Home /News /technology /

FACEBOOK INC OWNED SOCIAL MEDIA APPLICATIONS WHATSAPP AND INSTAGRAM FACED A GLOBAL OUTAGE LATE ON FRIDAY HERE DETAILS NS

Facebook, Instagram, WhatsApp services down: యూజర్లకు షాక్.. నిలిచిపోయిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ సేవలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫేస్ బుక్ కు చెందిన సోషల్ మీడియా అప్లికేషన్స్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

    ఫేస్‌బుక్ కు చెందిన సోషల్ మీడియా అప్లికేషన్స్ అయిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాట్సాప్ లో అనేక మంది యూజర్లు తాము మెసేజ్ లు సెండ్, రిసీవ్ చేసుకోలేక పోయామని ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేయలేకపోయామని అనేక మంది యూజర్లు ట్విట్టర్ లో తెలిపారు. కొంత మంది యూజర్లు ఫేస్‌బుక్ ను వినియోగిస్తున్న సమయంలోనూ సమస్యలు తలెత్తాయని తెలిపారు, అయితే ఫేస్‌బుక్ యాప్ మాత్రం బాగానే పని చేస్తోందని పలువురు చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో ఫీడ్‌ రీఫ్రెష్‌ కూాడా కాకపోవడంతో యూజర్ల నుంచి అసహనం వ్యక్తమైంది. శుక్రవారం రాత్రి 10.55 గంటల సమయంలో ఈ సమస్య తలెత్తింది. అయితే 11:24 గంటల సమయంలో ఈ సోషల్ మీడియా యాప్స్ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. గతేడాది డిసెంబర్ లోనూ ఈ ఫేస్ బుక్ కు చెందిన సర్వీసులు కొద్ది గంటల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

    అయితే దీనిపై మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఒక్క సారిగా సర్వీసులు నిలిచిపోవడంతో యూజర్లు గందరగోళానికి గురయ్యారు. ఈ అంశంపై వాట్సాప్ స్పందించింది. సర్వీసులు నిలిచిపోవడంతో సహనంతో ఉన్న యూజర్లకు ధన్యవాదాలు అంటూ ప్రకటన విడుదల చేసింది. 45 నిమిషాల్లో సేవలు పునరుద్ధరించామంటూ తెలిపింది.



    సోషల్ మీడియా నేడు ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైన విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా సేవలన్నీ నిలిచిపోవడంతో అందరూ షాక్ అయ్యారు.  ఫోన్ సమస్యా? లేకా నెట్వర్క్ సమస్యా? అనేది తెలియక గందరగోళానికి గురయ్యారు. అనేక మంది యూజర్లు ఆయా యాప్ ను అన్ ఇన్స్టాల్ చేసుకుని మళ్లీ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వారు వెల్లడించారు. మరి కొందరు ఫన్నీ కామెంట్లను పెట్టారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో చాలానే చర్చ జరిగింది. ఎట్టకేలకు సేవలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావడంతో అంతా రిలాక్స్ అయ్యారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Facebook, Instagram, Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు