Home /News /technology /

FACEBOOK TO REMOVE LIKE BUTTON AND LIKE COUNT FROM PAGES SS

Facebook: ఫేస్‌బుక్ యూజర్లకు షాక్... ఇక ఆ ఫీచర్ ఉండదు

Facebook: ఫేస్‌బుక్ యూజర్లకు షాక్... ఇక ఆ ఫీచర్ ఉండదు
(ప్రతీకాత్మక చిత్రం)

Facebook: ఫేస్‌బుక్ యూజర్లకు షాక్... ఇక ఆ ఫీచర్ ఉండదు (ప్రతీకాత్మక చిత్రం)

Facebook | ఫేస్‌బుక్ పేజీలో త్వరలో మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం కొన్ని పేజీల్లో లే అవుట్ మార్చింది ఫేస్‌బుక్.

    మీరు ఫేస్‌బుక్ వాడుతున్నారా? మీకు నచ్చిన పేజీలకు లైక్ కొడుతున్నారా? లేదా మీరే ఫేస్‌బుక్‌లో పేజీ మెయింటైన్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఇకపై ఫేస్‌బుక్ పేజీలో లైక్ బటన్ ఉండదు. అంతేకాదు... లైక్ కౌంట్ కూడా కనిపించదు. ఫేస్‌బుక్ పేజీలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు కొత్త డిజైన్ పరీక్షిస్తోంది. పేజ్ క్లీన్‌గా ఉంచేందుకు, యూజర్లు చదివేందుకు సులువుగా ఉండేలా పేజీలో మార్పులు చేస్తోంది. యూజర్లు మాత్రమే కాదు... పేజీలను ఆపరేట్ చేసేవారు కూడా వాటిని మేనేజ్ చేయడం ఈజీగా ఉండేలా మార్పులు చేస్తోంది ఫేస్‌బుక్. ప్రస్తుతం ఈ ఫీచర్లను కొందరి పేజీలపై, మొబైల్ యాప్‌లో టెస్ట్ చేస్తోంది. త్వరలో అన్ని పేజీలకూ ఇదే లే అవుట్ రానుంది. మీరు ఫేస్‌బుక్ మెయింటైన్ చేస్తున్నట్టైతే మీ మొబైల్‌లో లాగిన్ అయి చూడండి. కొత్త లే అవుట్ కనిపించొచ్చు.

    WhatsApp: అలర్ట్... ఇలా చేస్తే మీ వాట్సప్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త

    OnePlus Nord: వన్‌ప్లస్ నార్డ్ ధర చూసి షాకయ్యారా? ఫోన్ ప్రత్యేకతలివే...

    ఫేస్‌బుక్ పేజీ మెయింటైన్ చేసేవాళ్లు మొబైల్‌లో లాగిన్ అయిన తర్వాత కొత్త లేఅవుట్ టెస్ట్ చేయడానికి అనుమతి అడుగుతుంది. యూజర్లు కోరుకుంటే కొత్త లేఅవుట్ చూడొచ్చు. లేదా పాత లేఅవుట్‌ ఉంటుంది. కొత్త లేఅవుట్‌లో లైక్ బటన్, లైక్ కౌంట్ లాంటివి ఉండవు. కేవలం పేజీ బయోడేటా, పోస్టులు మాత్రమే కనిపిస్తాయి. లైక్ బటన్ బదులు ఫాలో బటన్, ఫాలోవర్ కౌంట్ ఉంటాయి. ఆ పేజీని నిజంగా ఎంతమంది ఫాలో అవుతున్నారో లెక్క తెలుస్తుంది. గతంలో పేజీ లైక్ చేసినవారు ఆ తర్వాత అన్‌ఫాలో చేసినట్టైతే ఆ లెక్క కూడా తెలిసిపోతుంది. ఎంతమంది యూజర్లకు ఆ పేజీ అప్‌డేట్స్ వెళ్తున్నాయో ఫాలో కౌంట్ ద్వారా తెలుస్తుంది. పేజీ ఓనర్లు న్యూస్ ఫీడ్ బ్రౌజ్ చేయడం ద్వారా ఫాలోవర్లను సులువుగా కనెక్ట్ అయ్యేలా మార్పులు చేస్తోంది ఫేస్‌బుక్. ఇన్‌సైట్స్ కూడా పేజీలోనే చూసుకోవచ్చు. ఎక్కువమంది చూసిన పోస్టుల వివరాలు తెలుసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Facebook, Technology

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు