WhatsApp: వాట్సప్ వాడేవారికి త్వరలో ఈ తిప్పలు తప్పవు

అంటే వెబ్ సైట్‌‌ను సందర్శించే విజిటర్ల ఫోన్ నెంబర్లు గూగుల్ సెర్చ్‌లో దర్శనమివ్వడానికి అవకాశం ఉందని జయరామ్ చెప్పారు.

WhatsApp | మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నారా? వాట్సప్‌లో త్వరలో అతిపెద్ద మార్పు రాబోతోంది. ఆ తర్వాత మీకు తిప్పలు తప్పవు. ఎందుకో తెలుసుకోండి.

  • Share this:
    వాట్సప్... ప్రపంచానికి పరిచయం అక్కర్లేని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. వాట్సప్ బిజినెస్ మోడల్ ఏంటన్న సందేహాలు చాలామందిలో ఉండేవే. ఎందుకంటే వాట్సప్‌లో ఎలాంటి యాడ్స్ ఉండవు. మరి వాట్సప్‌కు ఆదాయం ఎలా వస్తుందన్న డౌట్స్ అనేక మందికి ఉంటాయి. వాట్సప్‌లో యాడ్స్ లేనందువల్లే ఈ యాప్‌పైన క్రేజ్ పెరిగింది. కానీ ఇకపై వాట్సప్‌లో కూడా యాడ్స్ రాబోతున్నాయి. అవును. వాట్సప్ మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్ చాలాకాలంగా ఈ ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో వాట్సప్‌లో యాడ్స్ తీసుకొచ్చేందుకు ఫేస్‌బుక్ కసరత్తు చేస్తోంది. అయితే వాట్సప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సెక్యూరిటీ ఫీచర్ ఉంది. అంటే మెసేజ్ పంపినవాళ్లు, స్వీకరించినవాళ్లు మాత్రమే ఆ మెసేజ్ చదవగలరు. థర్డ్ పార్టీ యాప్స్ ఆ మెసేజెస్‌ని చదివే అవకాశం లేదు. అలాంటప్పుడు వాట్సప్ యూజర్లకు టార్గెటెడ్ యాడ్స్‌ని డిస్‌ప్లే చేయడంలో ఫేస్‌బుక్‌కు సమస్యలు రావొచ్చు.

    ఫేస్‌బుక్ అకౌంట్స్‌లోని వాట్సప్ నెంబర్లను గుర్తించి టార్గెటెడ్ యాడ్స్‌ని డిస్‌ప్లే చేయాలన్న ఆలోచన కూడా ఉంది. అదే జరిగితే యూజర్లు ఫేస్‌బుక్ అకౌంట్‌ని డిలిట్ చేసే ప్రమాదముందన్న ఆందోళన కంపెనీ ఎగ్జిక్యూటీవ్స్‌లో కనిపిస్తోంది. ఫేస్‌బుక్ డేటాతో వాట్సప్‌లో యాడ్స్ డిస్‌ప్లే చేయాలన్న ప్రతిపాదన గతంలో వివాదాలకు కారణమైంది. వాట్సప్ స్టేటస్‌లో యాడ్స్ ప్లే చేయాలని 2018 లోనే ఆలోచించింది ఫేస్‌బుక్. ఇప్పుడు ఆ ప్రణాళికల్ని వేగవంతం చేసిందన్న వార్తలొస్తున్నాయి. అయితే యాడ్స్ లేవన్న కారణంతో వాట్సప్ యాప్ ఉపయోగించేవారే ఎక్కువ. మరి యాడ్స్ వస్తే యూజర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

    ఇవి కూడా చదవండి:

    Fitness Apps: స్మార్ట్ టీవీ ఉందా? ఈ ఫిట్‌నెస్ యాప్స్‌ ట్రై చేయండి

    Realme X50m 5జీ: రియల్‌మీ ఎక్స్50ఎం 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

    Vodafone Idea: రోజూ 4 జీబీ డేటాతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్స్... వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published: