వామ్మో... ఫేస్‌బుక్‌ను నమ్మలేం అంటున్న నెటిజన్లు... ఎందుకు?

తమ డేటా విషయంలో ఫేస్‌బుక్‌ని నమ్మలేమని తేల్చిచెప్పిన నెటిజన్లు... ఆ తర్వాత ట్విట్టర్, అమెజాన్‌ల విషయంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే 8 శాతం మంది ట్విట్టర్, అమెజాన్లను నమ్మలేం అన్నారు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో 7 శాతంతో ఊబెర్, 6 శాతంతో గూగుల్, లిఫ్ట్ ఉన్నాయి. నమ్మకమైనవాటిలో నెట్‌ఫ్లిక్స్, టెస్లా నిలిచాయి.

news18-telugu
Updated: December 31, 2018, 2:44 PM IST
వామ్మో... ఫేస్‌బుక్‌ను నమ్మలేం అంటున్న నెటిజన్లు... ఎందుకు?
వామ్మో... ఫేస్‌బుక్‌ను నమ్మలేం అంటున్న నెటిజన్లు... ఎందుకు?(REUTERS/Dado Ruvic/Illustration - RC120CEA3D60)
  • Share this:
ఫేస్‌బుక్... ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్. ఫేస్‌బుక్ గతం ఎంత ఘనంగా ఉందో... ప్రస్తుతం పరిస్థితి అంతే అల్లకల్లోలంగా ఉంది. వరుసగా డేటా స్కామ్‌లతో ఫేస్‌బుక్ కొట్టుమిట్టాడుతోందన్నది వాస్తవం. కేంబ్రిడ్జి అనలిటికా స్కామ్‌తో ఫేస్‌బుక్‌పై జనానికి నమ్మకం లేకుండా పోయింది. ప్రముఖ రీసెర్చ్ కంపెనీ టొలునా 2018 డిసెంబర్‌లో ఓ సర్వే నిర్వహిస్తే... వామ్మో... ఫేస్‌బుక్‌ను నమ్మలేం అని తేల్చేశారు నెటిజన్లు. సుమారు 40 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తమ వ్యక్తిగత సమాచారంపై ఆందోళన వ్యక్తం చేశారు.

వామ్మో... ఫేస్‌బుక్‌ను నమ్మలేం అంటున్న నెటిజన్లు... ఎందుకు? | FACEBOOK IS THE LEAST TRUSTED TECH COMPANY FOLLOWED BY TWITTER, AMAZON: SURVEY
image: www.toluna-analytics.com


తమ డేటా విషయంలో ఫేస్‌బుక్‌ని నమ్మలేమని తేల్చిచెప్పిన నెటిజన్లు... ఆ తర్వాత ట్విట్టర్, అమెజాన్‌ల విషయంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే 8 శాతం మంది ట్విట్టర్, అమెజాన్లను నమ్మలేం అన్నారు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో 7 శాతంతో ఊబెర్, 6 శాతంతో గూగుల్, లిఫ్ట్ ఉన్నాయి. నమ్మకమైనవాటిలో నెట్‌ఫ్లిక్స్, టెస్లా నిలిచాయి. మైక్రోసాఫ్ట్, యాపిల్‌పై 4 శాతం మంది అనుమానం వ్యక్తం చేశారు.

ఓవరాల్‌గా చూస్తే ఫేస్‌బుక్‌పైనే ఎక్కువగా అనుమానాలున్నాయి. ఫేస్‌బుక్ డేటా దుర్వినియోగం అవుతోందని గతంలో చాలా ఘటనలు రుజువు చేయడమే ఆ సోషల్ మీడియా దిగ్గజం ప్రతిష్ట మసకబారడానికి కారణం.ఇవి కూడా చదవండి:

#Reminder: 2019లో మీరు గుర్తుంచుకోవాల్సిన డెడ్‌లైన్స్ ఇవే...2018లో మారిన పర్సనల్ ట్యాక్స్ రూల్స్ ఇవే... తెలుసుకోండి

IRCTC వెబ్‌సైట్ మారింది... కొత్త ఫీచర్లు ఇవే

బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ని ఎలా లెక్కిస్తాయి? తెలుసుకోండి
First published: December 31, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>