FACEBOOK ROLLS OUT LIVE AUDIO PODCASTS IN UNITED STATES MK GH
Facebook Live Audio: ఫేస్బుక్లో మరో ట్రెండింగ్ ఫీచర్.. ఆ సంస్థలకు పోటీగా అప్డేట్
5. ఈ మూడు సోషల్ మీడియా కంపెనీలు కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ని అంగీకరించనందున వీటిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా భారత ప్రభుత్వం ఆదేశించినట్టుగా అధికారులను నియమించలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఫేస్బుక్ కొత్త ఫీచర్‌ను తన యాప్‌లో తీసుకొస్తోంది. ‘లైవ్ ఆడియో రూమ్స్’ పేరుతో అమెరికాలో ఈ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది.
సోషల్ మీడియా ఎప్పుడూ ఒక చోట కుదురుగా ఉండదు అంటారు. అంటే కొత్త కొత్త మార్పులు వస్తూ ఉంటాయి. వాటిని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. తాజాగా పుట్టుకొచ్చిన రూపం ‘ఆడియో బేస్డ్ సోషల్ నెట్వర్క్’. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ‘క్లబ్ హౌస్’. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇది. ఇప్పుడు ఫేస్బుక్ కూడా ఈ తరహా ఫీచర్‌ను తన యాప్‌లో తీసుకొస్తోంది. ‘లైవ్ ఆడియో రూమ్స్’ పేరుతో అమెరికాలో ఈ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది.
‘క్లబ్ హౌస్’లో మాదిరిగానే ఫేస్బుక్ లైవ్ ఆడియో రూమ్స్ ఉండబోతోంది. ఇందులో మాట్లాడాలనుకునే వ్యక్తి /ఇన్ఫ్లూయెన్సర్ రూమ్ క్రియేట్ చేయొచ్చు. అ తర్వాత అందులోకి స్పీకర్లను ఇన్వైట్ చేయొచ్చు. అలా రూమ్‌లో చేరినవాళ్లు మాట్లాడాలని అనుకుంటే స్పీకర్లుగా ప్రమోట్ చేయొచ్చు. అలాగే డిస్కవర్ ఆప్షన్‌లోకి వెళ్లి కావాల్సిన లైవ్ రూమ్స్‌ను సెర్చ్ చేయొచ్చు. ఇన్ఫ్లూయెన్సర్, టాపిక్ ఆధారంగా మీ సెర్చింగ్ చేయొచ్చు. ప్రస్తుతానికి యాప్‌లోనే ఫేస్బుక్ ఈ ఫీచర్ అందిస్తోంది. రూమ్‌లు ముందుగానే క్రియేట్ చేసుకొని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఒక్కో రూమ్‌లో గరిష్ఠంగా 50 మంది స్పీకర్లను ఉంచొచ్చు. ఇక లిజనర్స్ విషయంలో లిమిట్ లేదు.
యూఎస్‌లో ఫేస్బుక్ ‘లైవ్ ఆడియో రూమ్స్’ ప్రచారం కోసం చాలామంది ఇన్ఫ్లూయెన్సర్లను ముందుకు తీసుకొస్తోంది. రాపర్ డి స్మోక్, వెల్నెస్ గురు డాక్టర్ జెస్, సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ డీరే మెకెసన్ లాంటివాళ్లు ఈ ఆడియో బేస్డ్ ప్లాట్ఫామ్లోకి వచ్చారు. మరింతమందిని ఇందులోకి తీసుకురావడానికి ఫేస్బుక్ ప్రయత్నాలు చేస్తోంది. అలా అని అందరినీ ఎంటర్ చేసేందుకు సిద్ధపడటం లేదు. స్క్రూట్నీ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తోందని సమాచారం.
ఫేస్బుక్ ఇప్పుడు ఈ రంగంలోకి వచ్చింది కానీ... ఇప్పటికే క్లబ్‌హౌస్ దూసుకుపోతోంది. గతేడాది క్లబ్‌హౌస్ 10 మిలియన్ల మంది యూజర్లను సంపాదించింది. మరోవైపు ట్విటర్ కూడా ‘స్పేసెస్’ పేరుతో ఈ తరహా ఆప్షన్‌ను లాంచ్ చేసింది. స్పాటిఫై కూడా గ్రీన్ రూమ్ పేరుతో సర్వీసును ఇప్పటికే బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఆడియో బేస్డ్ ప్లాట్ఫామ్లో నాలుగు స్తంభాలాట మొదలైంది. జోరు చూస్తుంటే... ఇలాంటి ఆడియో బేస్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇంకా చాలా వచ్చేలా కనిపిస్తోంది. ఈ ఫేస్బుక్ లైవ్ ఆడియో రూమ్స్ తర్వలోనే మన దేశంలో అందుబాటులోకి వస్తుందట.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.