ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సరికొత్త క్లౌడ్ గేమింగ్ సేవలను ప్రవేశపెట్టనుంది. దీంతో క్లౌడ్ గేమింగ్ విభాగంలో ఇప్పటికే ఇండిపెండెంట్ ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉన్న గూగుల్ స్టేడియా లేదా అమెజాన్ లూనా వంటి వాటికి ప్రధాన పోటీదారులగా నిలువనుంది. అయితే, వాటి మాదిరిగా కాకుండా ఫేస్బుక్ సంస్థ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే నేరుగా ఆటలను రోల్ అవుట్ చేయనుంది. అయితే, ఈ సేవలు ప్రస్తుతం యుఎస్ లోని పరిమిత వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆయా వినియోగదారులు ఫేస్బుక్ వెబ్ మరియు ఆండ్రాయిడ్ యాప్ ద్వారా వాటిని యాక్సెస్ చేయవచ్చు. అయితే, ప్రస్తుతానికి ఆపిల్ విధించిన పరిమితుల కారణంగా ఐఓఎస్ పరికరాల్లో మాత్రం ఫేస్బుక్ క్లౌడ్ గేమింగ్ సేవలు అందుబాటులో రావని ది వెర్జ్ తన నివేదికలో స్పష్టం చేసింది.
ఈ నూతన ఫ్రీ టు ప్లే క్లౌడ్ గేమింగ్ సేవలపై ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ జాసన్ రూబిన్ ది క్లర్జ్తో మాట్లాడుతూ నూతనంగా ప్రారంభం కానున్న క్లౌడ్ సేవలతో వినియోగదారులు ఇకపై ఉచితంగా గేమ్స్ ఆడటానికి కంట్రోలర్ వంటి అదనపు హార్డ్వేర్లను ఉపయోగించాల్సిన అవసరం లేదని, ఫేస్బుక్ గేమ్స్ ట్యాబ్‌లోని ప్రత్యేక విభాగంలోనే ఆయా ఆటలు అందుబాటులో ఉంటాయన్నారు. అయితే, దాని హెచ్‌టీఎంఎల్ 5 గేమ్స్ ప్రస్తుతం ఉన్న విధంగానే అందుబాటులో ఉంటాయి. ఆస్పాల్ట్ 9 మరియు ఐడిల్ రోల్‌ప్లేయింగ్ గేమ్ మొబైల్ లెజెండ్స్: అడ్వెంచర్ వంటి గేమ్స్ ఇదివరకే పరిమిత వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్న విషయం తెలిసింతే. అయితే, ఫేస్బుక్ త్వరలోనే వీటికి మరికొన్ని గేమ్స్‌ను జోడించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నూతన సేవలపై ఫేస్బుక్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ, క్లౌడ్ గేమింగ్‌పై ఫేస్బుక్ తీసుకురానున్న నూతన సేవలు దాని పోటీదారులకు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే, ఈ ప్లే క్లౌడ్ గేమ్ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యేకమైన ఆటలను తీసుకురావడమే కాదు, దీనిలో తేలికగా టైటిల్స్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఇదే తరహాలో భవిష్యత్తులో కూడా మరిన్ని క్లౌడ్ గేమ్స్‌ను చేర్చనున్నామని ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. కాగా, ఫేస్బుక్ తన ప్లాట్ఫామ్లో గత పదేళ్ల నుంచి గేమింగ్ సేవలను అందిస్తోంది. ఫేస్బుక్ ప్లాట్ఫామ్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటెడ్ గేమ్స్‌కు ఈ నూతన క్లౌడ్ గేమింగ్ సేవలు పొడిగింపుగా కంపెనీ పేర్కొంది.
అయితే, ఈ ఏడాది ప్రారంభంలో ఫేస్బుక్ నుంచి లాంచ్ అయిన ఫేస్బుక్ గేమింగ్ యాప్‌కు క్లౌడ్ గేమింగ్ సేవలు వర్తిస్తాయా? లేదా? అనే దానిపై ఆ కంపెనీ స్పష్టతనివ్వలేదు. ప్రపంచవ్యాప్త యూజర్లకు ఈ ఉచిత క్లౌడ్ గేమింగ్ సేవలు ఎప్పుడు అందుబాటులోకి తీసుకురానున్న విషయాన్ని మాత్రం ఫేస్బుక్ అధికారికంగా ప్రకటించలేదు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.