Home /News /technology /

FACEBOOK IS BRINGING NEW RULES TO COUNTRIES WITH UPCOMING ELECTIONS NK

Facebook : నకిలీ పోస్టులు పెడుతున్నారా... జాగ్రత్త... రూల్స్ కఠినం చేసిన ఫేస్‌బుక్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Facebook : మన దేశంలో ఎన్నికలు వస్తున్నాయి కదా... ఫేస్‌బుక్ అలెర్ట్ అయ్యింది. ఇకపై ఎవరు ఏ పోస్టులు పెట్టినా వాటిని జాగ్రత్తగా పరిశీలించబోతోంది. వివాదాస్పదమైన వాటిని తొలగించడమే కాదు... అలాంటివి పెడితే చర్యలు కూడా తీసుకుంటామంటోంది. ఫేస్‌బుక్ కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
సోషల్‌ మీడియా సంచలనం ఫేస్‌బుక్‌ రాజకీయ ప్రకటనలు, పోస్టులకు సంబంధించిన రూల్స్‌ని కఠినం చేసింది. లోక్‌సభ ఎన్నికలతోపాటూ కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి... నిబంధనలను మార్చింది. ఇండియాతోపాటూ ఉక్రెయిన్, నైజీరియా, యూరోపియన్‌ యూనియన్లలో రాజకీయ ప్రకటనలపై నిబంధనలు కఠినం చేసినట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. ప్రకటనల్లో రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఉండకూడదని చెబుతోంది. అలాంటివి ఉంటే తొలగిస్తామంటోంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఫేస్‌బుక్‌‌ని ఎక్కువగానే వాడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలూ, నేతలూ తమ ప్రకటనల కోసం ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. ఐతే... ఈమధ్య అడ్డమైన ప్రకటనలు, నకిలీ వార్లలు, పనికి మాలిన సర్వేలు, అసత్య ప్రచారాలూ ఎక్కువయ్యాయి. వాటిలో చాలా వరకూ ఫేస్‌బుక్ రూల్స్‌కి వ్యతిరేకంగా ఉంటున్నాయి. కొన్ని ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఉంటున్నాయి.

ఫేస్‌బుక్‌లో వస్తున్న నకిలీ పోస్టులు, అసత్య ప్రచారాలను ఎందుకు ఆపట్లేదని కంపెనీ మేనేజ్‌మెంట్‌పై ప్రపంచ దేశాల నుంచీ ఒత్తిళ్లు ఉన్నాయి. ఇప్పటికే ఇలాంటి చాలా కేసుల్ని దాని వ్యవస్థాపకుల్లో ఒకడైన జుకర్ బర్గ్ కోర్టుల్లో ఎదుర్కొంటున్నారు. ఇలాగైతే కష్టమే అనుకున్న కంపెనీ... గతేడాది నుంచీ తెరవెనక ప్రక్రియ ప్రారంభించింది. పొలిటికల్ యాడ్స్‌ను పరిశీలించే వ్యవస్థను తీసుకొచ్చింది. అందువల్ల ఇకపై అడ్డమైన ప్రకటనలు, ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడితే కుదరదన్నమాట.


మన దేశంలో రాజకీయ ప్రకటనలు, నకిలీ పోస్టులు ఎక్కువే. వాటిని సెర్చ్‌ చేయడానికి వీలుగా ఆన్‌లైన్‌ లైబ్రరీలో ఉంచబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఆరంభంలో ఇది పూర్తిస్థాయిలో పనిచెయ్యకపోయినా, రాన్రానూ పనితీరును మెరుగుపరుస్తామని వివరించింది. నైజీరియాలో ఈ కొత్త విధానాలు ఇవాళ్టి నుంచీ అమల్లోకి వస్తున్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి 16న నైజీరియా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఉక్రెయిన్‌లో మార్చి 31న జరగనుండటంతో వచ్చే నెల నుంచీ ఆ దేశంలో కొత్త రూల్స్ అమల్లోకి తేబోతోంది ఫేస్ బుక్. అందువల్ల ఇకపై ఫేస్‌బుక్‌లో ప్రకటనలు, పోస్టులూ పెట్టేవారు వాస్తవాల్ని మాత్రమే పోస్ట్ చెయ్యాల్సి ఉంటుంది. లేదంటే అకౌంట్ డిలీట్ చేయడమే కాక, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.

Video: కేటీఆర్‌ని జగన్ ఏమని పిలుస్తారో తెలుసా? మీరే చూడండి
First published:

Tags: Facebook, Information Technology, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు