స్కిల్ ఇండియా మిషన్‌లో ఫేస్‌బుక్ కోర్సులు!

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ ఇండియా మిషన్‌లో ఫేస్‌బుక్ కూడా చేరింది. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఎంపిక చేసిన ట్రైనర్లతో యువతకు డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ సేఫ్టీ, ఆర్థిక అక్షరాస్యత లాంటి అంశాలపై భారతీయ భాషల్లో శిక్షణ ఇవ్వనుంది ఫేస్‌బుక్.

news18-telugu
Updated: July 17, 2018, 4:32 PM IST
స్కిల్ ఇండియా మిషన్‌లో ఫేస్‌బుక్ కోర్సులు!
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ ఇండియా మిషన్‌లో ఫేస్‌బుక్ కూడా చేరింది. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఎంపిక చేసిన ట్రైనర్లతో యువతకు డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ సేఫ్టీ, ఆర్థిక అక్షరాస్యత లాంటి అంశాలపై భారతీయ భాషల్లో శిక్షణ ఇవ్వనుంది ఫేస్‌బుక్.
  • Share this:
భారతదేశంలోని యువతకు, ఆంట్రప్రెన్యూర్లకు డిజిటల్ స్కిల్స్ నేర్పేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌(ఎన్ఎస్‌డీసీ )తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్‌ను తమ కోర్సుల్లో చేర్చనుంది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్ షిప్. డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ సేఫ్టీ, ఆర్థిక అక్షరాస్యత లాంటి అంశాలపై భారతీయ భాషల్లో శిక్షణ అందించనున్నారు. నిరుద్యోగులకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడ్తాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.

దేశంలోని యువతలో నైపుణ్యాలు పెంచడమే కాకుండా స్థానిక వ్యాపారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు మేం కావాల్సిన వనరుల్ని, శిక్షణను అందిస్తాం. తద్వారా సంప్రదాయంగా చేస్తున్న వ్యాపారంతో పాటు ఆన్‌లైన్‌లో అవకాశాల ద్వారా బిజినెస్ పెంచుకునే అవకాశముంది. ఇందుకోసం నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నందుకు సంతోషిస్తున్నాం.

అంకిత్ దాస్, పబ్లిక్ పాలసీ డైరెక్టర్, ఫేస్‌బుక్


వివిధ అంశాల్లో నైపుణ్యం సాధించినవాళ్లు, వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించేవారు మరిన్ని ఉద్యోగాలను పెంచడమే కాకుండా, దేశంలో ఆర్థిక వృద్ధికి ఉపయోగపడ్తారని చెబుతోంది ఫేస్‌బుక్.

డిజిటల్ అవకాశాలను పెంచడమే ఫేస్‌బుక్‌తో ఒప్పందం లక్ష్యం. చాలా వ్యాపారాలకు మార్కెట్‌ప్లేస్ సృష్టించడమే కాకుండా, నిరుద్యోగులు నైపుణ్యం పొందుతారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు ఫేస్‌బుక్ నిపుణుల డిజిటల్ స్కిల్స్‌ని ఉపయోగించుకుంటున్నాం.
ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్, ఆంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రి


'బూస్ట్ యువర్ బిజినెస్' పేరుతో దేశంలోని 16 రాష్ట్రాల్లో రెండు లక్షల మంది యువతీయువకులు, ఆంట్రప్రెన్యూర్స్‌కు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చింది ఫేస్‌బుక్. మరో కార్యక్రమం ద్వారా 30 వేల మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చింది. 2020 నాటికి ఐదు లక్షల మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా డిజిటల్ ట్రైనింగ్ హబ్‌ని ప్రారంభించింది ఫేస్‌బుక్.
Published by: Santhosh Kumar S
First published: July 17, 2018, 4:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading