Facebook Pay: గూగుల్‌ పే, పేటీఎంకు పోటీగా 'ఫేస్‌బుక్ పే'... పేమెంట్స్ చేయొచ్చు ఇలా

Facebook Pay | 'ఫేస్‌బుక్ పే' అన్ని క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులకు పనిచేస్తుంది. పేపాల్, స్ట్రైప్ లాంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు.

news18-telugu
Updated: November 13, 2019, 4:28 PM IST
Facebook Pay: గూగుల్‌ పే, పేటీఎంకు పోటీగా 'ఫేస్‌బుక్ పే'... పేమెంట్స్ చేయొచ్చు ఇలా
Facebook Pay: గూగుల్‌ పే, పేటీఎంకు పోటీగా 'ఫేస్‌బుక్ పే'... పేమెంట్స్ చేయొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్‌-UPI ప్లాట్‌ఫామ్‌లోకి ఫేస్‌బుక్ కూడా వచ్చేస్తోంది. వాట్సప్, మెసెంజర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ల నుంచి మీరు పేమెంట్స్ చేయొచ్చు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. షాపింగ్, గేమ్ పర్చేసెస్, ఈవెంట్ టికెట్స్ ఇలా దేనికైనా మీరు 'ఫేస్‌బుక్ పే' ఉపయోగించొచ్చు. మెసెంజర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ కంపెనీలన్నీ ఫేస్‌బుక్‌వే. అయితే మీరు 'ఫేస్‌బుక్ పే'ను ఒక్క ఫేస్‌బుక్‌లోనే కాదు... మెసెంజర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు ఏ యాప్‌లో ఉంటే అదే యాప్ నుంచి నేరుగా పేమెంట్స్ చేయొచ్చు. ఇప్పటికే గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే లాంటి యూపీఐ సర్వీసులున్నాయి. వాటికి పోటీగా 'ఫేస్‌బుక్ పే' వచ్చింది.

'ఫేస్‌బుక్ పే' అన్ని క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులకు పనిచేస్తుంది. పేపాల్, స్ట్రైప్ లాంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. పిన్ లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్‌తో సెక్యూరిటీ పెంచుకోవచ్చు. ఫేస్‌బుక్ లేదా మెసెంజర్ యాప్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లో 'ఫేస్‌బుక్ పే' ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్ పేలోనే మీరు మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసుకోవచ్చు. లిబ్రా నెట్‌వర్క్‌తో పనిచేసే పేమెంట్ సర్వీస్ ఇది. ప్రస్తుతం 'ఫేస్‌బుక్ పే' అమెరికాలో మాత్రమే లాంఛ్ అయింది. 'ఫేస్‌బుక్ పే' ఇండియాలో ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉంది.

Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

WhatsApp: యూజర్లను బ్యాన్ చేస్తున్న వాట్సప్... ఎందుకో, మీరేం చేయాలో తెలుసుకోండి

Credit Card: క్రెడిట్ కార్డు ఉందా? ఈ తప్పులు మీరూ చేస్తున్నారా?
Loading...
IRCTC: బ్యాంకాక్‌లో న్యూ ఇయర్ పార్టీ... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే
First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...