ఫేస్‌బుక్ అకౌంట్లకు హ్యాకింగ్ షాక్!

2018 సెప్టెంబర్ 16న అసాధారణ మార్పులు కనిపించాయి. అంటే అప్పట్నుంచి హ్యాకర్లు యూజర్ల డేటాను తస్కరిస్తున్నారన్న మాట. సెప్టెంబర్ 27న హ్యాకర్ల దాడిని ఫేస్‌బుక్ గుర్తించేసరికి 5 కోట్ల అకౌంట్లు హ్యాక్ అయిపోయాయి.

news18-telugu
Updated: September 29, 2018, 11:53 AM IST
ఫేస్‌బుక్ అకౌంట్లకు హ్యాకింగ్ షాక్!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓసారి మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి చూసుకోండి. అంతా సవ్యంగానే ఉందో లేదో ఓసారి చెక్ చేయండి. ఎందుకంటే వేలు కాదు... లక్షలు కాదు... ఏకంగా 5 కోట్ల ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు. స్వయంగా ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్ ప్రపంచానికి వెల్లడించిన చేదు నిజమిది.

అసలేం జరిగింది?

ఇప్పటికే ఫేస్‌బుక్‌కు కేంబ్రిడ్జ్ అనలికా డేటా స్కామ్ మాయని మచ్చగా మారింది. ఆ తర్వాత పేస్‌బుక్ గ్రాఫ్ కొద్దికొద్దిగా పడిపోతూ వస్తోంది. ఇప్పుడు హ్యాకర్లు ఫేస్‌బుక్ అకౌంట్లను టార్గెట్ చేశారు. ఏకంగా 5 కోట్ల అకౌంట్లను హ్యాక్ చేశారు. "వ్యూ యాజ్" ఫీచర్‌ ద్వారా హ్యాక్ చేసి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారన్న అనుమానాలున్నాయి. ఫేస్‌బుక్ ఐటీ నిపుణులు అప్రమత్తమయ్యేసరికి 5 కోట్ల అకౌంట్లు హ్యాకింగ్ బారినపడ్డాయి. అయితే మరో 4 కోట్ల అకౌంట్ల సమాచారం హ్యాకర్ల చేతిలో పడకుండా జాగ్రత్తపడ్డారు.

ఎలాంటి డేటా కొట్టేశారు?
యూజర్ల ప్రొఫైల్‌లో ఉండే పేరు, జెండర్, స్వస్థలం లాంటి వివరాలన్నీ హ్యాకర్ల చేతిలో పడ్డాయని భావిస్తున్నారు. అంతేకాదు... ప్రైవేట్ మెసేజెస్ కూడా హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. అయితే క్రెడిట్ కార్డ్ సమాచారం మాత్రం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లలేదు.

ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది?
ఫేస్‌బుక్‌ను హ్యాకర్లు ఇప్పటికిప్పుడు టార్గెట్ చేయలేదు. ఏడాది ముందుగానే పక్కా ప్లాన్ రచించారు. 2017 జూలైలో దాడి మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆ ఎటాక్‌ను ఫేస్‌బుక్ గుర్తించలేదంటే సెక్యూరిటీ సిస్టమ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2018 సెప్టెంబర్ 16న అసాధారణ మార్పులు కనిపించాయి. అంటే అప్పట్నుంచి హ్యాకర్లు యూజర్ల డేటాను తస్కరిస్తున్నారన్న మాట. సెప్టెంబర్ 27న హ్యాకర్ల దాడిని ఫేస్‌బుక్ గుర్తించేసరికి 5 కోట్ల అకౌంట్లు హ్యాక్ అయిపోయాయి.హ్యాకింగ్ తర్వాత ఏం జరిగింది?
హ్యాకింగ్ ప్రక్రియ పూర్తికాగానే కోట్లాది మంది ఫేస్‌బుక్ అకౌంట్లు లాగ్ అవుట్ అయ్యాయి. ఫోన్లు, కంప్యూటర్లలో ఆల్వేస్ లాగిన్ స్టేటస్‌లో ఉన్నవారి అకౌంట్లు కూడా లాగౌట్ అయ్యాయి. అలా మీ అకౌంట్ కూడా మీ ప్రమేయం లేకుండా లాగౌట్ అయిందంటే మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్టే. ఇది ఫేస్‌బుక్ మెసెంజర్‌కు కూడా వర్తిస్తుంది.

ఎవరు చేశారు? ఎందుకు చేశారు?
ఈ ఎటాక్ ఎవరు చేశారన్నది ఫేస్‌బుక్ గుర్తించలేకపోయింది. దర్యాప్తు మొదలుపెట్టింది ఎఫ్‌బీఐ. అయితే గతంలో అమెరికా ఎన్నికల సమయంలో రష్యా ఇలాంటి ప్రయత్నాలు చేసిందన్న వాదన ఉంది. అయితే ప్రస్తుతం ఈ దాడి వెనుక రష్యా ఉందో లేదో చెప్పలేం. హ్యాకర్లు ఎవరో గుర్తించడానికి చాలా సమయం పట్టేలా ఉంది.

ఇవి కూడా చదవండి:

ఫేస్‌బుక్ హ్యాకైందా? మరి మీరేం చేయాలి?

ఫేస్‌బుక్ హ్యాక్: ఆ అమ్మాయి ఎవరు?

మీ వాట్సప్ హ్యాక్ అయిందా?

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని అకౌంట్లు ఇవే!

నాలుగు కెమెరాలతో రెడ్‌మీ నోట్ 6 ప్రో
Published by: Santhosh Kumar S
First published: September 29, 2018, 10:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading