Home /News /technology /

Facebook | ఫేస్ బుక్ నుంచి టిక్ టాక్ తరహా యాప్.. ఇండియాలోనే టెస్టింగ్...

Facebook | ఫేస్ బుక్ నుంచి టిక్ టాక్ తరహా యాప్.. ఇండియాలోనే టెస్టింగ్...

TikTok: (ప్రతీకాత్మక చిత్రం)

TikTok: (ప్రతీకాత్మక చిత్రం)

ప్రముఖ టెక్ దిగ్గజం ఫేస్ బుక్ నుంచి టిక్ టాక్ తరహాలో షార్ట్ వీడియో యాప్ అందుబాటులోకి రానుంది.

    ప్రముఖ టెక్ దిగ్గజం ఫేస్ బుక్ నుంచి టిక్ టాక్ తరహాలో షార్ట్ వీడియో యాప్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే Lasso (ఇతర మార్కెట్లలో), Reels (ఇన్ స్టా గ్రామ్‌లో) లాంటి యాప్స్‌ను టెస్ట్ చేస్తున్న ఫేస్ బుక్ భారత్‌లో కొత్తగా మరో దాన్ని టెస్ట్ చేస్తోంది. ఫేస్ బుక్ ప్రధాన యాప్ మీదే ఈ టెస్టింగ్ జరుగుతోంది. న్యూస్ ఫీడ్‌లో క్రియేట్ బటన్ నొక్కితే అందులో కెమెరా ఆన్ అవుతుంది. మీరు వీడియోలు తీసి అప్ లోడ్ చేయవచ్చు. ప్రజలకు టిక్ టాక్ లాంటి యాప్స్ మీద పెద్ద ఎత్తున అభిమానంతో ఉన్నారు. అలాంటి యాప్స్ మీద మనసు పడుతున్నారు. టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత అలాంటి ఇతర యాప్స్ ‌ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. దీంతోపాటు టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఫేస్ బుక్ ట్రాఫిక్ భారత్‌లో 25 శాతం పెరిగినట్టు కంపెనీ తెలిపింది. టిక్ టాక్ బ్యాన్‌తో ఏర్పడిన ఖాళీని ఈ సరికొత్త యాప్ ద్వారా భర్తీ చేయాలని, దాని ద్వారా ఆదాయం పొందాలని ఫేస్ బుక్ ప్రయత్నాలు చేస్తోంది. ఇన్‌ స్టా గ్రామ్‌లో Reels‌ను కూడా మొదట భారత్‌లోనే లాంచ్ చేసింది. ఆ తర్వాత ఇతర మార్కెట్లలో లాంచ్ చేసింది. ఇప్పటికే భారత్‌లో టిక్ టాక్ లాంటి యాప్స్‌ను చాలా సంస్థలు తీసుకొచ్చాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Facebook, Tik tok, Tiktok

    తదుపరి వార్తలు