Facebook 'Clear History' Feature | ఫేస్బుక్లో క్లియర్ హిస్టరీ ఫీచర్ తీసుకొస్తామని 2018 మేలో ప్రకటించింది సోషల్ మీడియా దిగ్గజం. నాటి నుంచి ఫేస్బుక్ యూజర్లు ఈ ఫీచర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫేస్బుక్ యూజర్లకు గుడ్ న్యూస్. 'క్లియర్ హిస్టరీ' ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. యూజర్స్ ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ప్రైవసీ టూల్ ఇది. మీ వ్యక్తిగత సమాచారాన్ని థర్డ్ పార్టీ యాప్స్, వెబ్‌సైట్స్ కలెక్ట్ చేసినట్టైతే మీరు ఒక్క క్లిక్‌తో మొత్తం డేటాను ఎరైజ్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఈ ఏడాదిలోనే అందుబాటులోకి రానుందని మోర్గాన్ స్టాన్లీ టెక్నాలజీ, మీడియా అండ్ టెలికామ్ కాన్ఫరెన్స్‌లో ఫేస్బుక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ డేవిడ్ వెహ్నర్ వెల్లడించారు.
కేంబ్రిడ్జి అనలిటికా స్కామ్ తర్వాత క్లియర్ హిస్టరీ ఫీచర్‌ను జుకర్‌బర్గ్ ప్రతిపాదించారు. ఫేస్బుక్లో క్లియర్ హిస్టరీ ఫీచర్ తీసుకొస్తామని 2018 మేలో ప్రకటించింది సోషల్ మీడియా దిగ్గజం. నాటి నుంచి ఫేస్బుక్ యూజర్లు ఈ ఫీచర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫీచర్ టెస్టింగ్ మార్చి లేదా మేలో మొదలవుతుంది. దీని ద్వారా మీ ఫేస్బుక్లో బ్రౌజింగ్ హిస్టరీని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. హిస్టరీ క్లియర్ చేయొచ్చు. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లకు టార్గెట్ యాడ్స్ ఇవ్వడంలో ఫేస్‌బుక్‌కు సమస్యలు వస్తాయి.
Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.