ఎమోజీల గురించి తెలియని వారుండరు. నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండటంతో సందేశాలను ఎమోజీల రూపంలో పంపడం అధికమైంది. మరి సౌండ్ మోజీల గురించి ఎప్పుడైనా విన్నారా? ఇవి కూడా ఎమోజీల మాదిరిగానే ఉంటాయి. కానీ అదనంగా వాయిస్ కూడా ఉంటుంది. ప్రపంచ ఎమోజీల దినోత్సవం(జులై 17) రానున్న తరుణంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సౌండ్మోజీలను తన మెసేంజర్లో చేర్చనుంది. మెసేంజర్లో సౌండ్మోజీలకు సంబంధించిన పూర్తి లైబ్రరీని ఫేస్బుక్ అందించనుంది. అదనపు సౌండ్ ఎఫెక్టులను, సౌండ్ బైట్లను క్రమం తప్పకుండా జోడిస్తామని సంస్థ తెలియజేసింది. అన్ని ఛాట్లకు సౌండ్మోజీల ఆప్షన్ ఉంటుందని, ప్రస్తుత లైనప్ లో ఈవిల్ లాఫర్, డ్రమ్ రోల్, చప్పట్లు లాంటి శబ్దాలు ఉంటాయని తెలిపింది. వీటితో పాటు ప్రముఖ టీవీ షోలు, సినిమాలకు సంబంధించిన ఆడియో క్లిప్పులను పొందుపరచనుంది. WhatsApp New Feature: వాట్సాప్ సూపర్ ఫీచర్.. ఫోన్ లేకపోయినా మేసేజ్ చేసే ఛాన్స్.. ఎలాగంటే
అసలు సౌండ్మోజీలు అంటే ఏంటి?
సాధారణంగా మీరు ఎవరికైనా మెసేజ్లు పంపుతున్నప్పుడు ఎమోజీని ఎలాగైతే పంపుతారో.. సౌండ్మోజీలు కూడా అలాగే ఉపయోగిస్తారు. కాకపోతే ఎమోజీతో కూడిన ఆడియో క్లిప్పు ఇందులో అదనంగా ఉంటుంది. మీ స్నేహితుడు చప్పట్లు కొట్టే ధ్వనిని మనస్సులో విజువలైజ్ చేయడానికి బదులుగా కొన్ని సెకన్ల పాటు చప్పట్లు కొట్టే సౌండ్ క్లిప్పును వినవచ్చు. ప్రస్తుతం సౌండ్మోజీ శబ్దాల్లో చప్పట్లు, బర్త్ డే పార్టీ డ్రమ్ రోల్, వాయిధ్యాలు, కారు సౌండ్, ఈవిల్ లాఫర్ లాంటివి ఉన్నాయని ఫేస్ బుక్ తెలిపింది. రెబెక్కా బ్లాక్ లాంటి నటుల ఆడియో క్లిప్పులతో పాటు యూనివర్సల్ పిక్చర్స్, ఎఫ్9, ఎన్బీసీ, యూనివర్సల్ టెలివిజన్ బ్రూక్లిన్ నైన్-నైన్, నెట్ ఫ్లిక్స్, బ్రిడ్జర్టన్ లాంటి టీవీ షోలు, సినిమాల ఆడియో క్లిప్పులు కూడా ఇందులో ఉన్నాయి.
సౌండ్మోజీలు ఎలా పంపాలి?
సౌండ్మోజీలు పంపాడానికి మెసేంజర్ యాప్లో ఏదైనా చాట్ ఓపెన్ చేసి టెక్స్ట్ బాక్స్ కార్నర్లో ఉన్న స్మైలీ ఫేస్ ఐకాన్ పై నొక్కాలి. ఇక్కడ రెండో మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చాట్లలో పంపగల స్టిక్కర్లు, GIFలు ఉంటాయి. ఇక్కడ మీరు టెక్స్ట్ బాక్స్ కింద లౌడ్ స్పీకర్ చిహ్నాన్ని చూస్తారు. దీనిపైన కొత్తగా ఓపెన్ అయిన బాక్స్ ఉంటుంది. లౌడ్ స్పీకర్ చిహ్నంపై నొక్కడం ద్వారా సౌండ్మోజీ మెనూ తెరుచుకుంటుంది. మీకు ఆసక్తికరంగా అనిపించిన సౌండ్మోజీని ఎంచుకొని దానిపై నొక్కితే, అవతలి వారికి అది సెండ్ అవుతుంది.
భారత వినియోగదారుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎమోజీల గురించి ఫేస్ బుక్ చెప్పింది. Gen Z అని పిలిచే 18-24 సంవత్సరాల వయస్సు గల వారు రెడ్ హార్ట్, లాఫింగ్, ప్రేయర్ ఎమోజీలు ఇష్టపడతారని, 25-44 మధ్య వయస్సు కలిగిన మిలీనియల్స్ చాలా తరచుగా కృతజ్ఞతలు లేదా ప్రేయర్ ఎమోజీ, రెడ్ హార్ట్, బర్త్ డే కేక్ ఎమోజీలను పంపుతారని చెప్పింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.