేరడానికి ముందు మేము చాలా చేయాల్సి ఉంది. అందుకే ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని చెబుతున్నాం. 2020 తర్వాతే ఇది జరగొచ్చు. వాణిజ్య ప్రయోజనాల కన్నా డేటా ఎన్క్రిప్షన్ కోసమే ఛాట్ ఇంటిగ్రేషన్‌పై దృష్టి పెడుతున్నాం.
వాట్సప్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ కలిసిపోతాయని, ఇవన్నీ ఒకే యాప్‌లోకి వచ్చేస్తాయని రెండుమూడు రోజులుగా వార్తలొస్తున్నాయి. దీంతో నిజానిజాలేంటో తెలియక నెటిజన్లు అయోమయంలో ఉన్నారు. ఛాట్ సర్వీసెస్‌ని కలిపేస్తారన్న వార్తలపై స్పందించాలంటూ ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ ఫేస్‌బుక్‌ను కోరింది. చివరకు ఛాట్ ఇంటిగ్రేషన్‌పై ఫేస్బుక్ స్పందించింది.
ఇవి కూడా చదవండి:Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలో యాడ్-ఆన్ మంచిదేనా?
SBI Data leak: ఎస్బీఐ అకౌంట్ల నుంచి మీ బ్యాలెన్స్ వివరాలన్నీ లీక్
Income Tax: 80సీ లిమిట్ మొత్తం వాడేశారా? పన్ను ఆదా చేయడానికి మరో 5 మార్గాలు

— మార్క్ జుకర్‌బర్గ్, ఫేస్బుక్ సీఈఓ
Loading....
SBI Data leak: ఎస్బీఐ అకౌంట్ల నుంచి మీ బ్యాలెన్స్ వివరాలన్నీ లీక్
Income Tax: 80సీ లిమిట్ మొత్తం వాడేశారా? పన్ను ఆదా చేయడానికి మరో 5 మార్గాలు
Loading...