FACEBOOK IN PROCESS TO BUILD ITS OWN IN APP PODCAST PLAYER NS GH
Facebook Podcast: ఫేస్బుక్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే అందుబాటులోకి పాడ్‌కాస్ట్ ప్లేయర్.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
పాడ్‌కాస్ట్ ప్లేయర్‌ను ఖాతాాదారులకు పరిచయం చేయాలని ఫేస్ బుక్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. త్వరలో బీటా యూజర్లకు ఇన్ యాప్ పాడ్‌కాస్ట్ ప్లేయర్‌ను అందుబాటులోకి తీసుకొస్తారని తెలుస్తోంది.
వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఉన్న అన్ని రకాల ఆప్షన్లను పరిచయం చేయడంలో ముందుంటోంది ఫేస్బుక్. ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో ఉన్న ఫీచర్లు, ఆప్షన్లను ఏదో ఒక పేరుతో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో పాడ్‌కాస్ట్ ప్లేయర్‌ను కూడా పరిచయం చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. త్వరలో బీటా యూజర్లకు ఇన్ యాప్ పాడ్‌కాస్ట్ ప్లేయర్‌ను అందుబాటులోకి తీసుకొస్తారని తాజా సమాచారం. ఫేస్బుక్ ఇటీవల స్పాటిఫై యాప్ ప్లేయర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. స్పాటిఫై పాడ్‌కాస్ట్‌లను ఎఫ్బీలో ఎవరైనా షేర్ చేసినప్పుడు.. దానిపై క్లిక్ చేసి అక్కడే ప్లే చేసి వినవచ్చు. అయితే కొత్త ఇన్ యాప్ ప్లేయర్‌కు దీనికి సంబంధం ఉండదు. ఫేస్‌బుక్‌కి మాత్రమే ఉపయోగపడేలా ప్రత్యేకంగా దీన్ని రూపొందిస్తున్నారు. కొత్త ఇన్ యాప్ ప్లేయర్ వచ్చాక పాడ్కాస్టర్లు చాలా సులభంగా తమ పాడ్కాస్టర్లు షేర్ చేసుకోవచ్చు. పాడ్కాస్ట్ల అప్లోడింగ్ కోసం ఆర్ఎస్ఎస్ ఫీడ్ కానీ, అప్లోడింగ్ విధానాన్ని కానీ ఎంచుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. BSNL Prepaid Plan: రూ. 397కే ఏడాది వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్లు.. ప్రయోజనాలివే.. WhatsApp group admin: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అందుకు బాధ్యుడు కాదు.. తేల్చి చెప్పిన హైకోర్టు
ఫేస్బుక్, స్పాటిఫై కలసి ఇటీవల ఫేస్బుక్ మినీ ప్లేయర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు ఫేస్బుక్లో ఎవరైనా స్పాటిఫైకి సంబంధించిన పాట, పాడ్‌కాస్ట్‌ను షేర్ చేస్తే.. దానిపై క్లిక్ చేసి అక్కడే వినే అవకాశం ఉంది. పోస్టు మీద క్లిక్ చేస్తే అది స్పాటిఫై యాప్‌లోకి వెళ్లకుండా అక్కడే మినీ ప్లేయర్లో ప్లే అవుతుంది. ఈ ఆప్షన్ బాగుంది అని అనుకునేలోపే.. ఫేస్బుక్ సొంత పాడ్‌కాస్ట్ ప్లేయర్‌ను సిద్ధం చేసుకుంటోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మన దేశంలో పాడ్‌కాస్టింగ్ జోరు పెరుగుతోంది.
ఫేస్బుక్లో పర్సనలైజ్డ్ యాడ్స్‌కు సంబంధించి ప్రత్యేకమైన ఆప్షన్లు ఉంటాయి. యూజర్ డేటాను తీసుకుని, అందుకు తగ్గట్టుగా యాడ్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు పాడ్కాస్టింగ్లోకి కూడా వస్తే... అక్కడ కూడా అలాంటి యాడ్స్, ట్రాకింగ్ ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే పాడ్ కాస్ట్‌ల మధ్యనో, ముందో కచ్చితంగా యాడ్స్ వచ్చి చేరుతాయి. దాంతోపాటు పే వాల్, సబ్స్క్రిప్షన్ లాంటివి కూడా వస్తాయి. ఫేస్బుక్ తరువాత యాపిల్, గూగుల్, అమెజాన్ లాంటి సంస్థలు కూడా ఈ విభాగంలోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.