చిరువ్యాపారులకు డిజిటల్ స్కిల్స్ నేర్పనున్న ఫేస్‌బుక్

వెబ్‌సైట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా డిజిటల్ ప్రజెన్స్ పెంచుకొని, వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో శిక్షణ ఇస్తారు. ఫేస్‌బుక్‌కు చెందిన ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను వ్యాపారానికి ఎలా ఉపయోగించుకోవాలో నేర్పిస్తారు.

news18-telugu
Updated: November 24, 2018, 6:30 PM IST
చిరువ్యాపారులకు డిజిటల్ స్కిల్స్ నేర్పనున్న ఫేస్‌బుక్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మూడేళ్లలో 50 లక్షల మంది చిరు వ్యాపారులకు డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తామని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఆన్‌లైన్‌ ద్వారా తమతమ వ్యాపారాలు పెంచుకునేందుకు తోడ్పడనుంది. ఫేస్‌బుక్ చేపట్టిన 10 కార్యక్రమాల ద్వారా ఇప్పటికే 150 నగరాలు, 48,000 గ్రామాల్లో 10 లక్షల మంది శిక్షణ పొందారు. ఇప్పుడు చిరు వ్యాపారులపై దృష్టి పెట్టింది ఫేస్‌బుక్. ఇందుకోసం రెండు రోజుల ఫేస్‌బుక్ కమ్యూనిటీ బూస్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందులో వ్యాపారులకు స్కిల్ డెవలప్‌మెంట్, ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తారు. బూస్ట్ యువర్ బిజినెస్, షీ మీన్స్ బిజినెస్ పేరుతో జరిగే కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు సంస్థల్ని భాగస్వాముల్ని చేస్తోంది ఫేస్‌బుక్.

వెబ్‌సైట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా డిజిటల్ ప్రజెన్స్ పెంచుకొని, వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో శిక్షణ ఇస్తారు. ఫేస్‌బుక్‌కు చెందిన ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను వ్యాపారానికి ఎలా ఉపయోగించుకోవాలో నేర్పిస్తారు. డిజిటల్ మార్కెటింగ్‌తో పాటు ఆన్‌లైన్ సేఫ్టీపై 14 భాషల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శిక్షణా కార్యక్రమాలుంటాయి. ఫేస్‌బుక్ జాబ్స్ సాయంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి:

ఓటర్లలో చైతన్యం పెంచేందుకు 'ఉంగ్లీ ఛాలెంజ్'రూ.2 లక్షల్లోపు టాప్ 5 మోటార్ సైకిళ్లు ఇవే...

గుడ్ న్యూస్: ఇక డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ మొబైల్‌లో చూపిస్తే చాలు

కోల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్ పొందడం ఎలా?ఇండియాలో 'సాలరీ ఫీచర్' లాంఛ్ చేసిన లింక్డ్‌ఇన్‌

మీ ఏటీఎం కార్డు బ్లాక్: ఎస్‌‌బీఐ ఖాతాదారులకు హెచ్చరిక
First published: November 24, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు