Facebook: వామ్మో... ఫేస్‌బుక్ మీ మాటల్ని వినేస్తోంది జాగ్రత్త

Facebook | గతంలో యూజర్ల ఆడియోను స్క్రిప్ట్ చేయించామని, ఇప్పుడు చేయించట్లేదని ఫేస్‌బుక్ ఒప్పుకోవడం కూడా విశేషం.

news18-telugu
Updated: August 14, 2019, 3:34 PM IST
Facebook: వామ్మో... ఫేస్‌బుక్ మీ మాటల్ని వినేస్తోంది జాగ్రత్త
Facebook: వామ్మో... ఫేస్‌బుక్ మీ మాటల్ని వినేస్తోంది జాగ్రత్త (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 14, 2019, 3:34 PM IST
మీరు ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌తో కాల్స్, వాయిస్ ఛాట్స్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. మీ మాటల్ని ఫేస్‌బుక్ వినేస్తోంది. అంతే కాదు... మీరు మాట్లాడిన మాటల్ని స్క్రిప్ట్‌గా మార్చేందుకు వందలాది మంది కాంట్రాక్టర్లను నియమించుకుందన్న విషయం తాజాగా బయటపడటం కలకలం రేపుతోంది. ఆ ఆడియో ఎక్కడ్నుంచి సేకరించామన్న విషయం చెప్పకుండా బయటి వ్యక్తులతో వాటిని ట్రాన్‌స్క్రైబ్ చేయిస్తోంది. కొన్నిసార్లు ఆ ఆడియోల్లో అశ్లీల సంభాషణ ఉండటం, వాటిని కూడా స్క్రిప్ట్ రూపంలోకి మార్చడం కలకలం రేపుతున్న అంశం. అయితే ఫేస్‌బుక్ వాటిని ఎందుకు ట్రాన్‌స్క్రైబ్ చేయిస్తుందో అంతుపట్టట్లేదు. అయితే గతంలో యూజర్ల ఆడియోను స్క్రిప్ట్ చేయించామని, ఇప్పుడు చేయించట్లేదని ఫేస్‌బుక్ ఒప్పుకోవడం కూడా విశేషం. ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌లో వాయిస్ ఛాట్స్ ట్రాన్‌స్క్రైబ్డ్ ఆప్షన్ ఎంచుకున్న యూజర్లే ప్రభావితమయ్యారని కంపెనీ తెలిపింది.

ఇప్పటికే అమెజాన్, యాపిల్ లాంటి కంపెనీలు కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నాయి. వినియోగదారులు ఉపయోగించే కంప్యూటర్ డివైజ్‌లోని ఆడియో క్లిప్స్‌ను వినడం ప్రైవసీపై దాడి అన్న వాదన ఉంది. అలెక్సా ఆడియో రిక్వెస్ట్‌లను వినేందుకు అమెజాన్ వేలాది మందిని నియమించుకుందంటూ ఏప్రిల్‌లో మొదటిసారి బయటపెట్టింది బ్లూమ్‌బర్గ్. యాపిల్‌కు చెందిన సిరి, ఆల్ఫబెట్‌కు చెందిన గూగుల్ అసిస్టెంట్ రిక్వెస్ట్‌లను సమీక్షించేందుకు సిబ్బందిని నియమించారన్న విమర్శలున్నాయి. అయితే మానవ ప్రమేయం లేకుండా సమీక్షిస్తున్నామని గూగుల్ చెబుతుంటే, యూజర్ల అనుమతితో చేస్తున్నామని అమెజాన్ స్పష్టం చేసింది.

Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్... లుక్స్ అదుర్స్




ఇవి కూడా చదవండి:

WhatsApp: మీ వాట్సప్‌ని అద్బుతంగా మార్చే 8 ఫీచర్లు ఇవే

Update Mobile Number: బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ మార్చేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి
Loading...
Success Tips: కొత్తవారితో మాట్లాడాలంటే భయమా? ఈ 10 టిప్స్ ఫాలో అవండి
First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...