Home /News /technology /

FACEBOOK HAS PERMANENTLY DELETED TWO POPULAR FEATURES KNOW THE REASON HERE GH VB

Facebook Features: రెండు పాపులర్ ఫీచర్లను శాశ్వతంగా తొలగించిన ఫేస్‌బుక్.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నియర్ బై ఫ్రెండ్స్ (Nearby Friends), వెదర్ అలర్ట్స్ (Weather Alerts) ఫీచర్లను నిలిపివేస్తున్నట్లు ఫేస్‌బుక్ తాజాగా ప్రకటించింది. ఈ నెలాఖరు నుంచి ఈ రెండు ఫీచర్లను మూసివేస్తున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం పేర్కొంది.

సోషల్ మీడియా(Social Media) దిగ్గజం ఫేస్‌బుక్ (Facebook) తన యూజర్లకు ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్లలోని కొన్ని మోస్ట్ పాపులర్ ఫీచర్లను అందించడానికి ఫేస్‌బుక్ యూజర్ల లొకేషన్ పై ఆధారపడుతుంది. యూజర్ల లొకేషన్ యాక్సెస్‌ చేసి పోస్ట్స్‌లో లొకేషన్ ట్యాగ్(Location Tag) చేయడానికి, లోకల్ యాడ్స్ యాక్సెస్ చేయడానికి, సమీపంలోని ఫ్రెండ్స్‌ను కనుగొనడానికి ఫేస్‌బుక్ అనుమతిస్తుంది. అలాగే వెదర్ అలర్ట్స్(Alert) కూడా లొకేషన్ ఆధారంగా యూజర్లకు అందిస్తుంది. అయితే ఫ్రెండ్స్‌ను కనుగొనే నియర్ బై ఫ్రెండ్స్ (Nearby Friends), వాతావరణ సూచనలు అందించే వెదర్ అలర్ట్స్ (Weather Alerts) ఫీచర్లను నిలిపివేస్తున్నట్లు ఈ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ తాజాగా ప్రకటించింది. ఈ నెలాఖరు నుంచి ఈ రెండు ఫీచర్లను మూసివేస్తున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం పేర్కొంది. దీనర్థం మే 31, 2022 తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది యూజర్లకు నియర్ బై ఫ్రెండ్స్, వెదర్ అలర్ట్స్ అందుబాటులో ఉండవు.

ఈ రెండు ఫీచర్లు చాలా సంవత్సరాలుగా యూజర్లకు సేవలందిస్తున్నాయి. కానీ మెటా కొత్త పాలసీలకు ఈ రెండు ఫీచర్లు వ్యతిరేకంగా ఉన్నాయి. నియర్ బై ఫ్రెండ్స్ (Nearby Friends) అనేది సమీపంలోని స్నేహితులు, యూజర్లకు సమీపంలో ఉన్న ఇతర యూజర్లను గుర్తించడానికి యూజ్ అవుతుంది. దీని కోసం ఫేస్‌బుక్ మీ లొకేషన్ యాక్సెస్ చేస్తుంది. సమీపంలోని ఇతర వ్యక్తులను ట్రాక్ చేయడానికి లొకేషన్ యాక్సెస్ తప్పనిసరి. కచ్చితమైన వెదర్ అలర్ట్స్ (Weather Alerts) చూపించాలన్నా లొకేషన్ తప్పనిసరి. యాక్సెస్ లేకుండా మీకు ఆ ప్రాంతంలో సరైన ఉష్ణోగ్రతను అందించడం సాధ్యం కాదు. అందుకే ఫేస్‌బుక్ మీ లొకేషన్ కి యాక్సెస్ ఇవ్వాలని యూజర్లను కోరుతుంది. అయితే మే 31 తర్వాత ఈ రెండు ఫీచర్లు నిలిచిపోతాయి కాబట్టి వీటికోసం లొకేషన్ యాక్సెస్ ఇవ్వమని ఫేస్‌బుక్ అడగదు. యూజర్లు లొకేషన్ హిస్టరీని ఆగస్టు 1, 2022 వరకు వీక్షించవచ్చని, డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చని ఈ కంపెనీ పేర్కొంది. ఆ తర్వాత దాని సర్వర్‌ల నుంచి యూజర్లు లొకేషన్ హిస్టరీ డేటాను తొలగిస్తుంది.

ఇదీ చదవండి : ఈ నగరానికి ఏమైంది..? మొన్న చాక్లెట్లు.. ఇప్పుడు మత్తు ఇంజక్షన్లు..

అయితే ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ల కోసం లొకేషన్ యాక్సెస్‌ను నిలిపివేస్తున్నందున అది లొకేషన్ డేటాను సేకరించడం పూర్తిగా ఆపివేస్తుందని కాదు. ఈ ప్లాట్‌ఫామ్ ఇతర ఫీచర్‌ల కోసం మీ లొకేషన్ డేటాను సేకరిస్తూనే ఉంటుంది. ఎందుకనేది కంపెనీ స్పష్టంగా తెలపలేదు. యాపిల్ కఠినమైన ట్రాకింగ్ పద్ధతులు తీసుకొచ్చాక కఠినమైన ఫేస్‌బుక్ చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది.

దీనివల్ల గత ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలంలో దాని కూడా తగ్గిపోయింది. మార్క్ జుకర్‌బర్గ్ ఐఫోన్ తయారీదారు నుంచి వచ్చిన మార్పులను కూడా ఎత్తి చూపారు, ఇది తమ డిజిటల్ యాడ్స్ రెవిన్యూని తగ్గించినట్లు తెలిపారు. గూగుల్ కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా లొకేషన్ యాక్సెస్‌ని ఉపయోగించే యాప్‌లను తగ్గించాలని చూస్తోంది. ఫేస్‌బుక్ కూడా లొకేషన్ యాక్సెస్‌ చేస్తున్నట్లు తేలితే సమీప భవిష్యత్తులో ఆండ్రాయిడ్‌లో ఫీచర్లను అమలు చేయడంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Facebook, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు