Facebook నుంచి కొత్త ఫీచర్ Messenger Kids...పిల్లల కోసం ప్రత్యేక యాప్...

తల్లిదండ్రుల పర్యవేక్షణలో పనిచేసే ఈ మెసెంజర్‌ యాప్‌ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో కనెక్ట్‌ కావడానికి ఉపయోగపడుతుంది.

news18-telugu
Updated: April 25, 2020, 1:38 PM IST
Facebook నుంచి కొత్త ఫీచర్ Messenger Kids...పిల్లల కోసం ప్రత్యేక యాప్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఫేస్‌బుక్‌ తాజాగా భారత్‌లో మరో కొత్త సర్వీస్‌ ప్రారంభించింది. పిల్లల కోసం మెసెంజర్‌ కిడ్స్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది. అయితే వారాంతంలో గూగుల్‌ ప్లే స్టోర్‌లో కూడా అందుబాటులోకి తెస్తామని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో పనిచేసే ఈ మెసెంజర్‌ యాప్‌ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో కనెక్ట్‌ కావడానికి ఉపయోగపడుతుంది. లాక్‌డౌన్‌ కారణంగా స్కూళ్లు, కార్యాలయాలు మూతబడటంతో ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడుతున్నారు. దీంతో పిల్లలు కూడా స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులతో కనెక్ట్‌ అయ్యేందుకు మెసెంజర్‌ కిడ్స్‌ ఉపయోగపడుతుంది. పిల్లలు తమ స్నేహితులతో ఎడ్యుకేషన్ కు సంబంధించిన సందేహాలు తీర్చుకోవచ్చు. కంబైన్డ్ స్టడీ చేసుకునేందుకు కూడా మెసెంజర్ కిడ్స్ ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ తెలిపింది.
First published: April 25, 2020, 1:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading