Facebook Bug: మీ ఫేస్‌బుక్‌ ఛాటింగ్‌ను లీక్ చేసే బగ్

ఫేస్‌బుక్ ప్రస్తుతం ఆ బగ్‌ను ఫిక్స్ చేసినా... ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఛాటింగ్‌ను ఇతర వెబ్‌సైట్లు యాక్సెస్ చేయడం యూజర్లను కలవరపరుస్తోంది. అయితే ఈ బగ్ ఫేస్‌బుక్ మెసెంజర్‌ వెబ్ వర్షన్‌లోనే కనిపించింది.

news18-telugu
Updated: March 12, 2019, 9:41 AM IST
Facebook Bug:  మీ ఫేస్‌బుక్‌ ఛాటింగ్‌ను లీక్ చేసే బగ్
Facebook Bug: మీ ఫేస్‌బుక్‌ ఛాటింగ్‌ను లీక్ చేసే బగ్
news18-telugu
Updated: March 12, 2019, 9:41 AM IST
మీరు ఫేస్‌బుక్ మెసెంజర్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. మీరు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో చేసిన ఛాటింగ్ లీక్ కావచ్చు. ఓ బగ్ మెసెంజర్‌లో యూజర్ల డేటాను యాక్సెస్ చేసే అవకాశం ఇతర వెబ్‌సైట్లకు కల్పిస్తోందంటూ సైబర్ సెక్యూరిటీ సంస్థ Imperva ఓ కథనాన్ని పబ్లిష్ చేసింది. ఈ బగ్‌ను తొలిసారిగా గుర్తించింది ఈ సంస్థనే. ఫేస్‌బుక్ ప్రస్తుతం ఆ బగ్‌ను ఫిక్స్ చేసినా... ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఛాటింగ్‌ను ఇతర వెబ్‌సైట్లు యాక్సెస్ చేయడం యూజర్లను కలవరపరుస్తోంది. అయితే ఈ బగ్ ఫేస్‌బుక్ మెసెంజర్‌ వెబ్ వర్షన్‌లోనే కనిపించింది.

Read this: Voter Helpline App: ఓటర్ హెల్ప్‌లైన్ యాప్... ఎలా వాడాలో తెలుసుకోండి

గతేడాది ఛాట్ యాప్‌లో ఇలాంటి బగ్ ఒకటి కనిపించింది. అప్పుడు యాప్‌లో పాత మెసేజ్‌లన్నీ మళ్లీ కొత్త మెసేజ్‌లు వచ్చినట్టుగా యూజర్లకు నోటిఫికేషన్లు వెళ్లాయి. గతంలో చదివిన మెసేజ్‌లే అయినా అన్‌రీడ్ అని కనిపించడంతో ఫేస్‌బుక్ మెసెంజర్ యూజర్లు షాకయ్యారు. మెసెంజర్ యాప్‌ను 'ప్రైవసీ-ఫోకస్డ్' యాప్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే మెసెంజర్‌లో బగ్ బయటపడటం కలకలం రేపుతోంది. బగ్స్‌ను అడ్డుకునే, సమస్యల్లేకుండా చూసే పూర్తి సామర్థ్యం మెసెంజర్ యాప్‌లో లేదని మాత్రం అర్థమవుతోంది.

Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్



ఇవి కూడా చదవండి:

Realme 3 Sale: రేపే రియల్‌మీ 3 సేల్... ధర రూ.8,999... జియో నుంచి రూ.5,300 బెనిఫిట్స్
Loading...
డిగ్రీ ఉంటే చాలు... బ్యాంక్ ఆఫ్ బరోడాలో 100 ఉద్యోగాలు...

Good News: ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్న ఇన్స్యూరెన్స్ ప్రీమియం

మీ దగ్గరున్న నోటు నకిలీదా? ఒరిజినలా? స్మార్ట్‌ఫోన్ యాప్‌తో గుర్తించొచ్చు
First published: March 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...