ఫేస్బుక్ కొత్తగా అవతార్స్ ఫీచర్‌ను ఇండియన్ యూజర్ల కోసం రిలీజ్ చేసింది. బిట్మోజీకి పోటీగా ఈ ఫీచర్‌ను రూపొందించింది ఫేస్బుక్. ఈ ఫీచర్‌తో మీ మొహాన్ని కార్టూన్ లాగా మార్చేయొచ్చు. రకరకాల ఫేస్ కట్స్, హెయిర్ స్టైల్, దుస్తులతో ఆకట్టుకునేలా రూపొందించొచ్చు. మీ అవతార్‌ను ఫేస్బుక్ కామెంట్స్, స్టోరీస్, ప్రొఫైల్ పిక్చర్, మెసెంజర్ ఛాట్ విండోస్‌లో ఉపయోగించొచ్చు. ఈ అవతార్‌ను వాట్సప్‌లో కూడా షేర్ చేయొచ్చు.
ప్రస్తుతం ఆన్లైన్లో సోషల్ ఇంటరాక్షన్ బాగా పెరిగిపోయింది. అందరూ ఫేస్బుక్లో పర్సనల్‌గా తమ భావాలను వ్యక్తం చేయడం ముఖ్యం. ప్రస్తుతం అవతార్ క్రియేషన్ ఫ్రమ్ మెసెంజర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ వస్తుంది.
మీ ఫేస్బుక్ లేదా మెసెంజర్ ఓపెన్ చేసి కామెంట్ కంపోజర్లో ఎమోషన్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్టిక్కర్ ట్యాబ్ క్లిక్ చేసి Create Your Avatar పైన క్లిక్ చేయాలి. ఫేస్బుక్ యాప్‌లో బుక్‌మార్క్స్‌లో అవతార్ క్రియేటర్ యాక్సెస్ చేయొచ్చు. ఈ ఫీచర్‌ను అమెరికాలో మేలోనే రిలీజ్ చేసింది ఫేస్బుక్. బిట్మోజీ, యాపిల్‌కు చెందిన మెమోజీకి పోటీగా అవతార్ ఫీచర్‌ను రూపొందించింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.