FACEBOOK RAY BAN SMART GLASSES NEXT PRODUCT LAUNCH SPECS GH VB
Smart glasses: ఆ సంస్థ నుంచి రేబాన్ స్మార్ట్ గ్లాసెస్.. కొత్త డివైజ్‌ను అభివృద్ధి చేస్తోన్న సంస్థ..
ప్రతీకాత్మక చిత్రం
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. సూపర్ న్యూస్ చెప్పింది. సంస్థ నుంచి రానున్న తర్వాతి హార్డ్‌వేర్ డివైజ్‌ను తాజాగా ప్రకటించింది. రేబాన్ స్మార్ట్గ్లాసెస్ను త్వరలో విడుదల చేయనున్నట్టు చెప్పింది. అయితే లాంచ్ డేట్‌ను ఫేస్బుక్ ప్రకటించలేదు. ఈ ఏడాదే తప్పకుండా ఈ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. సూపర్ న్యూస్ చెప్పింది. సంస్థ నుంచి రానున్న తర్వాతి హార్డ్‌వేర్ డివైజ్‌ను తాజాగా ప్రకటించింది. రేబాన్ స్మార్ట్గ్లాసెస్ను త్వరలో విడుదల చేయనున్నట్టు చెప్పింది. అయితే లాంచ్ డేట్‌ను ఫేస్బుక్ ప్రకటించలేదు. ఈ ఏడాదే తప్పకుండా ఈ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా మహమ్మారి వల్ల చాలా సంస్థల ప్లాన్లు మారిపోయాయని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. అందుకే గ్లాసెస్ తీసుకొచ్చే సమయాన్ని కచ్చితంగా చెప్పలేకపోతున్నామనేలా వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. గ్లాసెస్ మేకర్ ఎసిలోర్ లక్సోటికాతో చేతులు కలిపి రేబన్ బ్రాండ్‌తో ఫేస్బుక్ ఈ స్మార్ట్గ్లాసెస్ను తీసుకొస్తోంది. ఇవి ఏఆర్ గ్లాసెస్ కాకపోయినా ఫీచర్లు అధికంగా ఉంటాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. “మా తొలి స్మార్ట్గ్లాసెస్ను రేబాన్ నుంచి ఎసిలోర్ లక్సోటికా భాగస్వామ్యంతో తీసుకొస్తున్నాం. ఈ గ్లాసెస్‌లో చాలా ప్రత్యేకతలు ఉంటాయి. స్పెషల్ సదుపాయాలు పొందవచ్చు” అని ఫేస్బుక్ సీఈవో జుకర్‌బర్గ్ చెప్పారు.
ఫీచర్లు అంటూ జుకర్‌బర్గ్ చెప్పినా.. ఎలాంటివి తీసుకొస్తున్నారని స్పష్టంగా చెప్పలేదు. అయితే ఈ గ్లాసెస్‌లో ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే ఉండదని ఇది వరకే ప్రకటించిన ఫేస్బుక్.. ఇది రియాల్టీ డివైజ్ కాదని చెప్పకనే చెప్పింది. అయితే వాయిస్ కాల్స్ చేసేందుకు ఈ గ్లాసెస్ ఉపయోగపడతాయా.. వాయిస్ అసిస్టెంట్ యాక్సెస్ చేయవచ్చా అన్నది కూడా ఇంకా స్పష్టం కాలేదు. అయితే ఈ ఫీచర్లు ఉండే అవకాశం అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇంటిగ్రేడెట్ డిస్ప్లే లేని కారణంగా స్మార్ట్‌ఫోన్ యాప్స్ సాయంతోనే ఈ స్మార్ట్‌గ్లాసెస్ ఫుల్ ఫీచర్లు పని చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అమెజాన్ ఎకో ఫ్రేమ్స్, స్నాప్ స్పెక్టాకల్స్ ఇదే రీతిలో ఉన్నాయి. సమీప భవిష్యత్తులో రియాల్టీ గ్లాసెస్‌ను తీసుకురావాలన్న ప్రయాణంలో భాగంగానే రేబాన్ స్మార్ట్గ్లాసెస్ను తీసుకొస్తున్నట్టు ఫేస్బుక్ సీఈవో జుకర్బర్ల్ అన్నారు. ఏఆర్ గ్లాసెస్ తీసుకురావడంపై ఫేస్బుక్ ఎప్పటి నుంచో పని చేస్తోంది. ఇందుకోసం ప్రొటోటైప్ ఏఆర్ గ్లాసెస్‌ను తయారు చేస్తోందని సమాచారం.
ముఖ్యంగా షాపింగ్, పని ప్రదేశాలు, సోషలైజింగ్ కోసం వర్చువల్ సదుపాయాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఫేస్బుక్ ఏఆర్ గ్లాసెస్‌ను తీసుకురావాలని అనుకుంటోంది. ఫేస్బుక్లో వర్చువల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టి.. షాపింగ్‌లోనూ దూసుకెళ్లాలని టెక్ దిగ్గజం చూస్తోంది. కాగా ఫేస్బుక్లో షాపింగ్ యాడ్ల విషయంలోనూ జుకర్‌బర్గ్ స్పందించారు. సోషల్ మీడియాలో ప్రకటన వ్యూహం చాలా ముఖ్యమైన విషయంగా ఉందని అన్నారు. కాగా ఫేస్బుక్ గ్లాసెస్‌లో ఆడియో ఫీచర్లు ఎక్కువగా ఉంటాయని అంచనా. వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లతో పాటు ఆడియో డివైజ్‌లకు కనెక్ట్ చేసుకొని వినియోగించే అవకాశం ఉండొచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.