FACEBOOK GOING TO INTRODUCE NEW FEATURE VOICE AND VIDEO CALL ON FB EVK
Facebook Feature: ఫేస్బుక్లో అదిరిపోయే ఫీచర్
(ప్రతీకాత్మక చిత్రం)
కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను నిరంతరం ఫేస్బుక్(Facebook) కట్టిపడేస్తూనే ఉంటుంది. అందుకే మరోసారి సరికొత్త ఫీచర్‌తో వినియోగదారుల మందుకు వచ్చింది. ఫేస్ బుక్ నుంచే కాల్, వీడియో కాల్ (Video Call) చేసుకొనే సదుపాయాన్ని అందించనుంది.
కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను నిరంతరం ఫేస్బుక్(Facebook) కట్టిపడేస్తూనే ఉంటుంది. అందుకే మరోసారి సరికొత్త ఫీచర్‌తో వినియోగదారుల మందుకు వచ్చింది. ఫేస్ బుక్ నుంచే కాల్, వీడియో కాల్ (Video Call) చేసుకొనే సదుపాయాన్ని అందించనుంది. వినియోగదారుల సౌకర్యం కోసం ఇప్పటికే వీడియా కాలింగ్ ఆప్షన్ పై వర్క్ చేస్తున్నామని బ్లూమ్ బెర్గ్ తెలిపారు.
వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు మార్క్ జూకర్ బర్గ్ (Mark Zuckerberg) ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వీడియో కాల్‌తో ఫేస్ బుక్ మరింత ఆకర్షణీయంగా వినియోగించుకోగలరని యాజమాన్యం పేర్కొంది.
కొత్త ఫీచర్లను నిరంతరం అందించే ఫేస్ బుక్ ఈ వీడియో కాల్ ఫీచర్‌ను ఇప్పటికే ఫేస్బుక్ మెసేంజర్‌కు(Facebook Messenger) అటాచ్ చేసింది. దీని ద్వారా వినియోగదారులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. వారు ప్రతీ సారి వీడియో కాల్ చేసేటప్పుడు ఫేస్‌బుక్‌ను ఆపేసి మెసేంజర్‌లోకి రావాల్సి వస్తోంది. దీంతో యూజర్లు ఫేస్ వినియోగం తగ్గిస్తున్నారనే మార్క్ జూకర్ బర్గ్ గుర్తించారు. దీంతో వినియోగదారులను ఎక్కువ సేపు ఫేస్బుక్ వినియోగించుకోనేలా చూసే ఉద్దేశంతో ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.
2014లో ఫేస్‌బుక్‌ను మెసేజర్ను వేరు చేశారు. వాయిస్, వీడియో కాలింగ్ ఆప్షన్లను ఫేస్బుక్ మెసేంజర్‌కు జోడించారు. అయితే ప్రస్తుతం వీడియో కాలింగ్ ఆప్షన్ ఫేస్బుక్కే ఇస్తే మెసేంజర్‌ను కేవలం మెసేజ్‌లకు మాత్రమే వినియోగించేలా చేస్తారో లేక.. మరో విధంగా మారుస్తారో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.