Facebook: ఇదేంది ఫేస్‌బుక్..? సామాన్యులకు ఒకలా.. వీఐపీలకు మరోలా రూల్స్..

(ప్రతీకాత్మక చిత్రం)

Facebook: తమ పాలసీ వినియోగదారులందరికీ సమానంగా వర్తిస్తుందని ఫేస్‌బుక్ "క్రాస్ చెక్(cross check)" లేదా "ఎక్స్ చెక్(XCheck)" చెబుతోంది. కానీ ఇప్పుడు ఫేస్‌బుక్ మిలియన్ల మంది సెలబ్రెటీలపై తమ పాలసీ అమలు చేయడం లేదని నివేదికలు పేర్కొంటున్నాయి

  • Share this:
సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ (Facebook) తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లను తీసుకొస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారుల కంటెంట్ ను పరిశీలించడానికి సరికొత్త పాలసీలను పరిచయం చేస్తోంది. అభ్యంతరకర, హింసాత్మక పోస్టులను తక్షణమే తొలగిస్తూ తమ ఫ్లాట్ ఫామ్‌ని సురక్షితంగా ఉంచుతోంది. అయితే సామాన్య వినియోగదారులకు అమలు చేస్తున్న పాలసీల నుంచి వీఐపీలను మినహాయించడానికి ఫేస్‌బుక్ క్వాలిటీ కంట్రోల్ మెకానిజమ్‌ ప్రోగ్రామ్‌లో సరికొత్త మార్పులు తీసుకువచ్చింది. ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర సెలబ్రిటీలకు ఫేస్‌బుక్ తమ సొంత నియమాల నుంచి మినహాయింపులు ఇస్తుందట. వాల్ స్ట్రీట్ జర్నల్ సోమవారం ప్రచురించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.

తమ పాలసీ వినియోగదారులందరికీ సమానంగా వర్తిస్తుందని ఫేస్‌బుక్ "క్రాస్ చెక్(cross check)" లేదా "ఎక్స్ చెక్(XCheck)" చెబుతోంది. కానీ ఇప్పుడు ఫేస్‌బుక్ మిలియన్ల మంది సెలబ్రెటీలపై తమ పాలసీ అమలు చేయడం లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఫేస్‌బుక్ ప్రతినిధి ఆండీ స్టోన్ పలు ట్వీట్‌లు చేస్తూ తమ ప్రోగ్రామ్‌ను సమర్థించారు. ఫేస్‌బుక్ నిబంధనల అమలు పర్‌ఫెక్ట్‌గా లేదని తమకు తెలుసునని స్పష్టం చేశారు. తాము రెండు న్యాయ వ్యవస్థను అమలు చేయడం లేదన్నారు. తమ నియమాల వల్ల ఎటువంటి తప్పు జరగకూడదనే ఉద్దేశంతోనే హైప్రొఫైల్ వీఐపీలకు మినహాయింపులు ఇస్తున్నామని స్టోన్ తాజా నివేదికలకు బదులిచ్చారు. కంటెంట్ రివ్యూ చేసే ప్రక్రియలో సరైన వేగం, కచ్చితత్వం కూడా లేదన్నారు.

QR Code: ఈ యాప్స్ ఉంటే... క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం చాలా ఈజీ

అత్యాచార ఆరోపణలు చేసిన ఒక మహిళ నగ్న ఫొటోను గతంలో బ్రెజిలియన్ ఫుట్ బాల్ ఆటగాడు నెయ్‌మార్ పోస్ట్ చేశారు. అది తమ నియమాలకు విరుద్ధమని ఫేస్‌బుక్ తొలగించింది. ఈ విషయాన్ని ఓ నివేదిక ప్రస్తావించింది. కానీ ఇకపై అలా తొలగించడం జరగదని తెలుస్తోంది. దాంతో తుది మధ్యవర్తిగా ఏర్పాటు చేసిన స్వతంత్ర బోర్డుకు ఇచ్చిన హామీలను ఫేస్‌బుక్ ధిక్కరిస్తున్నట్లు అవుతోంది. కంటెంట్ మోడరేషన్‌కి సంబంధించి ఫేస్‌బుక్ డబుల్ స్టాండర్డ్ లను అవలంబించడంపై స్వతంత్ర బోర్డు ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Okaya e-Scooter: తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్... ఒకాయా ఫ్రీడమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది

ఫేస్‌బుక్ కంటెంట్ మోడరేషన్ ప్రక్రియలలో పారదర్శకత లోపించడంపై పర్యవేక్షణ బోర్డు అనేక సందర్భాల్లో ఆందోళనను వ్యక్తం చేసిందని ఆ బోర్డు ప్రతినిధి జాన్ టేలర్ వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి ఫేస్‌బుక్ తమ సెలబ్రిటీల అకౌంట్ల నిర్వహణపై బోర్డు ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.

Wi-Fi Connection: మీ వైఫై కనెక్షన్ ఇతరులు వాడుతున్నారా? ఇలా చెక్ చేసుకోండి

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం కొందరు యూజర్‌లు "వైట్-లిస్టెడ్" జాబితాలో చేరిపోయారని.. వారికి ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇతర సందర్భాల్లో ప్రాబ్లమాటిక్ కంటెంట్ రివ్యూ చేయడంలో ఫేస్‌బుక్ విఫలమవుతుందని నివేదించింది. XCheck 2020లో కనీసం 5.8 మిలియన్ యూజర్లను చేర్చుకుందని నివేదిక తెలిపింది. ఫేస్‌బుక్ మూడేళ్ల క్రితం క్రాస్ చెకింగ్ గురించి ఒక పోస్టు షేర్ చేసింది. ప్రొఫైల్, పేజీ, కంటెంట్ ను రక్షించదని కానీ తమ నిర్ణయం సరైనదేనని నిర్ధారించుకోవడానికి క్రాస్ చెకింగ్ చేస్తామని ఫేస్‌బుక్ తెలిపింది.
Published by:Shiva Kumar Addula
First published: